సుష్మాస్వరాజ్ నిష్క్రమణ.. అంత్యక్రియలు పూర్తి

సుష్మా స్వరాజ్

ఫొటో సోర్స్, PTI

బీజేపీ సీనియర్ నాయకురాలు, విదేశీ వ్యవహారాల శాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. మంగళవారం రాత్రి కార్డియాక్ అరెస్ట్‌ కారణంగా ఆమె కన్నుమూశారు.

లోధీరోడ్‌లోని స్మశానవాటికలో సైనిక లాంఛనాలతో ఆమెకు అంత్యక్రియలకు నిర్వహించారు.

ప్రధాని నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీనియర్ నేతలు అడ్వాణీ, రాజ్‌నాథ్ సింగ్‌, ఇతర నేతలు ఆమెకు నివాళులర్పించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

బీజేపీ నేతలు

ఫొటో సోర్స్, ANI

సుష్మాస్వరాజ్ అంతిమ సంస్కారాల్లో విషణ్న వదనాలతో ప్రధాని నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ ఉప ప్రధాని అడ్వాణీ, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్.

అంతిమ సంస్కారాలు

ఫొటో సోర్స్, Ani

ఆమె అంతిమ యాత్ర బీజేపీ ప్రధాన కార్యాలయం నుంచి లోధీ స్మశానవాటిక వరకు సాగింది. కుమార్తె బన్సురీ స్వరాజ్ అంతిమ సంస్కారాలు పూర్తిచేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

అంతకుముందు ఆమె భౌతిక కాయాన్ని ఉదయం నుంచి స్వగృహంలో ఉంచారు. అనంతరం దిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి తీసుకొచ్చారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, శశి థరూర్, ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు అక్కడికి వెళ్లి నివాళులు అర్పించారు.

సుష్మా స్వరాజ్‌కు నివాళి

ఫొటో సోర్స్, Bjp

ఆంధ్రప్రదేశ్ బీజేపీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఇతర నాయకులు నివాళులర్పించారు.

‘అమ్మ మరణం దేశానికి, పార్టీకి ఎన్నటికీ పూడ్చలేని లోట’ని ఆయన అన్నారు.

సుష్మా స్వరాజ్‌కు నివాళి

ఫొటో సోర్స్, Bjp

బీజేపీ తెలంగాణ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, నల్లు ఇంద్రసేనారెడ్డి తదితరులు నివాళులర్పించారు.

సుష్మా స్వరాజ్

ఫొటో సోర్స్, Getty Images

కార్డియాక్ అరెస్టుతో..

మంగళవారం రాత్రి సుష్మా స్వరాజ్ అస్వస్థతకు గురవడంతో దిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్)‌కు ఆమె కుటుంబ సభ్యులు తరలించారు.

ఆమె కార్డియాక్ అరెస్టుతో మరణించినట్లు ఎయిమ్స్ వైద్యులు ప్రకటించారు.

సుష్మ వయసు 67 సంవత్సరాలు.

బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా మాట్లాడుతూ.. ‘‘సుష్మా స్వరాజ్ మనమధ్య లేరు. దేశ రాజకీయాల్లో అందరికీ ఆమె స్ఫూర్తినిచ్చారు. సుష్మ దేశ సేవలో ఎలా నిమగ్నమయ్యారో.. ఆమె చివరి ట్వీట్ స్పష్టం చేస్తోంది’’ అన్నారు.

‘‘అంతిమ దర్శనం కోసం ఆమె పార్దీవ దేహాన్ని ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకూ పార్టీ కార్యాలయంలో ఉంచుతాం. ఆ తర్వాత లోథీ రోడ్డులోని స్మశానవాటికలో గౌరవ లాంఛనాలతో ఆమె అంతిమ సంస్కారాలు జరుగుతాయి’’ అని నడ్డా వెల్లడించారు.

Presentational grey line

సుష్మా స్వరాజ్ 'తెలంగాణ చిన్నమ్మ' ఎలా అయ్యారు?

‘‘కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నాను. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఆమె ఇచ్చిన మద్దతును తెలంగాణ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. శాంతి చిన్నమ్మా’’ అని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విటర్ ద్వారా సుష్మాకు నివాళులర్పించారు.

Presentational grey line

పాకిస్తానీ అభ్యంతరకర ట్వీట్

సుష్మా స్వరాజ్ మృతిపై పాకిస్తాన్‌కు చెందిన షోయబ్ అన్సారీ అనే నెటిజన్ అభ్యంతరకరంగా ట్విటర్‌లో చేసిన కామెంట్‌పై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

సుష్మా స్వరాజ్ మృతికి నివాళిగా కేటీఆర్ ‘‘నేను కలిసిన ప్రతీసారి ఆమె మీద మరింత గౌరవం పెరిగేది. ప్రపంచంలో ఎక్కడైనా భారతీయులు బాధల్లో ఉంటే ఒక్క ట్వీట్‌తో సహాయం చేసి వారిలో విశ్వాసాన్ని నింపే నిజమైన నేత ఆమె’’ అని చేసిన ట్వీట్‌కు అన్సారీ సమాధానం ఇస్తూ ''కశ్మీర్‌పై భారత ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే ఆమె చనిపోయారు. ఆమెకు నరకం వేచి ఉంది'' అని ట్వీట్ చేశారు.

