నరేంద్ర మోదీ భారీ విజయం.. దేశంలోని ముస్లింలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది

ఫొటో సోర్స్, Getty Images
నరేంద్రమోదీ మరోసారి భారీ మెజారిటీతో గెలిచారు. మరి భారతదేశంలో మైనారిటీలైన ముస్లింలపై ఈ విజయం ప్రభావం ఎలా ఉంటుంది?
జాతీయవాదం, అభివృద్ధి సమ్మేళనంతో ఆయన చేసిన ప్రచారం ఎన్నికలను స్వీప్ చేసింది. గత ఎన్నికల కన్నా పెద్ద విజయాన్ని అందించింది.
‘‘ఈ భిక్షువు పాత్రను దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలూ నింపారు. భారతదేశంలోని 130 కోట్ల ప్రజలకు నా శిరసు వంచి నమస్కరిస్తున్నాను’’ అని మోదీ పేర్కొన్నారు.
ఈ ఎన్నికల పోరు భారతదేశ లౌకిక గుర్తింపు కోసం జరుగుతున్న పోరుగా చాలా మంది పరిగణించారు.
దేశంలో గత ఐదేళ్లలో హిందూ జాతీయవాదం పెరిగింది. దేశంలోని మైనారిటీల మీద దాడులు పెరిగాయి. గోవధ ఆరోపణలతో డజన్ల సంఖ్యలో ముస్లింలను కొట్టి చంపారు.
దేశంలో మెజారిటీ అయిన హిందువుల్లో చాలా మంది గోవును పూజిస్తారు.
ఇప్పుడు మైనారిటీల పరిస్థితి ఇంకా దిగజారుతుందని కొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
‘‘ఇది హిందూ మెజారిటీ దేశమని ప్రజలకు తరచుగా గుర్తుచేస్తుండటం, సమ్మిశ్ర చరిత్రను మరుగుపరచటం పెరుగుతుందని నేను అనుకుంటున్నా’’ అంటారు రాజకీయ విశ్లేషకుడు ప్రతాప్ భాను మెహతా.

ఫొటో సోర్స్, Getty Images
ఎన్నికల్లో హిందూ అతివాదులు భారీ మెజారిటీలతో గెలిచారు. వారిలో ప్రజ్ఞా ఠాకూర్ ఒకరు. ముస్లింలను లక్ష్యంగా చేసుకుని బాంబు పేలుళ్లకు కుట్ర పన్నారన్న ఆరోపణలు ఈమెపై ఉన్నాయి.
కానీ తాము మైనారిటీ వ్యతిరేకులం కామని పార్టీ నేతలు అంటున్నారు. 'బలమైన, సమ్మిళత భారత్' నిర్మిస్తానని గెలిచిన తర్వాత మోదీ స్వయంగా చెప్పారు.
‘‘ఇండియాలో ఇప్పుడు కేవలం రెండు కులాలే ఉన్నాయి: ఒకటి పేదవాళ్లు, రెండు వారిని పేదరికం నుంచి బయటకు తేవటానికి పనిచేయాలని కోరుకునేవాళ్లు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
సమాజాన్ని విభజించే వ్యక్తిగా మోదీని కొందరు చూస్తారు. కానీ 'నవీన భారత్' అనే ఆయన విజన్‌ను చాలా మంది నమ్ముతున్నారు.
ఇవి కూడా చదవండి.
- మోదీ వాగ్ధానాల విలువ రూ.100 లక్షల కోట్లు.. అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది?
- "ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేల్లో 96మందిపై క్రిమినల్ కేసులు, ధనిక ఎమ్మెల్యేలు చంద్రబాబు, జగన్, బాలకృష్ణ"
- ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ కథ కంచికి చేరినట్లేనా?
- డాక్టర్ పాయల్ తాడావీ: కులం పేరుతో వేధింపులు.. ఆత్మహత్య చేసుకున్న డాక్టర్
- వైఎస్ జగన్మోహన్ రెడ్డి: కొత్త తరం నాయకుల ప్రతినిధి
- BBC Fact Check: ‘చంద్ర దోషము వీడేనయ.. రాజన్న రాజ్యంబు వచ్చేనయ’.. ఇది నిజమేనా?
- ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ కథ కంచికి చేరినట్లేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










