మహారాష్ట్ర: పాల్ఘర్‌లో సాధువులను కొట్టిచంపిన మూక... 110 మంది అరెస్ట్

ఫొటో సోర్స్, Getty Images
మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో గురువారం ముగ్గురి ప్రాణాలను బలి తీసుకున్న మూకదాడికి సంబంధించి నిందితులను అరెస్టు చేశామని రాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు.
దోషులను కఠినంగా శిక్షిస్తామని ఆయన అన్నారు.
‘‘పాల్ఘర్ ఘటనపై చర్యలు తీసుకున్నాం. నిందితులందరినీ అరెస్టు చేశాం. హేయమైన ఈ నేరానికి పాల్పడ్డ దోషులను కఠినంగా శిక్షిస్తాం’’ అంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
పీటీఐ వార్తాసంస్థ కథనం ప్రకారం సూరత్‌కు కారులో వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను పాల్ఘర్‌లో కొందరు అడ్డుకున్నారు. వాళ్లను కారు నుంచి బయటకు లాగి కొట్టి చంపారు.
కారులో ప్రయాణిస్తున్నది దొంగలనే అనుమానంతో ఆ మూక వారిపై దాడి చేసింది.
కానీ, వాళ్లు సూరత్‌లో ఓ వ్యక్తి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వెళ్తున్నారు.

ఫొటో సోర్స్, OfficeofUT /Twitter
దాడిలో మరణించిన ఈ ముగ్గురిలో ఇద్దరు సాధువులు, మరొకరు వాళ్ల కారు డ్రైవర్.
సాధువుల్లో ఒకరి వయసు 70 ఏళ్లు, మరొకరి వయసు 35 ఏళ్లు ఉంటుంది. వీరితోపాటు ఉన్న కారు డ్రైవర్ వయసు 30 ఏళ్లు.
ఘటనకు సంబంధించి మొత్తం 110 మంది నిందితులను అరెస్టు చేశామని, వారిలో 9 మంది మైనర్లు ఉన్నారని పాల్ఘర్ పోలీసులు అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా తెలిపారు.
నిందితుల్లో 101 మంది ఈ నెల 30 వరకూ పోలీసు కస్టడీలో ఉంటారని, ఘటనపై విచారణ కొనసాగుతోందని పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఉన్నత స్థాయి విచారణ జరపాలి: బీజేపీ
గురువారం రాత్రి ఈ మూక దాడి జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో ఆదివారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
దాడి జరుగుతున్న సమయంలో పోలీసు అధికారి అక్కడే ఉండటం ఆ వీడియోలో కనిపించింది.
ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత, ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్ డిమాండ్ చేశారు.
‘‘పోలీసుల ముందే ఓ గుంపు మనుషుల్ని కొడుతుండటం సిగ్గుపడాల్సిన విషయం. పోలీసుల దగ్గరి నుంచి లాక్కెళ్లి మరీ కొడుతున్నారు. మహారాష్ట్రలో చట్టవ్యవస్థ బలహీనపడిపోయిందా?’’ అని ఆయన ప్రశ్నించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
అఖిల భారతీయ అఖాడా పరిషత్ సంస్థ కూడా ఈ దాడిని ఖండించింది. బాధిత సాధువులు జూనా అఖాడేకు సంబంధించినవారుగా పేర్కొంది.
మరోవైపు దేశంలో 144 సెక్షన్ అమల్లో ఉంటే ఇంత మంది జనం ఎలా పోగయ్యారని జూనా అఖాడే అధికార ప్రతినిధి మహంత్ నారారణ్ గిరి సందేహం వ్యక్తం చేశారు.
బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా కూడా పాల్ఘర్ ఘటనపై స్పందిస్తూ ట్వీట్ చేశారు.
‘‘మహారాష్ట్రలో ఇద్దరు సాధువులను, వారి డ్రైవర్‌ను విచక్షణరహితంగా కొందరు కొట్టిచంపారు. ఇప్పటివరకూ లిబరల్స్ ఎవరూ కనీసం నోరు మెదపలేదు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఏమయ్యాయంటూ ఆక్రోశం వ్యక్తం చేయడం లేదు’’ అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ వ్యాక్సీన్ కనిపెట్టినా... అది పేద దేశాలకు అందుతుందా?
- కరోనావైరస్ మీద విజయం సాధించామన్న చైనా మాటలను నమ్మవచ్చా?
- కరోనావైరస్ లాక్డౌన్ భారతదేశంలో ఆహార కొరతకు దారి తీస్తుందా?
- కరోనావైరస్: లాక్డౌన్లో ఉపాధి లేక, ఆహారం అందక ట్రాన్స్జెండర్ల ఇబ్బందులు
- కరోనావైరస్: కేంద్రం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడగలదా?
- కరోనావైరస్: మేడిన్ ఆంధ్రప్రదేశ్ టెస్టింగ్ కిట్లు.. పీపీఈలు, వెంటిలేటర్లు, మాస్కుల్ని కూడా ఉత్పత్తి చేస్తున్న ఏపీ
- కరోనావైరస్ లేనివాళ్లే దేశంలో ఎక్కువగా చనిపోతారా? ఎందుకు?
- కరోనావైరస్-లాక్డౌన్ ఎప్పుడు, ఎలా ముగుస్తుంది?
- కరోనాపై ప్రభుత్వం ఎలా ‘యుద్ధం’ చేయబోతోంది? కంటైన్మెంట్ ఆపరేషన్ ఎప్పుడు మొదలవుతుంది? ఎప్పుడు ముగుస్తుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