దీనికి కేటీఆర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ''ఒక నేత ఆకాల మరణాన్ని ఉద్దేశిస్తూ మీరు చేసిన వ్యాఖ్యలు మతిలేనివి. మీ వక్రబుద్ధి కనిపిస్తుంది. షోయబ్, ప్రొఫైల్‌లో చెబుతున్నట్లు మీరు పాకిస్తానీ అయినా జీవితాంతం ప్రజాసేవలోనే ఉన్న సుష్మా స్వరాజ్‌ను గౌరవించేందుకు ధైర్యం, మర్యాద సంపాదించుకోగలవని కోరుకుంటున్నా'' అని ట్వీట్ చేశారు.

Presentational grey line
కేటీఆర్

ఫొటో సోర్స్, ktr/twitter

సుష్మ చివరగా ఎవరితో మాట్లాడారు?

ప్రసిద్ధ లాయర్, భారత్ తరఫున అంతర్జాతీయ న్యాయస్థానంలో కులభూషన్ కేసును వాదిస్తున్న హరీశ్ సాల్వేతో సుష్మా స్వరాజ్ చివరిసారిగా మాట్లాడారు.

ఈ విషయాన్ని సాల్వేనే చెప్పారు.

Presentational grey line

కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి?

భారతదేశ విదేశాంగ శాఖ మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు సుష్మా స్వరాజ్ కార్డియాక్ అరెస్ట్ కారణంగా మృతి చెందారని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. మంగళవారం రాత్రి భోజన సమయంలో నలతగా ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఎయిమ్స్‌కు తీసుకెళ్లారు. అయితే, వైద్యం ప్రారంభించే సమయానికే ఆమె మరణించారని వైద్యులు వెల్లడించారు.

కార్డియాక్ అరెస్ట్ అంటే ఏమిటి? ఇది మనిషి శరీరంపై ఇంత భయంకరమైన ప్రభావం ఎలా చూపిస్తుంది? ఇది హార్ట్ ఫెయిల్ కావడం లేదా గుండెపోటు రావడం కంటే ఏ విధంగా భిన్నమైంది?

మోదీ, సుష్మ, అడ్వాణీ

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, మోదీ, సుష్మ, అడ్వాణీ

పాతికేళ్ల వయసులో రాజకీయాల్లోకి...

సుష్మా పాతికేళ్ల వయసులో రాజకీయాల్లోకి వచ్చారు. ఆమె రాజకీయ గురువు బీజేపీ సీనియర్ నేత లాల్‌కృష్ణ అడ్వాణీ.

ఎన్నికల రాజకీయాలకు సుష్మ గత సంవత్సరం వీడ్కోలు పలికారు. ఎన్నికల్లో పోటీచేయబోవట్లేదని 2018 నవంబరులో ఆమె ప్రకటించారు.

సుష్మా స్వరాజ్ ప్రకటనపై ఆమె భర్త, మాజీ గవర్నర్ స్వరాజ్ కౌశల్ ట్విటర్‌లో స్పందిస్తూ- ''ఒకానొక సమయం తర్వాత మిల్కా సింగ్ కూడా పరుగును ఆపేయాల్సి ఉంటుంది. మీరు గత 41 ఏళ్లుగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు'' అని వ్యాఖ్యానించారు.

మోదీ, సుష్మ

ఫొటో సోర్స్, AFP

నాకు వ్యక్తిగతంగా తీరని లోటు: ప్రధాని మోదీ

సుష్మా స్వరాజ్ మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఆమె మరణం తనకు వ్యక్తిగతంగా కూడా తీరని లోటని తెలిపారు.

భారత్ కోసం సుష్మ అందించిన సేవలకుగాను ఆమె ఎప్పటికీ గుర్తుండిపోతారని మోదీ చెప్పారు. సుష్మ మరణంతో భారత రాజకీయాల్లో ఒక గొప్ప అధ్యాయం ముగిసిందని వ్యాఖ్యానించారు.

విదేశీ వ్యవహారాలశాఖ మంత్రిగా సుష్మా చేసిన అవిరళ కృషిని తాను ఎన్నటికీ మరవలేనని మోదీ ట్విటర్‌లో చెప్పారు. ఆరోగ్యం సహకరించకున్నా తన బాధ్యతలకు న్యాయం చేసేందుకు ఆమె శక్తివంచన లేకుండా కృషి చేసేవారని తెలిపారు.

సుష్మ గొప్ప వక్త అని, అత్యుత్తమ పార్లమెంటేరియన్ అని ప్రధాని ప్రశంసించారు. పార్టీలకు అతీతంగా ఆమెను అందరూ గౌరవిస్తారని చెప్పారు.

బీజేపీ సిద్ధాంతాలు, ప్రయోజనాల విషయంలో ఆమె ఎన్నడూ రాజీపడలేదని, బీజేపీ ఎదుగుదలలో ఆమె పాత్ర ఎంతగానో ఉందని తెలిపారు.

