కాగ్ రిపోర్ట్: మోదీ ప్రభుత్వం 2.86 శాతం తక్కువకే రఫేల్ విమానాలు కొనుగోలు చేసింది

రఫేల్

ఫొటో సోర్స్, Getty Images

రఫేల్ ఒప్పందంపై బుధవారం నాడు రాజ్యసభలో కాగ్ నివేదికను విడుదల చేశారు.

ఆ నివేదిక ప్రకారంమోదీ ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే 2.86శాతం తక్కువ మొత్తానికే రఫేల్ ఒప్పందం కుదుర్చుకుంది.

మీడియా రిపోర్టుల ప్రకారం గతంకంటే 9 శాతం తక్కవ ధరలకే ఒప్పందం చేసుకున్నట్లు మోదీ ప్రభుత్వం పేర్కొంది. కానీ, కాగ్ రిపోర్టు మాత్రం దాన్ని 2.86శాతంగానే పేర్కొంది.

ఈ నివేదికలో రఫేల్ విమానం ఖరీదును ప్రస్తావించలేదు. కానీ, పాత ఒప్పందంతో పోలిస్తే ప్రస్తుత ఒప్పందం కారణంగా 36 విమానాలు కొనుగోలు చేస్తే 17.08శాతం డబ్బులు ఆదా అయ్యాయి.

రాజ్యసభలో కాగ్ నివేదికను విడుదల చేశాక, భాజపా నేత అరుణ్ జైట్లీ దీన్ని 'నిజం సాధించిన విజయం'గా అభివర్ణించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

'సత్యమేవజయతే... 2007తో పోలిస్తే 2016లో తక్కువ ధరకే విమానాల కొనుగోలు జరిగింది. ఇవి త్వరలోనే అందుబాటులోకి వస్తాయి' అని ఆయన ట్వీట్ చేశారు.

'సుప్రీం కోర్టు తప్పు, కాగ్ నివేదిక తప్పు, కేవలం వంశవాదమే కరెక్టు కావడం జరగదు' అని కూడా ఆయన ట్వీట్ చేశారు.

కాగ్ నివేదిక ప్రకారం రఫేల్ విమానాలు గత ఒప్పందం కంటే ఒక నెల ముందుగానే, అంటే 71 నెలల్లోనే అందుబాటులోకి వస్తాయి.

వీడియో క్యాప్షన్, రఫేల్ డీల్ రాద్ధాంతం ఏంటి? ఎందుకు? ఎలా?

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)