దిల్లీ అసెంబ్లీ ఫలితాలు: మూడోసారి ముఖ్యమంత్రి కానున్న కేజ్రీవాల్.. ఆప్ 62, బీజేపీ 8 స్థానాల్లో విజయం

ఫొటో సోర్స్, Getty Images

దిల్లీలో కేజ్రీవాల్ జయకేతనం. ఈ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టబోతున్నారు. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) భారీ మెజారిటీ సాధించింది.
మొత్తం 70 అసెంబ్లీ స్థానాలలో ఆప్ 62 చోట్ల విజయం సాధించింది. బీజేపీ 8 స్థానాలను గెలచుకుంది.
కాంగ్రెస్, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం, జేడీయూ, ఎల్జేపీ, ఎన్సీపీ, ఆర్జేడీ తదితర పార్టీలూ పోటీ చేసినా ఒక్క స్థానమూ గెలుచుకోలేకపోయాయి.
ఆప్ 53.6 శాతం ఓట్లు పొందగా బీజేపీ 38.5 శాతం ఓట్లు సాధించింది. కాంగ్రెస్‌కు 4.26 శాతం ఓట్లు దక్కాయి.


ఏడాదిలో ఎంత మార్పు
గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో దిల్లీలోని మొత్తం 7 పార్లమెంటు స్థానాలనూ బీజేపీ గెలచుకుంది. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీ సింగిల్ డిజిట్‌కే పరిమితమవగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైనకంటే కూడా భారీ ఆధిక్యాన్ని సాధించింది.
భారీ విజయం సాధించినప్పటికీ ఎవరూ బాణసంచా కాల్చొద్దని కేజ్రీవాల్ తన పార్టీ నాయకులు, కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.
2015 ఎన్నికలతో పోల్చితే ఆప్ 5 స్థానాలు కోల్పోగా, బీజేపీ అప్పటికంటే 5 స్థానాలను అధికంగా గెలుచుకుంది. 2015లో ఆప్ 67, బీజేపీ 3 స్థానాలు గెలిచాయి. కాంగ్రెస్ అప్పుడు, ఇప్పుడు బోణీ చేయలేకపోయింది.
వెల్లువెత్తుతున్న అభినందనలు
దిల్లీలో భారీ విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు కేజ్రీవాల్‌ను దేశవ్యాప్తంగా నాయకులు అభినందిస్తున్నారు. ప్రధాని మోదీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీల నేతలు కేజ్రీవాల్‌కి అభినందనలు తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆప్ ఆధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను అభినందిస్తూ ట్వీట్ చేశారు.
మళ్లీ ముఖ్యమంత్రి కానున్న కేజ్రీవాల్ మంచి పాలన అందించాలంటూ ఆకాంక్షించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కేజ్రీవాల్‌ను అభినందిస్తూ ట్వీట్ చేశారు. మునుపటిలాగే దిల్లీ ప్రజలకు నిబద్ధతతో సేవ చేయాలని ఆకాంక్షించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
తెలంగాణలో అధికార పార్టీ టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేజ్రీవాల్‌ను అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఆయన హ్యాట్రిక్ విజయం సాధించారంటూ అందులో ప్రస్తావించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
ఇది జన్ కీ బాత్.. మన్ కీ బాత్ కాదు
దిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ విజయం సాధించడంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోదీకి చురకలు వేశారు.
ఈ దేశం జనం మాటపై నడుస్తుందని, మనసులో మాటతో నడవదని ప్రజలు చూపించారంటూ ఆయన తన ట్వీట్‌లో వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్‌ను బీజేపీ టెర్రరిస్టు అందని.. కానీ, ఆయనను ఓడించలేకపోయిందని ఠాక్రే తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
ఆప్ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతుండడంతో అరవింద్ కేజ్రీవాల్ సంబరాలు చేసుకుంటున్నారు. ఆయన తన భార్య సునీతతో కలిసి కేక్ కోసి సంతోషం పంచుకున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 6

