మూడేళ్ల క్రితం పారిపోయిన భర్త టిక్‌టాక్‌లో దొరికాడు

సురేష్, జయప్రద

మూడేళ్ల క్రితం కనిపించకుండాపోయిన భర్తను టిక్‌టాక్‌లో గుర్తించి, మళ్లీ కలుసుకున్నారు తమిళనాడుకు చెందిన జయప్రద.

2016లో ఇంటి నుంచి వెళ్లిపోయిన సురేశ్, అప్పటి నుంచి ఓ ట్రాన్స్‌జెండర్‌తో కలసి జీవిస్తున్నారని పోలీసులు తెలిపారు.

ట్రాన్స్‌జెండర్‌తో కలసి టిక్‌టాక్‌లోని ఓ వీడియోలో ఉన్న వ్యక్తిని జయప్రద బంధువుల్లో ఒకరు ముందుగా గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

అతడు తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలోని హోసూరులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

ఆయన భార్య విలుప్పురం జిల్లాలో ఉంటారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు.

సురేష్

"ఈ భార్యాభర్తలిద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చాం. వాళ్లిద్దరూ ఇప్పుడు కలిసి సంతోషంగా ఉన్నారు" అని పోలీసులు తెలిపారు.

"మేం ముందుగా జిల్లాలోని ఓ ట్రాన్స్‌జెండర్ సంస్థను సంప్రదించాం. వారి సహాయంతో సురేశ్‌తో కలిసి వీడియోలో ఉన్న ట్రాన్స్‌జెండర్ వివరాలను తెలుసుకున్నాం" అని పోలీసులు బీబీసీకి తెలిపారు.

సురేష్, జయప్రద

ఉన్నట్లుండి ఓ రోజు రాత్రి జయప్రద భర్త ఇంటికి రాలేదు.

తన భర్త కనిపించకుండా పోయిన వెంటనే... ఆమె మిస్సింగ్ కేసు పెట్టారు. అప్పట్లో పోలీసులు ఎంతగా ప్రయత్నించినా సురేశ్ జాడ తెలియలేదు.

కానీ, టిక్‌టాక్‌ యాప్ ద్వారా తన భర్త జాడను తెలుసుకుని, కలుసుకోగలిగారు జయప్రద.

టిక్ టాక్ యాప్

ఫొటో సోర్స్, TIKTAK/YOUTUBE

ఏంటీ టిక్‌టాక్?

టిక్‌టాక్ యాప్ సహాయంతో వీడియోలను రూపొందించి, ఆన్‌లైన్‌లో పంచుకోవచ్చు. ఇది ప్రస్తుతం ఓ ట్రెండింగ్ యాప్. దీన్ని భారత్‌లో నెలకు 12 కోట్లమంది వినియోగిస్తున్నారు. అయితే ఈ యాప్‌పై చాలా విమర్శలున్నాయి.

కొందరు అశ్లీల వీడియోలను వ్యాపింపచేయడానికి దీన్ని ఉపయోగిస్తున్నారంటూ ఈ యాప్‌ను యాప్‌ స్టోర్ నుంచి తొలగించాలంటూ ఏప్రిల్‌లో తమిళనాడులోని ఓ కోర్టు ఆదేశించింది. అయితే తర్వాత మళ్లీ ఆ ఆదేశాలను రద్దు చేసింది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)