దక్షిణ ధ్రువాన్ని చేరిన మొదటి మహిళా ఐపీఎస్

చేతిలో కర్ర, వీపుమీద 35కేజీల బరువున్న బ్యాగ్‌తో మంచుముద్దలపై నడుస్తున్నారు అపర్ణ కుమార్.
ఉత్తర్ ప్రదేశ్ కేడర్‌కు చెందిన 2002 బ్యాచ్ అధికారి అపర్ణ ఐటీబీపీలో డీఐజీగా పనిచేస్తున్నారు.
పోలీసు ఉద్యోగంలో చేరిన తర్వాతే పర్వతారోహణను ప్రారంభించారు.
గత సంవత్సరమే అపర్ణ ఐటీబీపీలో చేరారు.
దక్షిణ ధ్రువాన్ని చేరిన మొదటి మహిళా ఐపీఎస్ ఆఫీసర్ కూడా అపర్ణే.
ఈ సంవత్సరం జనవరి 13న దక్షిణ ధ్రువాన్ని చేరారు. ఏడుగురు సభ్యుల బృందంతో కలసి 8 రోజుల కఠిన ప్రయాణం తర్వాత ఆమె ఈ ఘనత సాధించారు.
దీనికోసం అపర్ణ మంచులో 111 కిలోమీటర్లు నడిచారు.
ఇక ఇప్పుడు ఆమె లక్ష్యం ఉత్తర ధ్రువాన్ని చేరడం.
నార్వేలోని ఓస్లో మీదుగా నార్త్ పోల్‌కు చేరాలనేది ఆమె ఆలోచన.
ఈ ప్రయాణం కూడా ఇప్పటికే మొదలైంది. ఏప్రిల్ 1న ప్రారంభమైన ఆమె ప్రయాణం 15తో ముగుస్తుంది.
6 ఖండాల్లోని ఎత్తైన పర్వతాలను ఆమె ఇప్పటికే అధిరోహించారు.
ఇవి కూడా చదవండి.
- భీమా కోరేగావ్ అల్లర్ల కేసు ఎక్కడిదాక వచ్చింది?
- రాజకీయ పార్టీల నుంచి ముస్లిం మహిళలు ఏం కోరుకుంటున్నారు...
- టీఆర్ఎస్, వైసీపీలు ఈసారి కింగ్ మేకర్ పాత్ర పోషిస్తాయా...
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదట ఎవరి పేరుతో రిజిస్టర్ అయింది?- బీబీసీ క్విజ్
- గే సెక్స్ చేస్తే ఆ దేశంలో శిక్ష ఏమిటో తెలుసా....
- ఆళ్లగడ్డలో నోట్లు వెదజల్లిన వైసీపీ నాయకుడు... హైదరాబాద్‌లో మురళీమోహన్ 'జయభేరి' నగదు రూ.2 కోట్లు స్వాధీనం
- రాహుల్ గాంధీ: మోదీని ఢీకొని ప్రధాని పదవి సాధించగలరా...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









