సోషల్ మీడియా ఎడిక్షన్: బయటపడటం ఎలా?.. డిజిటల్ డిటాక్స్ అంటే ఏంటి?

సోషల్ మీడియా

ఫొటో సోర్స్, iStock

ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్... ఇలాంటి యాప్స్ జీవితంలో భాగమైపోయాయి. కానీ సోషల్ మీడియాను 6 గంటల కంటే ఎక్కువ సేపు ఉపయోగిస్తే ఆరోగ్యంతో పాటు పనిపైనా ప్రభావం పడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఐదుగురు ఉద్యోగుల్లో ఒకరు ఒత్తిడితో బాధపడుతున్నారు. సోషల్ మీడియా నుంచి బయటపడేందుకు కొందరు డిజిటల్ డిటాక్స్ పద్ధతిని పాటిస్తున్నారు.

సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకోవడమే డిజిటల్ డిటాక్స్. ఆ విరామం కొద్ది గంటలే కావొచ్చు, లేదా కొన్ని రోజులు కావొచ్చు.

డిజిటిల్ డిటాక్స్ అంటే ఏంటో తెలియాలంటే ఈ వీడియో చూడండి

వీడియో క్యాప్షన్, వీడియో: డిజిటల్ డిటాక్స్ వల్ల చాలా ఉపయోగాలున్నాయి

ఆ విరామంలో సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ పుస్తకం చదవడం, ఆడుకోవడం, వ్యాయామం లాంటి పనులు చేయొచ్చు. అనుకున్న సమయం ముగిశాక మళ్లీ సోషల్ మీడియాకు రావొచ్చు.

ఎలాంటి అవసరం, కారణం లేకుండా సోషల్ మీడియాలో స్ర్కోల్ చేయడాన్ని నివారించడం అలవాటు చేసుకోవాలి.

డిజిటల్ డిటాక్స్ వల్ల చాలా ఉపయోగాలున్నాయి. ఒత్తిడి స్థాయులు 27శాతం దాకా తగ్గుతాయి. దీని వల్ల 6 శాతం ఎక్కువ సంతోషంగా ఉండొచ్చు. పనితీరు కూడా 8 శాతం మెరుగుపడుతుంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)