CAA: జ్ఞాపకాల్లో మిగిలిపోయిన నిరసనలు

పౌరసత్వ సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించిన తర్వాత భారత దేశంలోని వివిధ ప్రాంతాల్లో దానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిగాయి.
ఈ చట్టం ప్రకారం... పొరుగు దేశాల నుంచి ఆశ్రయం కోసం భారత్ వచ్చిన హిందూ, జైన, బౌద్ధ, సిక్కు, పార్సీ, క్రైస్తవ సమాజాల వారికి భారత పౌరసత్వం ఇచ్చే నిబంధన ఉంది.

ఈశాన్యంతోపాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ చట్టంపై వ్యతిరేకత వస్తోంది. మతం ఆధారంగా పౌరసత్వం ఇవ్వడం, భారత రాజ్యాంగానికి విరుద్ధం అని దీనిని వ్యతిరేకిస్తున్న వారు వాదిస్తున్నారు.
చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. కానీ కొత్త చట్టాన్ని తక్షణం నిషేధించాలనే వినతిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. తదుపరి విచారణకు జనవరిలో తేదీని నిర్ణయించింది.

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దిల్లీ జామియా మిలియా ఇస్లామియాలో తీవ్రంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి.
ఆందోళనల సమయంలో హింస, దహనాలు తర్వాత పోలీసులు అతి చేశారని విద్యార్థులు ఆరోపించారు. ఆ తర్వాత నిరసన ప్రదర్శనలు అంతకంతకూ తీవ్రం అయ్యాయి.

అస్సాంలో మొదలైన నిరసన ప్రదర్శనలు, జామియా తర్వాత దిల్లీ సీలంపూర్ ప్రాంతంలో తీవ్రం అయ్యాయి. అక్కడ విధ్వంసం సృష్టించారని పోలీసులపై మరోసారి ఆరోపణలు వచ్చాయి.
ఆ తర్వాత ఉత్తర్ ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, బిహార్, పశ్చిమ బెంగాల్‌లో కూడా హింసాత్మక ప్రదర్శనలు జరిగాయి.

వ్యతిరేక ప్రదర్శనల సమయంలో దిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర నిరసనకారులు పోలీసులకు గులాబీలు పంచారు. పోలీసులు కూడా అక్కడ ఉన్న నిరసనకారులకు టీ-బిస్కెట్లు ఇచ్చారు.
ఈ నిరసనలపై మాట్లాడుతున్న ప్రభుత్వం పౌరసత్వ చట్టంలో మార్పు వల్ల భారత్‌లో ఉన్న ముస్లింలకు ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెబుతోంది.

కానీ విపక్షాలు, ఆందోళనకారులు కొత్త చట్టాన్ని భారత్ లౌకికవాదానికి ముప్పుగా భావిస్తున్నారు. ఇటు, ప్రభుత్వం కూడా ఎన్ఆర్సీ ప్రక్రియ, పౌరసత్వ చట్టం రెండూ వేరు వేరని చెబుతూ వస్తోంది.
కానీ విపక్షాలు, నిరసనకారులు ప్రభుత్వ విధానం, ఉద్దేశాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. తమ సందేహాలు వ్యక్తం చేస్తూ రోడ్లపైకి వస్తున్నారు.
ప్రతిపక్షంలోని కొందరు వ్యక్తులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రభుత్వం అంటోంది. కానీ ప్రభుత్వం రాజ్యాంగంతో చెలగాటం ఆడుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఇవికూడా చదవండి:
- ‘పాకిస్తాన్లో ఉండే హిందూ, సిక్కు సోదరులు ఎప్పుడు భారత్ రావాలనుకున్నా, వారికి స్వాగతం’ అని గాంధీ అన్నారా?
- అమిత్ షా: ‘NRCకి NPRకి సంబంధం లేదు.. రెండూ వేర్వేరు.. దీనివల్ల ఏ ఒక్క మైనార్టీ పౌరసత్వం రద్దు కాదు’
- "ఈ దేశంలో పౌరులు కాదు, తమ ఓటర్లు మాత్రమే ఉండాలని ప్రభుత్వం కోరుకుంటోంది"
- "నమాజ్ చేసి బయటకు వస్తుంటే పోలీసులు లాఠీచార్జి చేసి, కాల్పులు జరిపారు"
- 144 సెక్షన్ను ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తున్నాయా?
- CAA-సోనియా గాంధీ: ప్రజాందోళనను బీజేపీ అణచివేయాలని చూస్తోంది
- హ్యూమన్ రైట్స్ డే: మనిషిగా మీ హక్కులు మీకు తెలుసా...
- ''ఆ రాళ్ల దాడిని తప్పించుకుని ప్రాణాలతో బయటపడతామని అనుకోలేదు''
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








