వైఎస్‌ వివేకానందరెడ్డిది హత్యే అని అనుమానిస్తున్న పోలీసులు, సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన జగన్

వైఎస్‌ వివేకానందరెడ్డి

ఫొటో సోర్స్, YSRCongress

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి(68) శుక్రవారం తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో కన్నుమూశారు.

గుండెపోటు వల్ల వివేకానందరెడ్డి పులివెందులలో మృతిచెందారని సాక్షి దినపత్రిక తెలిపింది. కానీ, మృతదేహం పడి ఉన్న స్థలాన్ని చూస్తే అది హత్యలాగా అనిపిస్తోందని పోలీసులు అనుమానిస్తున్నారు. వివేకానందరెడ్డి తలపైన, చేతులపైనా గాయాలున్నాయని కడప ఎస్పీ మీడియాకు తెలిపారు.

దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.

పోస్ట్‌ Facebook స్కిప్ చేయండి

కంటెంట్ అందుబాటులో లేదు

మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of Facebook ముగిసింది

వైఎస్‌ వివేకానందరెడ్డి 1950 ఆగస్టు 8న పులివెందులలో జన్మించారు.

వైఎస్సార్‌కు వివేకానందరెడ్డి చిన్న తమ్ముడు.

తిరుపతిలోని ఎస్వీ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీలో డిగ్రీ చదివారు.

వివేకానందరెడ్డి గతంలో మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పనిచేశారు.

1989,1994లలో పులివెందుల నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

1999, 2004 లలో కడప పార్లమెంట్‌ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.

2009లో ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టారు.

ఆయనకు భార్య సౌభాగ్య, కుమార్తె ఉన్నారు.

వైఎస్ జగన్మోహనరెడ్డి జగన్‌తో వైఎస్ వివేకా

ఫొటో సోర్స్, Y.S.Vivekananda.Reddy.MLC/facebook

అనుమానాస్పద మృతిగా కేసు నమోదు

వివేకానంద రెడ్డి మృతిపై ఆయన పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వివేకా తలకు, చేతికి గాయాలు అయ్యాయని, ఆయన రక్తపు మడుగులో.. బాత్‌రూమ్‌లో పడి ఉన్నారని కృష్ణారెడ్డి తెలిపారు.

దీంతో అనుమానాస్పద మృతిగా కేసు (నంబర్ 84/19) నమోదు చేశామని కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ వివరించారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించామని, నివేదిక వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

వైఎస్ జగన్మోహనరెడ్డి జగన్‌తో వైఎస్ వివేకా

ఫొటో సోర్స్, YSRCongress

వైఎస్‌ వివేకానందరెడ్డి

ఫొటో సోర్స్, Y.S.Vivekananda.Reddy.MLC/facebook

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)