ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019 : ఎప్పుడు జరుగుతాయి?

తెలంగాణలో ఎన్నికలు ముగిశాయి, కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఇక ఇప్పుడు అందరూ ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలు ఎప్పుడా అనే ఎదురుచూస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ కూడా ఈ దిశగా చర్యలు ప్రారంభించింది.
లోక్ సభతోపాటు ఆంధ్ర ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిషా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి.
2014లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 9 దశల్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో 7, 8 దశల్లో తెలంగాణ ప్రాంతంలో 2014 ఏప్రిల్ 30న, రాయలసీమ, కోస్తాంధ్ర (ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్) ప్రాంతాల్లో 2014 మే 7న ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలు మే 16న వెలువడ్డాయి. 175 స్థానాలున్న ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ 102 సీట్లు గెల్చుకోగా వైఎస్ఆర్‌సీపీ 67 సీట్లకు పరిమితమైంది. బీజేపీ 4, ఇతరులు 2 స్థానాల్లో గెలుపొందారు.
జూన్ 8న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రోజు నుంచే కొత్త రాష్ట్రం తన కార్యకలాపాలను ప్రారంభిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

ఫొటో సోర్స్, Getty Images
సాంకేతికంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తుత అసెంబ్లీ పదవీ కాలం జూన్ 18తో ముగుస్తోంది. అంటే ఆ లోపే ఎన్నికల ప్రక్రియ ముగిసి, కొత్త ప్రభుత్వం ఏర్పడాలి.
మరోవైపు లోక్ సభ పదవీకాలం జూన్ 3తో పూర్తవుతోంది. ఈలోపే కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుతీరాలి. గతంలో జరిగిన ఎన్నికలను దృష్టిలో ఉంచుకుంటే, ఈసారి కూడా లోక్‌సభ ఎన్నికలతోపాటే ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీకి కూడా ఏకకాలంలో ఎన్నికలు జరిగేందుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
అంటే, మే నెల నాలుగో వారంలోపే ఎన్నికల ఫలితాలు కూడా వెల్లడయ్యే అవకాశం ఉంది.
సాధారణ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. అధికారుల బదిలీలు, ఓటర్ల జాబితాల సవరణ, కొత్త ఓటర్ల నమోదు, ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఇతర ఏర్పాట్లు వంటి పనులను పూర్తి చేస్తోంది.
ఫిబ్రవరి నెలాఖర్లో లేదా మార్చి మొదటి వారంలో లోక్ సభ ఎన్నికలతోపాటు ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కూడా షెడ్యూలు విడుదల కావచ్చు.
ఇవి కూడా చదవండి:
- ఓటరు జాబితాలో మీ పేరు నమోదు చేసుకోవడం ఎలా?
- రష్యా మంత్రి బంపర్ ప్రైజ్: సరైన సమాధానం చెబితే 2.5 ఎకరాల భూమి ఫ్రీ
- సోషల్ మీడియా: మీకు లాభమా? నష్టమా?
- #fallingstarschallenge: చైనా యువతీ, యువకులు ఎందుకిలా పడిపోతున్నారంటే..
- హైదరాబాద్లో శాకాహారులు ఎంత మంది? మాంసాహారులు ఎంత మంది?
- అరటిపండు తింటే హ్యాంగోవర్ దిగిపోతుందా
- ట్రంప్ ఏం తింటారు? వాటి అర్థం ఏంటి?
- ఇన్స్టాగ్రామ్తో డబ్బులు సంపాదించడం ఎలా?
- ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చిన్నారుల అమ్మకం
- సౌదీ: ‘నా చేత బలవంతంగా ప్రార్థనలు చేయించేవాళ్లు. రంజాన్లో ఉపవాసం ఉంచేవాళ్లు’
- ఇన్‌స్టాగ్రామ్ ఫొటోల్లో భారత రైలు ప్రయాణం
- ఇన్‌స్టాగ్రామ్: నకిలీ కామెంట్లు, నకిలీ లైక్లు ఇక కుదరవు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








