జలియన్ వాలాబాగ్ విషాదం బ్రిటిష్ ఇండియా చరిత్రలో మాయని మచ్చ: థెరెసా మే

థెరీసా మే

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అదితి ఖన్నా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

జలియన్ వాలాబాగ్ విషాదం బ్రిటిష్ ఇండియా చరిత్రలో ఒక 'అవమానకరమైన మచ్చ'గా బ్రిటన్ ప్రధాన మంత్రి థెరెసా మే వర్ణించారు.

బుధవారం ఆ దేశ పార్లమెంటులో మాట్లాడిన బ్రిటన్ ప్రధాని థెరెసా మే జలియన్ వాలాబాగ్ విషాదం జరిగి వందేళ్లవుతున్న సందర్భంగా ఆ ఘటనపై విచారం వ్యక్తం చేశారు.

జలియన్ వాలాబాగ్ మారణహోమం బ్రిటిష్ ఇండియా చరిత్రకు ఒక అవమానకరమైన మచ్చ'గా వర్ణించిన బ్రిటన్ ప్రధాని కానీ అధికారికంగా క్షమాపణ మాత్రం కోరలేదు.

హౌస్ ఆఫ్ కామన్స్ లో ప్రతి వారం ప్రధానిని అడిగే ప్రశ్నలకు సమాధానంగా థెరీసా మే ఈ విషాదం గురించి మాట్లాడారు.

అంతకు ముందు జరిగిన చర్చల్లో పార్లమెంట్ క్రాస్-సెక్షన్ ఈ విషాదంపై అడిగిన అధికారిక క్షమాపణ మాత్రం చెప్పలేదు.

జలియన్ వాలాబాగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జలియన్ వాలాబాగ్

అంతకు ముందు బ్రిటిష్ ప్రభుత్వం చెప్పినట్లే ఆ విషాదానికి థెరీసా మే విచారం వ్యక్తం చేశారు.

"1919లో జరిగిన జలియన్ వాలాబాగ్ విషాదం బ్రిటిష్ ఇండియా చరిత్రకు ఒక మాయని మచ్చ లాంటిది. గౌరవనీయులైన క్వీన్(ఎలిజెబెత్ 2) 1997లో జలియన్ వాలాబాగ్‌ను సందర్శించక ముందు చెప్పినట్లు భారత్‌తో మన గత చరిత్రకు ఇది ఒక విషాదకరమైన ఉదాహరణ" అని థెరెసా మే అన్నారు.

జలియన్ వాలాబాగ్

ఫొటో సోర్స్, Getty Images

1919 ఏప్రిల్‌లో అమృత్‌సర్‌లో బైశాఖి రోజున జలియన్ వాలాబాగ్‌ మారణహోమం జరిగింది.

ఏప్రిల్ 13న స్వాతంత్రోద్యమానికి అనుకూల ప్రదర్శనల కోసం జలియన్ వాలాబాగ్‌లో భారీగా గుమిగూడిన జనంపై బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ దళాలు కాల్పులు జరిపాయి.

కల్నల్ డయ్యర్ ఆదేశాలతో సైనికులు మెషిన్ గన్లతో జనంపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో వేలాది మంది మృతి చెందగా, కొన్ని వేల మంది గాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)