ఇందిరా గాంధీ అంత్యక్రియలు ముస్లిం ఆచారాల ప్రకారం చేశారా? : Fact Check

ఫొటో సోర్స్, NEWSPAPER IMAGE
ఇందిరాగాంధీ అంత్యక్రియలు ముస్లిం ఆచారాల ప్రకారం చేశారంటూ భారత మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ ఉన్న ఒక పాత ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫొటోలో రాజీవ్, రాహుల్ గాంధీ పక్కనే సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీతోపాటు కాంగ్రెస్ నేతలు పి.చిదంబరం, పీవీ నరసింహారావు కూడా కనిపిస్తున్నారు.
ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న వారు దానితోపాటు "ఇందిరా గాంధీ అంత్యక్రియలు జరిగినప్పుడు గాంధీ కుటుంబం ఇలా చేతులు జోడించి ప్రార్థించడం చూస్తుంటే, వారి అసలు మతం ఏదో స్పష్టంగా తెలుస్తోందని" రాస్తున్నారు.
రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా ఇందిరాగాంధీ కుటుంబం ఉన్న ఈ ఫొటోను ఇంతకు ముందు కూడా ఇదే చెబుతూ సోషల్ మీడియాలో షేర్ చేసినట్టు తెలిసింది. దీనిని కొన్ని వేల మంది ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.
అంతే కాదు, ఎన్నికలు దగ్గరపడుతుండడంతో దీనిని వాట్సాప్‌లో కూడా ఫార్వర్డ్ చేస్తున్నారు.
కానీ ఈ ఫొటోను పరిశీలించినప్పుడు వారు చెబుతున్నది పూర్తిగా అవాస్తవం అని మేం గుర్తించాం.

ఫొటో సోర్స్, SOCIAL MEDIA
ఫొటో గురించి అసలు నిజం
రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో ఈ ఫొటోను మొట్ట మొదట పాకిస్తాన్‌లోని పెషావర్‌లో ఉంటున్న రచయిత, రాజకీయ నేత మొహసిన్ దావర్ ట్వీట్ చేసినట్టు తెలిసింది.
మొహసిన్ చేసిన ట్వీట్ ఈ ఫొటోకు సంబంధించి అత్యంత పురాతన సోషల్ మీడియా పోస్ట్ అని తేలింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
మొహసిన్ తన ట్వీట్‌లో "రాజీవ్ గాంధీ ఉన్న ఈ ఫొటోను 'సరిహద్దు గాంధీ' అనే పేరు తెచ్చుకున్న స్వాతంత్ర సమర యోధుడు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ మృతదేహం తీసుకెళ్లే ముందు తీశారని చెప్పారు.
అబ్దుల్ గఫార్ ఖాన్‌ను 1988 జనవరి 21న పాకిస్తాన్‌లోని పెషావర్ నగరంలో ఖననం చేశారు.

ఫొటో సోర్స్, NEWSPAPER IMAGE
'Skyscrapercity' పేరుతో ఉన్న ఒక వెబ్‌సైట్ కూడా ఈ ఫొటో ఫ్రంటియర్ గాంధీ శవయాత్రకు ముందు పెషావర్‌లో తీశారని చెప్పింది.
రాజీవ్ గాంధీ తన క్యాబినెట్‌లోని కొందరు సభ్యులతో, తన కుటుంబ సభ్యులతో అబ్దుల్ గఫార్ ఖాన్ శవయాత్రలో పాల్గొన్నట్టు 'న్యూయార్క్ టైమ్స్', 'ఎల్ఏ టైమ్స్' లాంటి ఎన్నో విదేశీ మీడియా సంస్థల కథనాలు కూడా ధ్రువీకరించాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఇందిరా గాంధీ అంత్యక్రియలు
భారత మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీని 1984 అక్టోబర్ 31న ఆమె ఇద్దరు సెక్యూరిటీ గార్డులు కాల్చి చంపారు.
ఇందిరా గాంధీ అంత్యక్రియలను 1984 నవంబర్ 3న దిల్లీలో హిందూ ఆచారాల ప్రకారం నిర్వహించారు.
ఆమె అంత్యక్రియలకు సంబంధించిన చాలా వీడియోలు ప్రభుత్వ రికార్డుల్లో ఉన్నాయి. వీటిలో కొన్ని యూ-ట్యూబ్‌లో కూడా చూడవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ వీడియోల్లో మంత్రోచ్ఛారణల మధ్య రాజీవ్ గాంధీ తన తల్లి ఇందిరా గాంధీ చితికి ప్రదక్షిణ చేయడం, తర్వాత చితికి నిప్పు పెట్టడం కనిపిస్తోంది.
ఫొటో ఏజెన్సీ గెటీ దగ్గర కూడా ఇందిరా గాంధీ అంత్యక్రియలకు సంబంధించిన చాలా ఫొటోలు ఉన్నాయి.
ఇంటర్నెట్‌లో 1984 నవంబర్ 4న 'ద వాషింగ్టన్ టైమ్స్' ప్రచురించిన ఒక రిపోర్టు కూడా ఉంది. అందులో భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ అంత్యక్రియలు హిందూ ఆచారాల ప్రకారం ఎలా జరిగాయో వివరించారు.
ఇవి కూడా చదవండి:
- ఇళ్ల కొనుగోళ్లపై జీఎస్టీ తగ్గింపుతో ఎవరికి లాభం?
- ఏడీఆర్ సర్వే: చంద్రబాబు పాలనకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన రేటింగ్ ఎంత?
- పీఎస్ఎల్వీ-సీ45: ఎమిశాట్ ప్రయోగం విజయవంతం
- చంద్రశేఖర్ ఆజాద్: మీసం మెలేసి మోదీని సవాల్ చేస్తున్న ఈ దళిత నేత ఎవరు?
- తెలంగాణలో ఒక్క లోక్‌సభ స్థానానికి 480 మంది అభ్యర్థులు
- జాతీయ పార్టీ స్థాపించడానికి అర్హతలేమిటి... ఒక పార్టీకి జాతీయ హోదా ఎలా వస్తుంది...
- కాఫీ కనుమరుగైపోతుందా... చాక్లెట్ కూడా ఇక దొరకదా...
- సోనియా గాంధీ గౌను ఇందిర రక్తంతో తడిచిపోయింది..
- ఆ ఒక్క మాట... ఆనాడు నీలం సంజీవ రెడ్డిని రాష్ట్రపతి కాకుండా చేసింది
- ‘అవును నిజమే.. కేసీఆర్ బందరు పోర్టును చేజిక్కించుకోవాలని చూస్తున్నారు'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








