సుష్మ స్వరాజ్ ఆఖరి ట్వీట్.. ‘ఈ రోజు కోసమే వేచి ఉన్నా’

ఫొటో సోర్స్, Getty Images
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మ స్వరాజ్ బుధవారం రాత్రి కార్డియాక్ అరెస్ట్‌తో కన్నుమూశారు.
విదేశాంగశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ట్విటర్‌లో ఆమె చాలా చురుగ్గా ఉండేవారు. ఆ వేదిక ద్వారా రోజూ జనాల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేవారు.
ప్రజలకు ఆమెను సంప్రదించడం సులభంగా ఉండేది.
విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులు తమ సమస్య గురించి ఒక్క ట్వీట్ పెడితే, పరిష్కారం లభించేది.
భారతీయులవే కాదు, పాకిస్తాన్ లాంటి దేశాలకు చెందినవారి సమస్యలు కూడా తీరిపోయేవి. వైద్య వీసాల కోసం పాకిస్తానీలు సహా విదేశీయులు ఎవరు అభ్యర్థించినా సుష్మ స్పందించి, వారికి సాయపడేవారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఆఖరి ట్వీట్‌లో ఆ మాట..
మంగళవారం కూడా సుష్మ ఒక ట్వీట్ చేశారు. ఇదే ఆమె ఆఖరి ట్వీట్. మరణానికి కొన్ని గంటల ముందు దీన్ని పెట్టారు.
ఆర్టికల్ 370 రద్దు విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అభినందనలు తెలుపుతూ ఆమె ఈ ట్వీట్ చేశారు.
''ప్రధానమంత్రికి చాలా చాలా కృతజ్ఞతలు. జీవితంలో ఈ రోజు కోసమే నేను వేచి ఉన్నా'' అని అందులో వ్యాఖ్యానించారు.
తన జీవితంలో ఆఖరి రోజు ఆఖరి ట్వీట్‌లో 'ఈ రోజు కోసమే వేచి ఉన్నా' అనే మాటను వాడటం ఆసక్తి కలిగించింది.

ఫొటో సోర్స్, Getty Images
హాస్య చతురత
సమస్యల పరిష్కరణకే కాదు, హాస్య చతురతకూ సుష్మ పెట్టింది పేరు.
ఆమె ట్వీట్లు వినోదం కూడా పంచేవి.
అప్పుడప్పుడు కొందరు తుంటరులు చేసే వింత అభ్యర్థనలకు, తగినంత హాస్యం జోడించి ఆమె స్పందించేవారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఓసారి ఓ వ్యక్తి తాను అంగారక గ్రహం మీద చిక్కుకుపోయానంటూ సుష్మ స్వరాజ్‌ను ఆటపట్టిస్తూ ట్వీట్ చేశారు.
అయితే, దీనికి కూడా సుష్మ స్పందించారు.
''మీరు అంగారక గ్రహం మీద చిక్కుపోయినా, అక్కడున్న భారత దౌత్య కార్యాలయం మీకు సాయం చేస్తుంది'' అంటూ బదులిచ్చారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ఇంకోసారి రీఫ్రిజరేటర్‌లో సమస్య గురించి ఓ తుంటరి ట్వీట్ పెడితే.. ''బ్రదర్.. రీఫ్రిజరేటర్ విషయంలో నీకు సాయపడలేను. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో బిజీగా ఉన్నా'' అని ట్వీట్ చేశారు.
మరోసారి ఓ వ్యక్తి గ్రామర్ తప్పులతో వచ్చీరానీ ఇంగ్లిష్‌లో సుష్మ స్వరాజ్‌కు ట్వీట్ పెట్టారు. దీనికి మరో ఆయన.. ''హిందీలోనో, పంజాబీలోనే ట్వీట్ చేస్తే సరిపోయేది కదా?'' అన్న వ్యాఖ్య జోడించారు.
''ఏం ఫర్వాలేదు. విదేశాంగ మంత్రి అయ్యాక, అన్ని రకాల ఇంగ్లిష్ యాసలు, గ్రామర్‌లను అర్థం చేసుకోవడం నేర్చుకున్నా'' అంటూ సుష్మ స్పందించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
2016లో కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సుష్మ హాజరుకాలేకపోయారు.
తన గైర్హాజరుపై మీడియాలో ఊహాగానాలు రాకుండా.. ''మీడియా.. 'ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సుష్మ డుమ్మా' అని మాత్రం హెడ్‌లైన్ పెట్టకండి'' అంటూ ఆమె ట్వీట్ పెట్టారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
మరోసారి ఓ వృద్ధ జంట ''మానస సరోవర్ యాత్రకు మమ్మల్ని వేర్వేరు బ్యాచ్‌ల్లో వేశారు. ఒంటరిగా వెళ్లడం మా వల్ల కాదు'' అని ట్వీట్ చేస్తే.. ''మిమ్మల్ని వేరు చేసిన నేరం కంప్యూటర్‌దే. బాధపడకండి. మీ ఇద్దరినీ ఒకే బ్యాచ్‌లో పంపిస్తాం'' అని సుష్మ వారికి భరోసా ఇచ్చారు.
ఐపీఎల్‌లో బాగా ఆడుతున్న అఫ్గాన్ క్రికెటర్ రషీద్ ఖాన్‌కు భారత పౌరసత్వం ఇవ్వాలంటూ జనాలు సరదాగా ట్వీట్లు చేస్తే.. ''ట్వీట్లన్నీ చూశా. కానీ పౌరసత్వ వ్యవహారాలు హోంశాఖ చూసుకుంటుంది'' అని సుష్మ స్పందించారు.

