Fact Check: లండన్‌లో భారత గణతంత్ర దినోత్సవం, వైరల్ వీడియో వెనుక అసలు నిజం

ఫొటో సోర్స్, youtube
- రచయిత, ఫ్యాక్ట్ చెక్ టీమ్
- హోదా, బీబీసీ న్యూస్
బ్రిటన్‌లోని లండన్ నగరంలో ట్రఫాల్గర్ స్క్వేర్ దగ్గర భారత 72వ గణతంత్ర దినోత్సవాలు ఘనంగా జరిగాయని చెబుతున్న ఒక విదేశీ వీడియో సోషల్ మీడియా, వాట్సాప్‌లో కనిపిస్తోంది.
ఈ వీడియోలో ఒక విదేశీ భవనం పైనుంచి భారత జెండా రంగులను వెదజల్లుతూ వెళ్లే కొన్ని ఫైటర్ విమానాలు మనకు కనిపిస్తాయి.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
కొన్ని జాతీయ వాద గ్రూపుల్లో ఈ వీడియోను పోస్ట్ చేసి "భారత్ బలోపేతం అవుతోంది. అందుకే ఒకప్పుడు మనపై పెత్తనం చెలాయించిన వాళ్లు కూడా మన కోసం ఇప్పుడు సంబరాలు జరుపుకుంటున్నారు. జై హింద్" అని షేర్ చేస్తున్నారు.
ఫేస్‌బుక్, ట్విటర్‌లో ఇంగ్లీషులో ఉన్న మెసేజ్‌తో ఈ వీడియోను పోస్ట్ చేస్తున్నారు. దీనిని వందల మంది చూశారు.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది
కొందరైతే భారత్ మీడియా కావాలనే ఈ వీడియోను స్థానికులకు చూపించలేదని ఆరోపించారు.
ఈ మాటలను నిజమేమో అని భావించిన మేం లండన్‌లో భారత గణతంత్ర దినోత్సవాల కోసం ఆన్ లైన్లో వెతికాం. కానీ ఎలాంటి వివరాలూ లభించలేదు.
అయితే, పీటీఐ ఆధారంగా గల్ఫ్ న్యూస్‌లో ప్రచురించిన ఒక వార్త మాత్రం కచ్చితంగా కనిపించింది. 72వ గణతంత్ర దినోత్సవం రోజున భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి, మిగతా సభ్యులతో కలిసి లండన్‌లో మువ్వన్నెల జెండాను ఎగరేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఆ ఫొటోలను క్రికెటర్ రవీంద్ర జడేజా, కులదీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
కానీ లండన్‌లో ఇలా విమానాలు ఆకాశంలో భారీ స్థాయిలో మూడు రంగులు వెదజల్లినట్టు మాత్రం ఎలాంటి వివరాలూ లభించలేదు.
వీడియో పరిశోధన
మా పరిశీలనలో ఈ వైరల్ వీడియో లండన్‌లో తీసింది కాదని తేలింది.
ఫ్రేమ్ బై ఫ్రేమ్ చూసిన తర్వాత ఈ వీడియోలో మేం ఒకటి గమనించాం. విమానాలు ఏ భవనం పైనుంచి ఎగిరాయో దానిపై ఇటలీ జెండాలు ఉన్నాయి.
ఆ తర్వాత ఇటలీలోని ప్రభుత్వ భవనాల ఫొటోలను గమనించినప్పుడు, వీడియోలో ఉన్న ఆ భవనం ఆ దేశ రాజధాని రోమ్‌లో ఉన్న 'ఆల్టర్ ఆఫ్ ద ఫాదర్లాండ్' అని తెలిసింది.

ఫొటో సోర్స్, Getty Images
పశ్చిమ రోమ్‌లో ఉన్న ఈ భవనం ఇటలీలోని అతిపెద్ద స్మారకాల్లో ఒకటి. దీనిని ఇటలీ ఏకీకరణ తర్వాత మొదటి రాజు విక్టర్ ఇమాన్యుయెల్ 2కు గుర్తుగా నిర్మించారు.
1911లో ఈ భవనంలోకి సాధారణ ప్రజలను కూడా అనుమతించారు. దీనిని స్థానికులు 'ఇటలీ యుద్ధ మ్యూజియం'గా కూడా చెబుతారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రతి ఏటా జూన్ 2న ఇటలీ రిపబ్లిక్ డే సందర్భంగా ఈ యుద్ధ మ్యూజియం దగ్గర సైనిక ప్రదర్శన జరుగుతుంది. యుద్ధ విమానాలు ఆకాశంలో ఇటలీ జెండా రంగులు( ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ) వెదజల్లుతూ దూసుకెళ్తాయి.
ఇటలీలోని స్థానిక న్యూస్ సైట్స్ లో కూడా వైరల్ వీడియోను పోలిన ఎన్నో వీడియోలు పోస్ట్ చేసి ఉన్నాయి.
భారత్‌లోనే కాదు, కొన్ని విదేశీ సోషల్ మీడియా పేజీల్లో కూడా కొన్ని నెలల క్రితం దీనిని భారత వైమానిక దళ ప్రదర్శన అని షేర్ చేసారు. కానీ భారత స్వతంత్ర దినోత్సవానికి, లండన్, భారతీయ వైమానిక దళానికి ఈ వీడియోకు ఎలాంటి సంబంధం లేదు.
ఇవి కూడా చదవండి:
- శృంగారం వల్ల శరీరంలో చేరి ప్రాణాంతకంగా మారే 4 రకాల బ్యాక్టీరియాలు మీకు తెలుసా?
- మోదీ హయాంలో గంగానది నిజంగానే శుభ్రమైందా
- ఐఎన్ఎఫ్ ఒప్పందానికి గుడ్ బై చెప్పిన అమెరికా... సరికొత్త క్షిపణులు చేస్తామన్న రష్యా
- హైదరాబాద్: ప్రేమించలేదని కాలేజీకి బయల్దేరిన అమ్మాయిని కత్తితో నరికేసిన యువకుడు
- చంద్రబాబు అయిదేళ్లలో మూడు సినిమాలు చూపించారు
- ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు
- ఆస్ట్రేలియా గనిలో అద్భుతం: రెండు రాళ్లలో 100 కిలోలకుపైగా బంగారం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








