ఆర్థిక సర్వే 2019-20: జీడీపీ వృద్ధి రేటు 2020-21లో 6 - 6.5% ఉంటుందని అంచనా

నిర్మలా సీతారామన్

ఫొటో సోర్స్, Getty Images

మోదీ నేతృత్వంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం ఫిబ్రవరి 1న పూర్తి స్థాయి సాధారణ బడ్జెట్ ప్రవేశపెడుతోంది.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలిరోజైన శుక్రవారం (జనవరి 31)నాడు ఆర్థిక సర్వే 2019-20ని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనంతరం సభ శనివారానికి వాయిదా పడింది.

ఆర్థిక మంత్రిత్వ శాఖ రూపొందించిన ఆర్థిక సర్వే ఆధారంగానే బడ్జెట్ రూపకల్పన జరుగుతుంది.

ఆర్థిక సర్వే ముఖ్యాంశాలు

  • 2020-21 సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు 6 నుంచి 6.5 శాతం మధ్య ఉండవచ్చని ఆర్థిక సర్వే అంచనా.
  • ప్రస్తుత ఆర్థిక వృద్ధి రేటు 5 శాతంగా ఉంది.
  • ఆర్థిక సంస్కరణలపై దృష్టి పెట్టి వేగవంతం చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
  • 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారేందుకు సంపద సృష్టి చాలా ముఖ్యమైన అంశం.
  • డిసెంబర్ 2019 నాటికి ద్రవ్యోల్బణం 2.6 శాతానికి తగ్గింది. ఏప్రిల్ 2019న ఇది 3.2 శాతంగా ఉంది.
Presentational grey line
News image
Presentational grey line
  • జీఎస్టీ వసూళ్లలో 4.1శాతం పెరుగుదల నమోదైంది.
  • వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ ద్వారా రాబడి మరింత పెరిగే అవకాశం ఉంది.
  • ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 2019 ఓ క్లిష్టమైన సంవత్సరం. దీని ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై కూడా పడింది.
  • రాబోయే సంవత్సరంలో ప్రపంచవ్యాప్త పరిస్థితులు భారత్‌కు అనుకూలంగా ఉంటాయి.
  • భారతీయ రైల్వే వ్యవస్థ అత్యధిక మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చి ప్రపంచ రికార్డు సాధించింది.
  • దేశంలో పెట్టుబడుల ఉపసంహరణ వేగవంతం కావాలి.

అంతకు ముందు, పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగించారు.

"ఈ దశాబ్దం భారత్‌కు చాలా ముఖ్యమైనది. ఈ దశాబ్దంలోనే భారత్ స్వాతంత్ర్యం పొంది 75 సంవత్సరాలు పూర్తవుతాయి. భారత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే విధంగా అవసరమైన చట్టాలు రూపొందించాలి" అని కోవింద్ వ్యాఖ్యానించారు.

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్‌ ది ఇయర్

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)