'గ్రాండ్ మాస్టర్' కోనేరు హంపి: గుర్తింపు గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు, ఆటపైనే నా దృష్టి

పతకంతో కోనేరు హంపి
    • రచయిత, దీప్తి బత్తిని
    • హోదా, బీబీసీ ప్రతినిధి

చెస్‌కు భారత్‌లో ఉండాల్సినంత ఆదరణ లేదని ఇటీవల రష్యాలోని స్కాల్కోవోలో ఫిడే ప్రపంచ గ్రాండ్ ప్రి విజేతగా నిలిచిన గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి విచారం వ్యక్తంచేశారు. చెస్‌కు ఆదరణ లేకపోవడానికి ఇది 'మాస్ అప్పీల్' ఉన్న ఆట కాకపోవడం ఒక కారణమన్నారు. "చెస్ చూసే వాళ్లకు ఒక బోర్డులో ఇద్దరి మధ్య ఏదో జరుగుతోందని అనిపిస్తుంది తప్ప అందరికీ గేమ్ అర్థం కాదు" అని ఆమె వ్యాఖ్యానించారు.

రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ పోటీల్లో పాల్గొన్నానని, ఈ మధ్యకాలంలో చాలా మార్పులు వచ్చాయని, కొత్త క్రీడాకారులు వచ్చారని ఆమె బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

"నేను ఆడిన కొన్ని గేమ్స్ చాలా నిరుత్సాహపరిచాయి. అయినా సాధన చేస్తూ, అప్‌డేట్ అవుతూ మొత్తానికి సాధించాను. బ్రేక్ తీసుకోవడంతో నా ర్యాంక్ 6కి పడిపోయింది. ఇప్పుడు 3కు వచ్చింది" అని ఆమె తెలిపారు.

ఆరోగ్య కారణాల వల్ల విరామం తీసుకొన్నానని, ఎప్పుడెప్పుడు మళ్లీ ఆడతానా అని ఎదురుచూసేదాన్నని హంపి చెప్పారు.

హంపి
ఫొటో క్యాప్షన్, ఫిడే ప్రపంచ గ్రాండ్ ప్రి విజేతగా నిలిచిన హంపి

ఇంటర్వ్యూ సారాంశం హంపి మాటల్లోనే...

చెస్‌కు ఇండియాలో ఉండాల్సినంత ఆదరణ లేదు. యూరోపియన్ దేశాలు, రష్యా తమ క్రీడాకారులకు ఇచ్చినంత ప్రోత్సాహం ఎక్కడా లేదు. చైనాలోనూ ఆటగాళ్లకు కావాల్సినవన్నీ ప్రభుత్వమే చూసుకుంటుంది.

ఏ ఆటైనా ఖర్చుతో కూడుకున్నదే. బయట దేశాలకు వెళ్లి పోటీల్లో ఆడాలంటే ప్రయాణ ఖర్చు, ట్రైనర్ ఖర్చు, హోటల్ ఖర్చు, ఇతరత్రా వ్యయాలు ఉంటాయి.

అందరికీ ఈ ఖర్చు భరించే స్తోమత ఉండదు.

భారత్‌లో అగ్రశ్రేణి క్రీడాకారులందరూ సాధారణ నేపథ్యం నుంచి వచ్చినవారే. ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని ఇవాళ ఆ స్థాయికి ఎదిగారు. ప్రభుత్వం ఆదుకుంటే ఇంకా ఎంతో మంది భారత ఆటగాళ్లు అనేక క్రీడల్లో రాణిస్తారు.

నన్ను పట్టించుకోలేదని నాకెప్పుడూ అనిపించలేదు. నేను ఎంతసేపూ నా గేమ్ బాగా ఆడానా, లేదా అన్నదే చూస్తాను. మీడియాలో వచ్చిందా, నాకు గుర్తింపు వచ్చిందా అన్నది ఎప్పుడూ పెద్దగా పట్టించుకోలేదు.

పైగా నేను ఎప్పట్నుంచో ఆడుతున్నాను.

కోనేరు హంపి పూర్తి ఇంటర్వ్యూ

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

తోడ్పాటు ముఖ్యం

ఏ మహిళకైనా 'సపోర్ట్ సిస్టం' చాలా అవసరం.

నా తల్లిదండ్రులు నాకు దగ్గరలో ఉండటంతో పాప (రెండేళ్ల ఆహనా)ను వాళ్ల దగ్గర వదిలిపెట్టి నేను గేమ్ ప్రాక్టీస్ చేసుకునే అవకాశం ఉంది. ఇలాంటి తోడ్పాటు లేకపోతే చాలా ఇబ్బంది. నా భర్తకు అర్థం చేసుకునేందుకు మొదట్లో కాస్త సమయం పట్టింది. ఇప్పుడు అర్థం చేసుకున్నారు. నాకు చాలా అండగా ఉంటారు.

నా కూతురికి నేను చెస్ ఆడతానని తెలుసు. ఇంట్లో ప్రాక్టీస్ చేస్తూ పక్కకు వెళ్తే - 'మమ్మీ నువ్వు చెస్ ఆడుకో. నేను ఇక్కడ నా బొమ్మలతో ఆడుకుంటాను' అని తను అంటుంటుంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)