సైక్లోన్ ఆంఫన్: బెంగాల్ సుందర్బన్ సమీపంలో తీరం దాటిన పెను తుఫాను.. ఇద్దరు మృతి

ఫొటో సోర్స్, Reuters
బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఆంఫన్ తుఫాను పశ్చిమబెంగాల్‌లోని సుందర్బన్ సమీపంలో తీరం దాటిందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
తుఫాను బుధవారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 5.30 గంటల మధ్య.. పశ్చిమ బెంగాల్‌లోని దిఘా - బంగ్లాదేశ్‌లోని హతియా ద్వీపం మధ్య తీరం దాటినట్లు వివరించింది. తీరం దాటే సమయంలో గంటకు 185 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని చెప్పింది.
తుపాను కారణంగా పశ్చిమ బెంగాల్‌లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు ఆ రాష్ట్ర అధికారులు తెలిపారని పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.
తుపాను తీవ్రత కారణంగా పశ్చిమబెంగాల్, ఒడిశాలలో విధ్వంసం కొనసాగింది. ఒడిశా భారీ ఎత్తున చెట్లు కూలిపోగా, పలుచోట్ల ఇళ్లు కూడా నేలకూలాయి.
పశ్చిమబెంగాల్ తీర ప్రాంతంలో గంటకు 160 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ డైరక్టర్ జనరల్ వెల్లడించారు.

ఫొటో సోర్స్, @Indiametdept
1999 తర్వాత బంగాళాఖాతంలో ఏర్పడిన తొలి సూపర్ సైక్లోన్ ఇదేనని నిపుణులు చెబుతున్నారు.
తుపాను కారణంగా సముద్రం 10-16 అడుగుల వరకూ పోటెత్తే అవకాశాలున్నాయని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. ఈ తీరున సముద్ర మట్టం పెరిగితే తీర ప్రాంతాల్లోకి ప్రమాదకర నీటి ప్రవాహాలు వచ్చే ముప్పు ఉంది.
అయితే, గాలులు కాస్త బలహీనపడ్డాయని బీబీసీ వెదర్ తెలిపింది. గురువారం బంగ్లాదేశ్ వైపు, ఆ తర్వాత భూటాన్‌వైపు ఈ తుపాను కదిలే అవకాశాలున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
కోవిడ్-19 కారణంగా లాక్‌డౌన్, భౌతిక దూరం నిబంధనలు అమల్లో ఉండటంతో ప్రభావిత ప్రాంతాల నుంచి జనాలను తరలించడంలో అధికారులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
భారత్‌లో, బంగ్లాదేశ్‌లో పాఠశాలలు, ఇతర భవనాలను తాత్కాలిక శిబిరాలుగా మార్చుతున్నారు.

ఫొటో సోర్స్, AMBARISH NAG BISWAS
కోవిడ్-19 భయంతో జనాలు శిబిరాలకు వచ్చేందుకు వెనుకాడుతున్నారని పశ్చిమ బెంగాల్ పోలీసులు బీబీసీతో చెప్పారు. పశ్చిమ బెంగాల్, ఒడిశా ప్రభుత్వాలు దాదాపు ఐదు లక్షల మందిని తుపాను ప్రభావిత ప్రాంతాల నుంచి తరలించాయి.
అయితే, వీరికి పునరావాసం కల్పించడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఒడిశాలో 800 శిబిరాలు ఉంటే, వాటిలో 250 శిబిరాలను ప్రస్తుతం కరోనావైరస్ క్వారంటైన్ కేంద్రాలుగా ఉపయోగిస్తున్నారు.
దాదాపు 20 లక్షల మందిని పునరావస శిబిరాలకు తరలిస్తున్నట్లు బంగ్లాదేశ్ విపత్తు నిర్వహణ మంత్రి ఇదివరకు బీబీసీతో చెప్పారు.