నరేంద్ర మోదీ ట్వీట్లు

ఫొటో సోర్స్, Twitter

ఫొటో క్యాప్షన్, సుష్మా స్వరాజ్‌ మరణం అనంతరం ప్రధాని మోదీ చేసిన ట్వీట్లు

సుష్మ 1952 ఫిబ్రవరి 14న హరియాణాలోని అంబాలాలో జన్మించారు. ఆమె న్యాయవిద్య అభ్యసించారు.

1975లో స్వరాజ్ కౌశల్‌ను ఆమె వివాహం చేసుకున్నారు.

సుష్మా స్వరాజ్, స్వరాజ్ కౌశల్ దంపతులకు ఒక కుమార్తె ఉన్నారు.

స్వరాజ్ కౌశల్, సుష్మా స్వరాజ్

ఫొటో సోర్స్, Twitter/SushmaSwaraj

ఫొటో క్యాప్షన్, స్వరాజ్ కౌశల్, సుష్మా స్వరాజ్ దంపతులకు ఒక కుమార్తె ఉన్నారు.

పాతికేళ్ల వయసులో రాజకీయాల్లోకి వచ్చిన సుష్మా స్వరాజ్ గత నాలుగు దశాబ్దాల్లో 11 ఎన్నికల్లో పోటీ చేశారు. వాటిలో మూడు అసెంబ్లీ ఎన్నికలున్నాయి.

సుష్మ 1998లో స్వల్పకాలం పాటు దిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు.

కేంద్రంలో అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో సమాచార, ప్రసార శాఖ, తర్వాత ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం శాఖ, పార్లమెంటరీ వ్యవహారాలశాఖల మంత్రిగా పనిచేశారు.

2009-14 మధ్యకాలంలో సుష్మ లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా పనిచేశారు.

మోదీ ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాల మంత్రిగా ఉన్నప్పుడు, ఆ తర్వాత కూడా ఆమె ట్విటర్‌లో చురుగ్గా ఉండేవారు.

విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి రప్పించడంలో, పాస్‌పోర్టు సంబంధిత సమస్యల పరిష్కారంలో ఆమె చొరవతో స్పందించేవారు.

సుష్మా స్వరాజ్ ట్వీట్

ఫొటో సోర్స్, Twitter/Sushma Swaraj

ఫొటో క్యాప్షన్, సుష్మా స్వరాజ్ చేసిన చివరి ట్వీట్ ఇదే.

ఆగస్టు 6 మంగళవారం రాత్రి 7:23 గంటలకు సుష్మా స్వరాజ్ చేసిన ట్వీటే ఆమె చివరి ట్వీట్.

ఆర్టికల్ 370 సవరణ నేపథ్యంలో చేసిన ఈ ట్వీట్‌లో ప్రధాని మోదీకి ఆమె ధన్యవాదాలు తెలిపారు.

ఈ రోజు కోసం తాను జీవితమంతా ఎదురుచూశానని సుష్మ వ్యాఖ్యానించారు.

జులై 25న తనను కలిసిన కుల్‌భూషణ్ జాదవ్ కుటుంబ సభ్యులతో సుష్మా స్వరాజ్

ఫొటో సోర్స్, Twitter/SushmaSwaraj

ఫొటో క్యాప్షన్, జులై 25న తనను కలిసిన కుల్‌భూషణ్ జాదవ్ కుటుంబ సభ్యులతో సుష్మా స్వరాజ్. గూఢచర్యం ఆరోపణలతో భారతీయుడైన కుల్‌భూషణ్‌ జాధవ్‌కు పాకిస్తాన్ విధించిన మరణశిక్షను ది హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం జులై 17న నిలిపివేసింది.

సుష్మా స్వరాజ్ మృతిపై కాంగ్రెస్ పార్టీ ట్విటర్‌లో సంతాపం వ్యక్తంచేసింది.

ఆమె కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు కాంగ్రెస్ సానుభూతి తెలిపింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

సుష్మ మరణంపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతాపం ప్రకటించారు.

వివిధ హోదాల్లో దేశానికి ఆమె అందించిన సేవలను ఆయన ప్రశంసించారు.

పోస్ట్‌ Facebook స్కిప్ చేయండి

కంటెంట్ అందుబాటులో లేదు

మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of Facebook ముగిసింది

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ట్విటర్‌లో స్పందిస్తూ- సుష్మ హఠాన్మరణం దిగ్భ్రాంతి కలిగించిందని చెప్పారు.

దేశ మహిళలకు ఆమె స్ఫూర్తినిచ్చారని ఆయన ప్రశంసించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 5

వివిధ నాయకత్వ బాధ్యతల్లో సుష్మ దేశానికి అందించిన సేవలను ఎన్నటికీ మరచిపోలేమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు చెప్పారు.

విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా సుష్మ అద్భుతమైన పనితీరు కనబరిచారని, ఆమె పనితీరు పరిపాలనకు ఓ గొప్ప నమూనాగా నిలిచిపోతుందని ఆయన ట్విటర్‌లో వ్యాఖ్యానించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 6
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 6

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)