'చైనా మాట ఎత్తడానికే మోదీ భయపడుతున్నారు' - రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, Atul Loke
జాతిని ఉద్దేశించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విమర్శనాస్త్రాలు సంధించారు.
తన ప్రసంగంలో మోదీ.. కరోనావైరస్ గురించి మాట్లాడారు. సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతల గురించి ఆయన ప్రస్తావించ లేదు.
ఈ విషయంపై రాహుల్ గాంధీ ఓ కవితను ట్వీట్ చేస్తూ విమర్శించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
"అక్కడి ఇక్కడి ముచ్చట్లు ఎందుకు... అసలు సొత్తు దోపిడీకి ఎలా గురైందో చెప్పు..
నాకు దారిలో పోయేవారి మీద ఎలాంటి ఫిర్యాదులేదు.. నీ నాయకత్వం మీదే సందేహం.." అనే అర్థం వచ్చే పద్యాన్ని రాహుల్ ట్వీట్ చేశారు.
అయితే, ఆ కవితను ఆయన కొంత తప్పుగా కోట్ చేశారు. ఇదీ అసలు కవిత:
''తూ ఇధర్-ఉధర్ కీ న బాత్ కర్, యే బతా కీ కాఫిలా క్యోఁ లూటా,
ముఝే రహజనోంసే గిలా నహీ, తేరీ రహబరీ కా సవాల్ హై''
మరోవైపు చైనా గురించి ప్రస్తావించడానికే మోదీ భయపడుతున్నారని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
అయితే, రాహుల్ ఈ కవితను తప్పుగా రాశారంటూ సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి.
ఎంఐఎం పార్టీ నాయకుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా మోదీని విమర్శించారు.
"ఈ రోజు చైనా గురించి మోదీ మాట్లాడతారని ఆశించాం. కానీ ఆయన శనగల గురించి మాట్లాడారు." అంటూ ఒవైసీ ఎద్దేవాచేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
"త్వరలో రాబోతున్న చాలా పండుగుల గురించి మోదీ మాట్లాడారు. అయితే బక్రీద్ పేరు ప్రస్తావించడం ఆయన మరచిపోయారు. మోదీకి ముందుగానే బక్రీద్ శుభాకాంక్షలు చెబుతున్నా" అని వ్యాఖ్యానించారు.
ఆగస్టు తొలి వారంలో బక్రీద్‌ను జరుపుకొంటారు.

ఫొటో సోర్స్, ANI
కరోనావైరస్‌కు కట్టడివేసే చర్యలను సరైన సమయంలో తీసుకున్నామని ప్రసంగంలో మోదీ చెప్పారు.
సరైన సమయంలో తీసుకున్న చర్యలు లక్షలాది మంది ప్రాణాలు కాపాడాయని, అయితే అన్‌లాక్-1 తర్వాత ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగిందని అన్నారు.
గరీబ్ కల్యాణ్ యోజనను పొడిగిస్తున్నట్లు వివరించారు.
పేదలకు ఐదు కేజీల బియ్యం
మూడు నెలల నుంచీ ప్రభుత్వం 80 కోట్ల మందికి ఒక్కొక్కరికి ఐదు కేజీల బియ్యం లేదా గోధుమలు పంపిణీ చేశామని, ఈ సదుపాయాన్ని నవంబరు వరకూ పొడిగిస్తామని మోదీ చెప్పారు.
దీని కోసం ప్రభుత్వానికి 90 వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని వివరించారు.
సాధారణంగా 16 నుంచి 17 నిమిషాలు మాట్లాడే మోదీ.. ఈ సారి చాలా కొంచెంసేపు మాట్లాడారు.

ఫొటో సోర్స్, SANJAY DAS
మేం ఎప్పటి నుంచో ఇస్తున్నాం: మమతా బెనర్జీ
మరోవైపు మోదీపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా విమర్శలు సంధించారు.
"కొన్ని చైనా యాప్‌లను నిషేధించినంత మాత్రాన ఏమీ జరగదు. చైనాకు దీటుగా సమాధానం చెప్పాలి."
గరీబ్ కల్యాన్ పేరుతో మోదీ ఇస్తున్న రేషన్.. తాము జూన్ 2012 నుంచీ ఇస్తున్నామని ఆమె చెప్పారు.
అంతకుముందు, చైనా విషయంలో చర్యలు తీసుకోవాలంటూ రాహుల్ గాంధీ ఓ వీడియో మెసేజ్‌ను ట్విటర్‌లో విడుదల చేశారు. భారత్ గడ్డపైనున్న చైనా సైన్యాన్ని ఎప్పుడు వెళ్లగొడతారని ఆయన మోదీని ప్రశ్నించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
"భారత భూభాగాన్ని చైనా తీసుకుందని అందరికీ తెలుసు. లద్దాఖ్‌లోని మన ప్రదేశాల్లో చైనా సైన్యం తిష్టవేసిందని అందరికీ తెలుసు. ఎప్పుడు చైనా సైన్యాన్ని వెనక్కి పంపిస్తారు? ఎలా చేస్తారు?" అని రాహుల్ ప్రశ్నించారు.
లాక్‌డౌన్‌తో తలెత్తిన వలస కూలీల సంక్షోభంపైనా రాహుల్ మాట్లాడారు. ఒక్కో పేద కుటుంబానికి కనీసం రూ.7,500 ఇవ్వాలని ఆయన అన్నారు.
"న్యాయ యోజన లాంటి పథకాలను అమలుచేయాలి. పూర్తిగా కాకపోయినా.. ఆరు నెలలైనా వీటిని అమలుచేయాలి. ప్రతి పేద కుటుంబం ఖాతాలో రూ.7,500 చొప్పున జమ చేయాలి. దీంతో మార్కెట్‌లో డిమాండ్ పెరుగుతుంది. ఆర్థిక వ్యవస్థా గాడిన పడుతుంది. అయితే ఈ ఆలోచనను ప్రభుత్వం తిరస్కరిస్తోంది. తమ దగ్గర నిధులు లేవని చెబుతోంది."అని రాహుల్ అన్నారు.
కరోనావైరస్ వ్యాప్తి, చైనాతో ఉద్రిక్తతలపై తరచూ మోదీపై రాహుల్ ప్రశ్నలు సంధిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- రైతుబంధు సాయంలో సగం పెద్ద రైతులకేనా
- చైనాలో మరో కొత్త వైరస్, మహమ్మారిగా మారనుందా
- భారత్ బయోటెక్: జులై నుంచి మనుషులపై కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు
- చైనా ప్రభుత్వానికి మేం భారతీయ యూజర్ల డాటా ఇవ్వలేదు: టిక్ టాక్
- ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ - సోనియాతో రాజీవ్ గాంధీ
- రెండు నెలలకు సరిపడా గ్యాస్ సిలెండర్లను సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశం.. యుద్ధానికి సూచనా?
- నిజంగానే భారత్ మహిళలకు అత్యంత ప్రమాదకర దేశమా? రాయిటర్స్ నివేదికలో వాస్తవమెంత?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








