ఆంధ్రా బ్యాంక్ కనుమరుగు.. బ్యాంకింగ్ రంగంలో తెలుగుదనానికి తెర

ఫొటో సోర్స్, ANI
భారత్‌ను 5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో ముందుకుసాగుతున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.
ఆర్థిక వ్యవస్థలో నిరుపయోగంగా ఉన్న స్థూల నిరర్థక ఆస్తుల విలువ 8.65 లక్షల కోట్ల నుంచి 7.9 లక్షల కోట్లకు తగ్గినట్లు ఆమె వెల్లడించారు.
శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆమె.. ప్రభుత్వ రంగంలోని పది బ్యాంకులను విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఏఏ బ్యాంకులు విలీనమవుతున్నాయి?
పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు విలీనం కానున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పారు.
కెనరాబ్యాంక్, సిండికేట్ బ్యాంకులను విలీనం చేస్తామన్నారు.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రబ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకులు మూడూ విలీనమై ఒకటిగా ఏర్పాటవుతాయన్నారు. ఈ మూడు బ్యాంకులు విలీనం తరువాత దేశంలో అయిదో అతిపెద్ద బ్యాంకుగా అవతరిస్తాయని చెప్పారు.
మరికొన్ని ఇతర బ్యంకుల విలీనంపైనా వివరాలు తెలిపారు.
ఇండియన్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంకులూ విలీనమవుతాయన్నారు.
ఈ విలీనం తరువాత ప్రభుత్వ రంగ బ్యాంకులు 12 మాత్రమే ఉంటాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థికశాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్ చెప్పినట్లుగా ఏఎన్‌ఐ వార్తాసంస్థ వెల్లడించింది. ఇంతకుముందు 27 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉండేవి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
అయిదేళ్ల కనిష్ఠానికి జీడీపీ వృద్ధి రేటు
మరోవైపు కేంద్ర గణాంక శాఖ జీడీపీ వివరాలు విడుదల చేసింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం(ఏప్రిల్ నుంచి జూన్)లో జీడీపీ వృద్ధి రేటు 5 శాతానికి తగ్గింది. గత అయిదేళ్లలో ఇంత తక్కువ వృద్ధి నమోదవడం ఇదే తొలిసారి.
అంతకుముందు త్రైమాసికంతో పోల్చితే ఇది బాగా తక్కువ. గత త్రైమాసికంలో 5.8 శాతం ఉంది.
2018-19 తొలి త్రైమాసికంలో 8 శాతం వృద్ధి ఉండేది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ఇవన్నీ దేనికి సంకేతం?
వస్తు సేవల ఎగుమతుల వృద్ధి రేటు కూడా 2018-19 ప్రథమ త్రైమాసికంతో పోల్చితే ఈ ఏడాది తొలి త్రైమాసికంలో భారీగా పతనమైంది. గత ఏడాది ఈ విభాగంలో వృద్ధిరేటు 10.2 శాతం ఉండగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5.7కి తగ్గింది.
వస్తుసేవల దిగుమతుల వృద్ధి రేటు 11 నుంచి 4.2 శాతానికి తగ్గింది.
స్థూల స్థిర పెట్టుబడుల కూర్పు(గ్రాస్ ఫిక్స్‌డ్ కేపిటల్ ఫార్మేషన్-జీఎఫ్‌సీఎఫ్) కూడా గత ఏడాదితో పోల్చితే భారీగా తగ్గింది. ఇది 13.3 నుంచి 4 శాతానికి తగ్గింది.
మరోవైపు ప్రభుత్వ ఖర్చు భారీగా పెరిగిందనడానికి సంకేతంగా ప్రభుత్వ తుది వినియోగ వ్యయం(గవర్నమెంట్ ఫైలన్ కంజంప్షన్ ఎక్స్‌పెండీచర్-జీఎఫ్‌సీఈ) గత ఏడాది కంటే పెరిగింది. గత ఏడాది మొదటి క్వార్టర్లో జీఎఫ్‌సీఈ 6.6 శాతంగా ఉండగా.. ఈ ఏడాది తొలి క్వార్టర్‌లో ఇది 8.8 శాతానికి చేరింది.
ఇవి కూడా చదవండి:
- కడుపులోని పసికందునూ కబళిస్తోన్న కాలుష్యం
- ‘మా నాన్న ఒక గ్యాంగ్‌స్టర్... నా మూలాలు దాచేందుకు నా ముక్కునే మార్చేశాడు’
- పెరూలో బయటపడ్డ 500 ఏళ్లనాటి మృతదేహాలు.. ‘దేవతలను సంతృప్తి’ పరచడానికి 227 మంది పిల్లల సామూహిక బలి
- 6174: ఒక భారతీయ ఉపాధ్యాయుడు కనిపెట్టాడు.. డెబ్బై ఏళ్లుగా గణిత శాస్త్రజ్ఞులు ఆశ్చర్యపోతున్నారు
- అమరావతి నుంచి రాజధాని మారుస్తున్నారా? అక్కడేం జరుగుతోంది?
- కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత అమిత్ షా టార్గెట్ మావోయిస్టులేనా...
- ఇంటి అద్దె వద్దు.. సెక్స్ కావాలంటున్నారు
- సెక్స్ విప్లవానికి తెర లేచిందా...
- ఆర్ఎఫ్ఐడీ: రోజువారీ జీవితాల్లో భాగమైపోయిన ప్రచ్ఛన్న యుద్ధ కాలపు స్పై టెక్నాలజీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








