ఎగ్జిట్ పోల్స్ ట్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ , తెలంగాణల్లో ఎలా ఉన్నాయంటే...

చంద్రబాబు, జగన్

సార్వత్రిక ఎన్నికల తుది దశ పోలింగ్ ముగిసిన తర్వాత ఆదివారం సాయంత్రం వివిధ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను వెల్లడించాయి.

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌‌సభ ఎన్నికలపై ఈ అంచనాలు ఒకే దిశలో లేవు. వివిధ సంస్థల మధ్య అంచనాల్లో చాలా వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలపై మాత్రం అన్ని సంస్థల అంచనాలు ఒకే దిశలో ఉన్నాయి. అన్ని సంస్థలూ అత్యధిక స్థానాలు తెలంగాణ రాష్ట్ర సమితికే దక్కుతాయని అంచనా వేస్తున్నాయి. ఈ అంచనాల ప్రకారం ఏ పార్టీ కూడా టీఆర్‌ఎస్‌కు దగ్గర్లో కనిపించడం లేదు.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి 100 నుంచి 110 స్థానాలు వచ్చే అవకాశం ఉందని లగడపాటి (ఆర్జీ ఫ్లాష్ టీమ్) సర్వే అంచనా వేసింది. వైఎస్సార్సీపీకి 72 నుంచి 79 స్థానాలు, ఇతరులకు 3-5 స్థానాలు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు సీపీఎస్ ఎగ్జిట్ పోల్స్ వైసీపీకి 130-133, టీడీపీకి 43-44 స్థానాలు గెల్చుకోవచ్చని ప్రకటించింది.

వివిధ మీడియా సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ వివరాలు:

ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్ సభ స్థానాలకు, 175 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 11న ఒకే విడతలో పోలింగ్ జరిగింది. అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(వైఎస్సార్సీపీ,) జనసేన పార్టీ ఈ ఎన్నికల్లో ప్రధాన పక్షాలుగా తలపడ్డాయి.

తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు అదే రోజు పోలింగ్ జరిగింది.

కేసీఆర్ ఉత్తమ్

ఫొటో సోర్స్, facebook

పోలింగ్ ముగిసిన తర్వాత ఓటర్లు ఏ పార్టీకి ఓటు వేశారనే ప్రాతిపదికన నిర్వహించే ఎగ్జిట్ పోల్స్ అంచనాలను ప్రజలు ఆసక్తిగా గమనిస్తుంటారు.

ఎన్నికల ముందు నిర్వహించే ఒపీనియన్ పోల్స్ కన్నా, పోలింగ్ తర్వాత వచ్చే ఎగ్జిట్ పోల్స్ అసలైన ఫలితాలకు దగ్గరగా ఉండే అవకాశం ఉందనే భావన ఉంది.

అయితే అన్నిసార్లూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజం కాలేదు. కొన్ని సందర్భాల్లో వీటికి భిన్నమైన ఫలితాలు కూడా వచ్చాయి.

ఈసారి ఏం జరుగుతుందనేది గురువారం తేలుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)