ఫొటో సోర్స్, Getty Images
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభినందనలు తెలిపారు. దిల్లీ ప్రజలు బీజేపీని తిరస్కరించారని ఆమె వ్యాఖ్యానించారు. "అభివృద్ధి రాజకీయాలు మాత్రమే ఈరోజుల్లో పనిచేస్తాయి. సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్‌లను ప్రజలు తిరస్కరించారు" అని మమత అన్నారు.
దిల్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి తనదే బాధ్యత అని దిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు సుభాష్ చోప్రా అన్నారు. బీజేపీ మతతత్వ రాజకీయాలను ప్రజలు తిరస్కరించారనే విషయం ఈ ఫలితాలతో స్పష్టమైందని అంటూ అరవింద్ కేజ్రీవాల్‌కు అభినందనలు ఆయన వ్యాఖ్యానించారు.
దిల్లీ అసెంబ్లీని లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ రద్దు చేశారు.
షాలిమార్ బాగ్ నుంచి పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి వందనా కుమారి 24 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు.
మరోవైపు, దిల్లీ ఎన్నికల ఫలితాలను తాము అంగీకరిస్తున్నామని బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించారు. "కేజ్రీవాల్‌కు, దిల్లీ ప్రజలకు అభినందనలు. మా ప్రయత్నాలు మేం చేశాం. కానీ, మేం ప్రజల మనసును గెల్చుకోలేకపోయాం. అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలో దిల్లీ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా" అని గంభీర్ అన్నారు.
ఓటమిని అంగీకరిస్తున్నామని బీజేపీ మరో ఎంపీ పర్వేష్ వర్మ చెప్పారు. "మేం ఇంకా కష్టపడతాం. వచ్చే ఎన్నికల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తాం. విద్య, వైద్యాన్ని అభివృద్ధి చేయడం ఆధారంగానే ఈ ఎన్నికలు జరిగాయనుకుంటే, కేజ్రీవాల్ ప్రభుత్వంలోని విద్యాశాఖ మంత్రి మనీశ్ సిసోడియా ప్రతాప్ గంజ్ స్థానంలో ఎందుకు వెనకబడ్డారు" అని ఆయన అన్నారు.
కాంగ్రెస్ పార్టీకి వ్యూహం లేదన్న శర్మిష్టా ముఖర్జీ
దిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై ఆ పార్టీ నేత శర్మిష్టా ముఖర్జీ విమర్శలు గుప్పించారు.
"మరోసారి మనం కనీసం ఒక్క సీటు కూడా గెల్చుకోలేకపోయాం. ఆత్మ పరిశీలన చేసుకున్నది చాలు. ఇక చర్యలు చేపట్టాల్సిన సమయం వచ్చింది. నిర్ణయాలు తీసుకోవడంలో నాయకత్వం ఆలస్యం చేస్తోంది. మనకో వ్యూహం లేదు, మనలో ఐక్యత లేదు. కార్యకర్తల్లో చాలా అసంతృప్తి నెలకొని ఉంది. క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతోందో మనకు తెలియదు. కాంగ్రెస్ పార్టీలో భాగస్వామిగా దీనికి నాకు కూడా బాధ్యత ఉంది" అని ఆమె విమర్శించారు.
బీజేపీ మతతత్వ అజెండాకు వ్యతిరేకంగా దిల్లీ ప్రజలు తీర్పునిచ్చారని లోక్ సభలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి వ్యాఖ్యానించారు.
"ఆమ్ ఆద్మీ పార్టీ మూడోసారి అధికారంలోకి వస్తుందని అందరికీ తెలుసు. కాంగ్రెస్ ఓటమి బాధాకరమే కానీ, ఆప్ విజయం బీజేపీ మతతత్వ అజెండాకు వ్యతిరేకంగా లభించింది" అని ఆయన అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 7
ప్రారంభ ట్రెండ్స్‌లో స్పష్టమైన ఆధిక్యం కనిపించడంతో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం వద్ద సంబరాలకు ఏర్పాట్లు మొదలయ్యాయి.
దిల్లీ ప్రజలు తమ పరిపాలనను ఆమోదించారని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ తెలిపారు.
మరోవైపు, కాంగ్రెస్ ఒక్క సీట్లో కూడా ఆధిక్యంలో లేదు. కానీ, కాంగ్రెస్ ఈసారి మెరుగైన ఫలితాలు సాధిస్తుందని దిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ సుభాష్ చోప్రా అన్నారు.
"మేం చాలా కష్టపడ్డాం, ఏం జరుగుతుందో మీరే చూడండి. కాంగ్రెస్ ఈసారి మెరుగైన సంఖ్యలో సీట్లు సాధిస్తుంది. ఈ ఎన్నికల కోసం మా కార్యకర్తలు చాలా కష్టపడ్డారు" అని చోప్రా అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
"ఫలిత సరళిలో బీజేపీకి, ఆప్‌కి మధ్య అంతరం కనిపిస్తోంది. కానీ, ఇంకా సమయం ఉంది. మాకు నమ్మకం ఉంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఏ ఫలితం వచ్చినా, నాదే బాధ్యత’’ అని దిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ అన్నారు.
"విజయంపై మేం పూర్తి ధీమాగా ఉన్నాం. ఎందుకంటే గత ఐదేళ్లుగా మేం ప్రజల కోసమే పనిచేశాం" అని దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అన్నారు. నిజమైన దేశభక్తి అంటే ప్రజలకు సేవ చేయడమే అని ఆప్ నిరూపించిందని ఆయన తెలిపారు. విద్య, వైద్యం మెరుగుపరచడమే దేశభక్తి అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఫలితాల వెల్లడి ప్రారంభం కాకముందు బీజేపీ విజయంపై ధీమా వ్యక్తం చేసింది.
"నాకేమీ ఆందోళనగా లేదు. ఈ రోజు కచ్చితంగా బీజేపీకి మంచి జరుగుతుంది. ఇప్పటికే బీజేపీ కార్యాలయంలో సంబరాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి" అని మనోజ్ తివారీ అన్నారు.
మరోవైపు, తాను ఓడిపోయే ప్రసక్తే లేదని ప్రస్తుత సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై న్యూదిల్లీ సీటు నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి సునీల్ యాదవ్ అన్నారు. ఒకవేళ ఓడిపోతే ఇక ఎన్నికల్లో ఎప్పుడూ పోటీచేయనని, పార్టీ కార్యకలాపాలకే పరిమితమవుతానని వ్యాఖ్యానించారు.
"కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలను ఇష్టపడే ఓటర్లలో ఎలాంటి తేడాలు ఉండవు. ఓ రకంగా చెప్పాలంటే ఇద్దరి ఓటు బ్యాంకూ ఒకటే. వాళ్లకు కాంగ్రెస్ ప్రత్యేకంగా, అదనంగా ఇస్తున్నదేం లేదు. అందువల్ల వారిని మావైపు తిప్పుకోవడం అంత సాధ్యం కాదు" అని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు హిందుస్థాన్ టైమ్స్‌తో వ్యాఖ్యానించారు.