ఫొటో సోర్స్, MEAINDIA
పూలు చల్లిన చోటే రాళ్లూ..
‘ట్విటర్ దౌత్యం’తో చాలా మంది మన్ననలు పొందిన సుష్మ స్వరాజ్ కొన్ని సందర్భాల్లో ఆగ్రహాన్ని కూడా చవిచూడాల్సి వచ్చింది.
2018లో ఓసారి హిందూవాదులు, సొంత పార్టీ మద్దతుదారులు ఆమెను లక్ష్యంగా చేసుకున్నారు.
లఖ్‌నవూ పాస్‌పోర్ట్ కార్యాలయంలో మత వివక్ష ఎదుర్కొన్నానంటూ ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకున్న ఓ హిందూ యువతి ట్విటర్‌లో సుష్మ స్వరాజ్‌కు ఫిర్యాదు చేశారు.
ఆరోపణలు వచ్చిన అధికారిపై చర్యలు తీసుకుని, ఆ యువతికి సుష్మ స్వరాజ్ పాస్‌పోర్ట్ ఇప్పటించారు.
నిబంధనల ప్రకారం ఆ యువతి పేరును మ్యారేజ్ సర్టిఫికెట్‌లో ఉన్నట్టుగా రాయాలని కోరానని, తానే తప్పూ చేయలేదని ఆ అధికారి వివరణ ఇచ్చుకున్నారు.
సుష్మా స్వరాజ్ ముస్లింల బుజ్జగింపులో హద్దులు దాటుతున్నారంటూ, ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్విటర్‌లో చాలా మంది కామెంట్లు పెట్టారు.
ఫేస్‌బుక్‌లో ఆమెకు నెగెటివ్ రేటింగ్ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి:
- సుష్మా స్వరాజ్ ‘తెలంగాణ చిన్నమ్మ’ ఎలా అయ్యారు? రాష్ట్ర ఏర్పాటులో ఆమె పాత్ర ఏంటి?
- LIVE: సుష్మా స్వరాజ్ కన్నుమూత.. సాయంత్రం 4 గంటలకు అంతిమ సంస్కారాలు
- కశ్మీరీ పండితులు తమ నేలను వదిలి పారిపోయిన రోజు ఏం జరిగింది...
- బీజేపీ: అటల్- అడ్వాణీ నుంచి మోదీ-షా వరకు
- జమ్మూకశ్మీర్: జమ్ము-కశ్మీర్ విభజన బిల్లుకు లోక్‌సభ ఆమోదం
- ట్రిపుల్ తలాక్ చట్టంతో ముస్లిం మహిళలకు మేలెంత?
- 'ఆర్టికల్ 370 సవరణ' తర్వాత కశ్మీర్లో పరిస్థితి ఎలా ఉంది? స్థానికులు ఏమంటున్నారు?
- బీజేపీ ఎంపీ రమాదేవి: ఆమె ఈ స్థాయికి చేరుకోవడానికి పడిన శ్రమంతా ఎవరికీ పట్టదా?
- కశ్మీరీ పండిట్లు: 'ఎన్నో మరణాలు, రక్తపాతాలు చూశాం. కానీ, ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)