INDvsAUS: భారత్ 281 ఆలౌట్... మూడో వన్డేలో ఆస్ట్రేలియా విజయం.. వన్డేల్లో విరాట్ కోహ్లీ 41వ సెంచరీ

విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం భారత వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ సొంతగడ్డ రాంచీ(ఝార్ఖండ్‌)లో జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా 32 పరుగుల తేడాతో గెలిచింది. తొలి రెండు వన్డేలను భారత జట్టు గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈనెల 10వ తేదీ ఆదివారం చండీగఢ్‌లో నాలుగో వన్డే జరుగనుంది.

314 పరుగులు విజయలక్ష్యంతో ఛేజింగ్ ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ ఔటయ్యారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ 95 బంతుల్లో 16 ఫోర్లు, ఒక సిక్స్‌తో 123 పరుగులు చేసి ఔటయ్యాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 41వ సెంచరీ.

48.2 ఓవర్లలో భారత జట్టు 281 పరుగులు చేసి, ఆలౌట్ అయ్యింది.

పదో వికెట్

48వ ఓవర్ రెండో బంతికి కుల్దీప్ యాదవ్ (16 బంతుల్లో ఒక ఫోర్‌తో 10 పరుగులు) ఔటయ్యాడు.

తొమ్మిదో వికెట్

47వ ఓవర్ ఐదో బంతికి మొహమ్మద్ షమీ (నాలుగు బంతుల్లో రెండు ఫోర్లతో 8 పరుగులు) ఔటయ్యాడు.

ఎనిమిదో వికెట్

47వ ఓవర్ మొదటి బంతికి రవీంద్ర జడేజా (31 బంతుల్లో ఒక సిక్స్‌తో 24 పరుగులు) ఔటయ్యాడు.

ఏడో వికెట్

42వ ఓవర్ ఆఖరి బంతికి విజయ్ శంకర్ (30 బంతుల్లో నాలుగు ఫోర్లతో 32పరుగులు) ఔటయ్యాడు.

ఆరో వికెట్

37వ ఓవర్ మూడో బంతికి విరాట్ కోహ్లీ (95 బంతుల్లో 16 ఫోర్లు, ఒక సిక్స్‌తో 123 పరుగులు) ఔటయ్యాడు.

ఐదో వికెట్

31వ ఓవర్ నాలుగో బంతికి కేదార్ జాదవ్ (39 బంతుల్లో మూడు ఫోర్లతో 26 పరుగులు) ఔటయ్యాడు.

నాలుగో వికెట్

19వ ఓవర్ మొదటి బంతికి ఎంఎస్ ధోనీ (42 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్‌తో 26 పరుగులు) ఔటయ్యాడు.

మూడో వికెట్

6వ ఓవర్ రెండో బంతికి అంబటి రాయుడు (8 బంతుల్లో 2 పరుగులు) ఔటయ్యాడు.

రెండో వికెట్

4వ ఓవర్ మూడో బంతికి రోహిత్ శర్మ (14 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్‌తో 14 పరుగులు) ఔటయ్యాడు.

భారత్ ఇన్సింగ్స్ - తొలి వికెట్

3వ ఓవర్ మూడో బంతికి శిఖర్ ధావన్ (పది బంతుల్లో ఒక పరుగు) ఔటయ్యాడు.

ఉస్మాన్ ఖవాజా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా వన్డేల్లో తొలిసారి సెంచరీ సాధించాడు

ఆస్ట్రేలియా 313/5

50 ఓవర్లలో ఆస్ట్రేలియా ఐదు వికెట్ల నష్టానికి 313 పరుగులు సాధించింది.

మార్కస్ స్టొయనిస్ 26 బంతుల్లో నాలుగు ఫోర్ల సహాయంతో 31 పరుగులు, అలెక్స్ కేరీ 17 బంతుల్లో మూడు ఫోర్లతో 21 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.

భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 10 ఓవర్లలో 64 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీయగా, మొహమ్మద్ షమీ 10 ఓవర్లలో 52 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు.

ఈ వన్డేలో రికార్డులు

  • ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా వన్డేల్లో తొలిసారి సెంచరీ (113 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్స్‌తో 104 పరుగులు) సాధించాడు.
  • ఆస్ట్రేలియా జట్టు వందోసారి 300లకు పైగా పరుగులు సాధించిన రెండో జట్టుగా రికార్డు సాధించింది. తొలి స్థానం భారత జట్టుదే. టీమిండియా ఇప్పటికే 105 సార్లు వన్డేల్లో 300లకు పైగా పరుగులు నమోదు చేసింది.

ఐదో వికెట్

43వ ఓవర్ నాలుగో బంతికి హ్యాడ్స్ కోంబ్ డకౌట్ అయ్యాడు.

నాలుగో వికెట్

43వ ఓవర్ రెండో బంతికి షాన్ మార్ష్ (12 బంతుల్లో ఏడు పరుగులు) ఔటయ్యాడు.

మూడో వికెట్

41వ ఓవర్ ఆరో బంతికి గ్లెన్ మ్యాక్స్‌వెల్ (31 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్స్‌లతో 47 పరుగులు) రనౌట్ అయ్యాడు.

రెండో వికెట్

38వ ఓవర్ మూడో బంతికి ఉస్మాన్ ఖవాజా (113 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్స్‌తో 104 పరుగులు) ఔటయ్యాడు.

మొదటి వికెట్

31వ ఓవర్ ఐదో బంతికి ఆరోన్ ఫించ్ (99 బంతుల్లో పది ఫోర్లు, మూడు సిక్స్‌లతో 93 పరుగులు) ఔటయ్యాడు.

కామఫ్లేజ్ టోపీలు

ఫొటో సోర్స్, Twitter/BCCI

ఫిబ్రవరి 14న జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో ప్రాణాలు కోల్పోయిన సీఆర్‌పీఎఫ్ జవాన్ల గౌరవార్థం, భారత జట్టు భద్రతా బలగాలు ధరించే 'కామఫ్లాజ్' టోపీలను ధరించింది.

హైదరాబాద్‌, నాగ్‌పూర్‌ మ్యాచ్‌లలో సాధించిన వరుస విజయాలతో టీమిండియా సమరోత్సాహంతో బరిలోకి దిగింది. ఈ రెండు మ్యాచుల్లోనూ ఆసీస్ మంచి పోటీ ఇచ్చింది. భారత్ రాంచీ మ్యాచ్ కూడా గెలిచి ఉంటే, రెండు మ్యాచులు మిగిలి ఉండగానే సిరీస్ సొంతమయ్యేది.

భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి టోపీని అందిస్తున్న ధోనీ

ఫొటో సోర్స్, Twitter/BCCI

ఫొటో క్యాప్షన్, భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి టోపీని అందిస్తున్న ధోనీ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)