672 మంది అభ్యర్థులు పోటీ చేసిన ఈ ఎన్నికల్లో విజయం కోసం ప్రధాన పార్టీలన్నీ హోరాహోరీ తలపడ్డాయి.
ఫిబ్రవరి 8న జరిగిన పోలింగ్‌లో 62.59 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది.
గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో దిల్లీలో ఓటింగ్ శాతం కంటే ఇది 2 శాతం ఎక్కువ.
అయితే, 2015 నాటి దిల్లీ అసెంబ్లీ ఎన్నికల కంటే ప్రస్తుత ఓటింగ్ 5 శాతం తక్కువ నమోదైనట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది.
ఫలితాల ట్రెండ్స్ ఉదయం 8 గంటల నుంచి (ఫిబ్రవరి 11న) వెల్లడిస్తామని ఎలక్షన్ కమిషన్ తెలిపింది. లెక్కింపు కేంద్రాలతో పాటు ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్, 'వోటర్ హెల్ప్‌లైన్' యాప్‌లోనూ ఫలితాలు తెలుసుకోవచ్చని తెలిపింది.
ఎన్నికల ఫలితాలు ఎప్పటికప్పుడు 'బీబీసీ తెలుగు' వెబ్‌సైట్, ఫేస్‌బుక్ పేజీల్లోనూ అందుబాటులో ఉంటాయి.