మయన్మార్ నుంచి వచ్చి బంగ్లాదేశ్‌లోని కిక్కిరిసిన శిబిరాల్లో తలదాచుకుంటున్న వేల మంది రోహింగ్యాలూ అంఫాన్ గురించి ఆందోళన చెందుతున్నారు. అయితే తుపాను పయనించే మార్గంలో రోహింగ్యా ప్రధాన శిబిరాలు లేవని బంగ్లాదేశ్ అధికారులు చెప్పారు. బంగాళాఖాతంలో ఓ దీవిలో ఉంటున్న వందల మంది రోహింగ్యాలను పునరావాస శిబిరాలకు తరలించినట్లు తెలిపారు.
వందల సంఖ్యలో రోహింగ్యాలు మలేసియా, థాయిలాండ్‌లకు పారిపోయేందుకు ప్రయత్నించి బంగాళఖాతంలోనే బోట్లలో చిక్కుకుపోయి ఉండొచ్చని ఐరాస, మానవ హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఆంఫన్ తుఫాను కారణంగా తీవ్రవేగంతో గాలులు వీస్తుండటంతో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్‌ఎఫ్) సిబ్బంది రంగంలోకి దిగారు.
చెట్లు విరిగిపడి కరెంటు తీగలు తెగిన ప్రాంతాలలో వాటిని తొలగించే కార్యక్రమం చేపట్టారు. ఒడిశా సరిహద్దు, తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని దిఘా పట్టణానికి వెళ్లే రహదారిపై భారీ ఎత్తున చెట్టు విరిగిపడటంతో వాటిని తొలగించే పనిలో ఎన్డీఆర్‌ఎఫ్ నిమగ్నమైనట్లు ఏఎన్‌ఐ వార్తాసంస్థ ట్విటర్‌లో వెల్లడించింది.

ఫొటో సోర్స్, NDRF KOLKATA
పశ్చిమబెంగాల్‌లో సుమారు ఐదు లక్షల మందిని, ఒడిశాలో 1,58,560 మందికి పైగా ప్రజలను తుపాను ప్రభావిత ప్రాంతాల నుంచి ఖాళీ చేయించామని ఎన్డీఆర్‌ఎఫ్ చీఫ్ ఎస్.ఎన్. ప్రధాన్ వెల్లడించారు.
ఒడిశాలో 20 టీమ్‌లు, పశ్చిమబెంగాల్‌లో 19 టీమ్‌లతోపాటు మరో రెండు అదనపు బృందాలను కూడా రంగంలోకి దించినట్లు ప్రధాన్ చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
గతంలో తుపాను ఫాని అనుభవాలను దృష్టిలో పెట్టుకుని సిబ్బందికి కూలిన చెట్లను నరకడానికి, పడిపోయిన స్థంభాలను తొలగించడానికి సిబ్బందికి అవసరమైన సామాగ్రిని అందించామని, తుపాను ప్రభావం తర్వాత వేగంగా పునర్నిర్మాణ పనులు కొనసాగుతాయని ప్రకటించారు.
మరోవైపు తుపాను ఆంఫన్ కారణంగా ఒడిశా తీరంలో భారీగాలులు వీస్తున్నాయి. బాలాసోర్ జిల్లాలోని చాందీపూర్‌లో ఉదయం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ఫొటో సోర్స్, DG NDRF
తుపాను కేంద్రం తీరాన్ని దాటి వెళ్లడంతో పశ్చిమబెంగాల్‌లోని ఉత్తర, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో కాస్త ప్రశాంతం వాతావరణం ఏర్పడొచ్చని, అయితే మరో అరగంటపాటు తీవ్రమైన గాలులు, వర్షం కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ డీజీ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
- సూపర్ సైక్లోన్ ఆంఫన్: ప్రపంచంలో అత్యంత ఘోరమైన తుపానులన్నీ బంగాళాఖాతంలోనే ఎందుకు సంభవిస్తాయి?
- కరోనావైరస్కు తుపాను కూడా తోడైతే సామాజిక దూరం పాటించడం ఎలా?
- తుపాను వచ్చినపుడు ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు?
- తిత్లీ తుపాను: ‘శ్రీకాకుళం జిల్లాను 20 ఏళ్లు వెనక్కి నెట్టింది’
- ఫొని తుపాను: ఒడిశాలో ఇంకా పునరావాస కేంద్రాల్లోనే దళితులు.. కారణమేంటి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









