సుప్రీంకోర్టు: యోగి ఆదిత్యనాథ్‌పై ‘అభ్యంతరకరమైన’ ట్వీట్ చేసిన జర్నలిస్ట్‌ను తక్షణం విడుదల చేయండి

ప్రశాంత్ కనోజియా

ఫొటో సోర్స్, PRASHANT KANOJIA/FACEBOOK

జర్నలిస్ట్ ప్రశాంత్ కనౌజియాను తక్షణం విడుదల చేయాలని సుప్రీం కోర్టు వేసవి సెలవుల ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై సోషల్ మీడియాలో ‘అభ్యంతరకరమైన వ్యాఖ్య’ చేసినందుకు ఉత్తరప్రదేశ్ పోలీసులు ఒక విలేకరిని అరెస్ట్ చేశారు.

అరెస్టైన జర్నలిస్ట్ పేరు ప్రశాంత్ కనౌజియా. దిల్లీలో ఉన్న ప్రశాంత్‌ను శనివారం అరెస్ట్ చేసిన పోలీసులు లఖ్‌నవూ తీసుకెళ్లారు.

‘‘ఆయన ట్విటర్‌లో ఒక వీడియో అప్‌లోడ్ చేశారు. అందులో ఒక మహిళ తాను యోగి ఆదిత్యనాథ్‌ ప్రియురాలినని చెబుతోంది’’ అని ప్రశాంత్ భార్య జగీషా అరోరా బీబీసీకి తెలిపారు.

అయితే, జర్నలిస్ట్ ప్రశాంత్ అరెస్టును సవాల్ చేస్తూ ఆయన తరపు న్యాయవాది నిత్యా రామకృష్ణన్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

న్యాయమూర్తులు అజయ్ రస్తోగి, ఇందిరా బెనర్జీలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిపింది. జర్నలిస్ట్ ప్రశాంత్‌ను విడుదల చేసి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తన ఔదార్యం చూపించుకోవాలని ధర్మాసనం తెలిపింది.

పౌరుడి స్వేచ్ఛ అన్నదే అత్యంత పవిత్రమైన అంశమని, ఈ విషయంలో ఎలాంటి చర్చలకూ తావు తేదని ధర్మాసనం అభిప్రాయపడింది. రాజ్యాంగం ద్వారా లభించిన స్వేచ్ఛను హరించరాదని స్పష్టం చేసింది.

యోగి ఆదిత్యనాథ్

ఫొటో సోర్స్, Getty Images

కాగా, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై పరుష పదజాలంతో సోషల్ మీడియాలో పోస్టులు చేసినందువల్లనే తాము ఐపీసీ సెక్షన్ 505 కింద కేసు నమోదు చేయాల్సి వచ్చిందని, ఈ పోస్టులు, ట్వీట్లు చాలా తీవ్రంగా ఉన్నాయని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరపు న్యాయవాది చెప్పారు.

కాగా, హైకోర్టును ఎందుకు ఆశ్రయించలేదని ప్రశాంత్ భార్య జగీషా అరోరాను సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

దీనికి ఆమె స్పందిస్తూ.. తాము దాఖలు చేసింది హెబియస్ కార్పస్ విజ్ఞప్తి అని, దానికి సరైన వేదిక సుప్రీంకోర్టేనని చెప్పారు.

ప్రశాంత్ ఆ ట్వీట్లు చేసి ఉండకూడదని, అలాగే అతన్ని అరెస్ట్ కూడా చేసి ఉండకూడదని న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా బెనర్జీ అన్నారు.

కాగా, భారత రాజ్యంగంపై తనకు నమ్మకం ఉందని, సుప్రీంకోర్టు తీర్పు పట్ల తాను చాలా ఆనందంగా ఉన్నానని, తన భర్తను కలుసుకోవాలని ఉందని ప్రశాంత్ భార్య జగీషా అన్నారు. తన భర్త ఎలాంటి తప్పూ చేయలేదని ఆమె చెప్పారు.

ఈ వీడియోతో పాటు ప్రశాంత్.. యోగి ఆదిత్యనాథ్‌ను ఉద్దేశించి ఒక వ్యాఖ్య చేశారు.

ఈ వ్యవహారంలో ప్రశాంత్‌పై లఖ్‌నవూలోని హజరత్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఐటీ చట్టం సెక్షన్ 66, ఐపీసీ సెక్షన్ 500ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

ఎఫ్‌ఐఆర్ కాపీ

ఫొటో సోర్స్, UP POLICE

అరెస్ట్ వ్యవహారంపై సమాజ్‌వాది పార్టీ స్పందించింది. ‘‘చట్టాన్ని రక్షించడంలో విఫలమైన ప్రభుత్వం విలేకరులపై తన ప్రతాపం చూపిస్తోంది’’ అని ట్వీట్ చేసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

నోయిడా పోలీసుల ట్వీట్

ఫొటో సోర్స్, NOIDA POLICE

కాగా, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై సోషల్ మీడియాలో ‘అభ్యంతరకరమైన వ్యాఖ్య’ చేసినందుకు ఒక టీవీ న్యూస్ చానెల్ హెడ్, ఎడిటర్‌ను నోయిడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు శనివారం ట్వీట్ కూడా చేశారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)