ఫొటో సోర్స్, Getty Images
గత ఎన్నికల్లో...
2015 ఎన్నికల్లో 70 సీట్లకు గాను ఆమ్ ఆద్మీ పార్టీ 67 స్థానాలను గెలుచుకుంది. ఆ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా పనిచేశారు.
అప్పటి నుంచి అయిదేళ్ల కాలంలో దిల్లీలో తాను చేసిన అభివృద్ధిని చూసి ఓటేయాలని, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలను సమూలంగా మార్చి ఆదర్శవంతంగా తీర్చిదిద్దానంటూ కేజ్రీవాల్ ప్రజలను ఓట్లడిగారు.
మరోవైపు గత ఎన్నికల్లో మూడే స్థానాలు గెలుచుకున్న బీజేపీ ప్రస్తుత ఎన్నికల్లో అధిక సీట్లు సాధించి అధికారం అందుకోవాలన్న లక్ష్యంతో ఈ ఎన్నికల బరిలో దిగింది.
గత ఎన్నికల్లో ఒక్క సీటూ సాధించని కాంగ్రెస్ పార్టీ ఈసారి పరిస్థితి మెరుగుపర్చుకోవాలని ఆశిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
అంచనాలన్నీ ఆ పార్టీపైనే..
పోలింగ్ అనంతరం వివిధ సంస్థలు ఫలితాలు అంచనా వేస్తూ ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. ఆ ఎగ్జిట్ పోల్స్ అన్నీ మళ్లీ ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి.
దిల్లీ అసెంబ్లీలో 36 స్థానాలు సాధించే పార్టీ అధికారాన్ని ఏర్పాటు చేయగలదు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఆమ్ ఆద్మీ పార్టీకి దిల్లీ శాసనసభలో సగం కంటే ఎక్కువ స్థానాలు వస్తాయని అంచనా వేశాయి.
ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయంటే..
కాగా ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్యే పోటీ కనిపించింది. ఆమ్ ఆద్మీ పార్టీ తన ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిటింగ్ సీఎం కేజ్రీవాల్ పేరే ప్రకటించి ఎన్నికలకు వెళ్లగా బీజేపీ, కాంగ్రెస్‌లు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు.

ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: చైనాలో డెడ్లీ సండే... ఒక్క రోజే 97 మంది మృతి
- ఎలక్ట్రిక్ కారు కొనాల్సిన టైమ్ వచ్చేసిందా...
- అకాడమీ అవార్డుకు 'ఆస్కార్' పేరు ఎలా వచ్చింది?
- "నాకు కరోనావైరస్ సోకలేదు.. నన్ను భారత్‌కు తీసుకెళ్లండి"- చైనాలో చిక్కుకుపోయిన తెలుగు యువతి
- ఆస్కార్ అవార్డులు : ఉత్తమ చిత్రం పారాసైట్, ఉత్తమ నటుడు వాకీన్ ఫీనిక్స్, ఉత్తమ నటి రెనె జెల్వెగర్
- మహిళలను భారత సైన్యంలో కమాండర్లుగా అంగీకరించే పరిస్థితి లేదా?
- పోర్న్ సైట్లో తనను రేప్ చేసిన వీడియో తొలగించాలని బాధితురాలి పోరాటం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









