ఆర్ణబ్ గోస్వామి: రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్‌కు సుప్రీంకోర్టులో ఊరట

అర్ణబ్ గోస్వామి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆర్ణబ్ గోస్వామి

రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ ఆర్ణబ్ గోస్వామిపై పలు రాష్ట్రాల్లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదైన నేపథ్యంలో మూడు వారాల వరకు ఆయనను అరెస్టు చేయకూడదంటూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.

పాల్‌ఘర్‌లో ఇద్దరు సాధువులు, ఒక డ్రైవర్‌పై జరిగిన దాడులకు, కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీకి సంబంధం ఉందంటూ అర్ణబ్ తన టీవీ షోలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై కొన్నిచోట్ల ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. దీంతో జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం అర్ణబ్ పిటిషన్‌పై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ నిర్వహించింది.

దేశంలోని పలు రాష్ట్రాల్లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేయాలని ఆర్ణబ్ కోరారు. సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గి, సిద్ధార్థ్ భట్నాగర్‌లు సుప్రీం కోర్టులో అర్ణబ్ తరపున వాదనలు వినిపించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఆర్ణబ్ గోస్వామికి ముంబయి పోలీస్ కమిషనర్ నేతృత్వంలో భద్రత కల్పించనున్నారు.

తన క్లయింట్‌పై దాఖలు చేసిన ఫిర్యాదులకు ఎలాంటి ఆధారం లేదని అర్ణబ్ గోస్వామి తరపున వాదించిన ముకుల్ రోహత్గి అన్నారు. పత్రికా స్వేచ్ఛను అణచివేసేందుకు అకారణంగా ఆర్ణబ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదుచేశారని రోహత్గి వాదించారు.

"టీవీలో రాజకీయ చర్చలు జరుగుతాయి. ప్రశ్నలు అడుగుతారు" అని రోహత్గి పేర్కొన్నారు.

ముకుల్ రోహత్గి వాదనలపై సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ నాయకుడు కపిల్ సిబల్ ప్రతివాదనలు వినిపించారు. భావ ప్రకటనా స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ పేరుతో మీరు మత విద్వేషాలను వ్యాప్తి చేయరాదని అన్నారు.

"కాంగ్రెస్ కార్యకర్తలు కేసు పెడితే మీకేంటి సమస్య? గోస్వామి ఏమైనా ప్రత్యేక వ్యక్తా? ఆయనను ఎవరూ ప్రశ్నించకూడదా? ఆయనకు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయకూడదా? పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కోర్టుకు హాజరయ్యారు. ఇక్కడ ఎవరినో రక్షించాలనుకోవడంలో ఆంతర్యం ఏమిటి?" అని సిబల్ ప్రశ్నించారు.

ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు ఆర్ణబ్‌ గోస్వామిని 3 వారాల పాటు అరెస్టు చేయవద్దంటూ ఉత్తర్వులు జారీచేసింది.

సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, Getty Images

కాంగ్రెస్ ప్రయత్నాలు బెడిసికొట్టాయి: ర్ణబ్

సుప్రీం కోర్టు ఉత్తర్వులపై అర్ణబ్ సంతోషం వ్యక్తం చేశారు.

"కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెట్టిన కేసులో నా అరెస్టును నిలిపివేస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు ఇవ్వడం సంతోషంగా ఉంది. నా భావప్రకటన స్వేచ్ఛను పరిరక్షించినందుకు, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వెంటవెంటనే వందల ఎఫ్ఐఆర్‌లు దాఖలు చేసి, నన్ను భయపెట్టేందుకు జరిగిన కుట్రపూరిత ప్రయత్నాలను అడ్డుకున్నందుకు సంతోషంగా ఉంది. రాజకీయ ప్రాబల్యాన్ని దుర్వినియోగం చేయాలనుకున్న కాంగ్రెస్ ప్రయత్నాలు ఈరోజు ఓటమిపాలయ్యాయి.

కాంగ్రెస్ పార్టీ సైతం నాపైన, నా భార్య, రిపబ్లిక్ టీవీ ఎడిటర్ సమ్యబ్రతా రాయ్‌పైనా రెండు రోజుల క్రితం హింసాత్మక దాడికి పాల్పడింది. కానీ కాంగ్రెస్ ప్రయత్నాలన్నీ ఇప్పుడు బెడిసికొట్టాయి. భవిష్యత్‌లోనూ ఇదే జరుగుతుంది.

ఈ ఆదేశాల ద్వారా పత్రికా స్వేచ్ఛను పరిరక్షించినందుకు దేశంలోని న్యాయస్థానాలకు నేను కృతజ్ఞతలు చెబుతున్నా" అని అర్ణబ్ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)