ఉన్నావ్: అత్యాచార కేసు విచారణకు వెళ్తున్న బాధితురాలికి నిప్పు పెట్టిన దుండగులు... మృత్యువుతో పోరాడుతున్న మహిళ

ఫొటో సోర్స్, Getty Images
తనపై సామూహిక అత్యాచారం జరిగిందనే కేసు విచారణ నిమిత్తం కోర్టుకు వెళ్తున్న 23 ఏళ్ల ఒక మహిళపై ఉత్తర్ ప్రదేశ్‌లో దుండగులు దాడికి పాల్పడి, ఆమెకు నిప్పు అంటించారు.
తీవ్రమైన గాయాలైన బాధితురాలు ఆస్పత్రిలో విషమ పరిస్థితిలో ఉన్నారు. మృత్యువుతో పోరాడుతున్నారు.
మార్చిలో ఇద్దరు వ్యక్తులపై ఆమె ఈ కేసు దాఖలు చేశారు. ఆమెకు నిప్పు పెట్టారనే అనుమానంతో ఈ ఇద్దరు నిందితులు సహా ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు.
ఆమె రైల్వే స్టేషన్‌కు వెళ్తుండగా పలువురు దుండగులు దాడి చేసి, ఆమెను దగ్గర్లోని ఓ పొలంలోకి ఈడ్చుకెళ్లి, నిప్పు పెట్టారని స్థానిక మీడియా తెలిపింది.

ఫొటో సోర్స్, AFP
ఉత్తర్ ప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. మరో అత్యాచార కేసుతో ఉన్నావ్ ఇటీవల వార్తల్లో నిలిచింది.
ఈ కేసులో ఫిర్యాదిదారు ప్రయాణిస్తున్న కారు జులైలో రాయ్‌బరేలీలో ప్రమాదానికి గురైంది. ఆ యువతి దగ్గరి బంధువులు ఇద్దరు చనిపోయారు. ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె న్యాయవాది కూడా గాయపడ్డారు.
అత్యాచార కేసులో నిందితుడైన బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్‌పై ఈ ఘటన తర్వాత హత్య కేసు నమోదు చేశారు.

నవంబరు 27న తెలంగాణలోని షాద్ నగర్ వద్ద 27 ఏళ్ల యువతి అత్యాచారం, హత్యపై ఇప్పటికే దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన, ఆగ్రహం వ్యక్తమవుతున్నాయి. ఇంతలో ఉన్నావ్ జిల్లాలో అత్యాచార బాధితురాలికి దుండగులు నిప్పు పెట్టారు.
తాజా విషాదంపై సోషల్ మీడియాలో యూజర్లు మండిపడుతున్నారు.
షాద్ నగర్ ఘటన జరిగిన వారం రోజులకే మరొక మహిళకు నిప్పు పెట్టారని జెబా వార్సి అనే యూజర్ ఆందోళన వ్యక్తంచేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
పరిస్థితులేమీ మారలేదని శివాంగి ఠాకూర్ అనే మరో యూజర్ విచారం వ్యక్తంచేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
భారత్‌ను 'తల్లి'గా సంభోదిస్తామని, కానీ దేశంలో మహిళల పరిస్థితి దారుణంగా ఉందని అభిషేక్ అనే యూజర్ వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
2012 డిసెంబరులో దిల్లీలో ఓ బస్సులో నిర్భయ అత్యాచారం జరిగినప్పటి నుంచి దేశవ్యాప్తంగా మహిళలపై హింస, అత్యాచారాల గురించి విస్తృత చర్చ కొనసాగుతోంది. అయితే మహిళలపై నేరాలు మాత్రం తగ్గడం లేదు.
ప్రభుత్వ తాజా గణాంకాల ప్రకారం 2017లో దేశంలో 33,658 అత్యాచార కేసులు నమోదయ్యాయి. అంటే సగటున రోజుకు 92 అత్యాచార కేసులు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
స్పందించిన రాజ్యసభ
ఉన్నావ్ సంఘటనపై రాజ్యసబ ఉపాధ్యక్షుడు వెంకయ్య నాయుడు స్పందిస్తూ.. ‘‘ఈ సంఘటనను సభ మొత్తం ఖండిస్తోంది. నేను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మాట్లాడాను. నిందితులను అరెస్ట్ చేశామని సీఎస్ తెలిపారు’’ అని అన్నారు.
అయితే, ఒక కేసులో అరెస్టు చేస్తే సరిపోదని, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వేగంగా తగిన చర్యలు తీసుకుంటామనే సంకేతాలను దేశానికి, సమాజానికి ఇవ్వాలని, అప్పుడే ఇలాంటివి మళ్లీ జరగకుండా ఉంటాయని వెంకయ్య నాయుడు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- ‘నిర్భయ’లపై మళ్లీ మళ్లీ అత్యాచారం
- ట్రిపుల్ తలాక్ చట్టంతో ముస్లిం మహిళలకు మేలెంత?
- దిశ అత్యాచారం, హత్య కేసు విచారణకు ప్రత్యేక కోర్టు
- దిశ అత్యాచారం, హత్య: ‘ఆడదానిగా కాదు.. సాటి మనిషిగా, కొలీగ్‌గా గుర్తించండి’
- ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆందోళనలు, నిరసనలకు కారణాలు ఇవేనా...
- జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏమిటి? దానివల్ల ఉపయోగం ఉంటుందా?
- పిల్లలపై అత్యాచారం: ఉరిశిక్షతో న్యాయం లభిస్తుందా?
- పౌరసత్వ సవరణ బిల్లులో ఏముంది... ఎవరు వ్యతిరేకిస్తున్నారు
- లక్షల జంతువులను బలి ఇచ్చే 'అత్యంత రక్తసిక్త జాతర' మళ్ళీ మొదలు
- "ఈరోజు ఇది అడవి కాదన్నారు.. రేపు మేం మనుషులమే కాదని అంటారేమో"
- బంగారు నగలకు 'హాల్‌మార్క్' తప్పనిసరి చేసిన కేంద్రం... అసలు ఈ మార్క్ ఎందుకోసం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)