Fact Check: మోదీ హయాంలో గంగానది నిజంగానే శుభ్రమైందా

గంగా నది

ఫొటో సోర్స్, Facebook/BJP for 2019 - Modi Mattomme

    • రచయిత, ఫ్యాక్ట్ చెక్ బృందం
    • హోదా, బీబీసీ న్యూస్

గంగా ప్రక్షాళన చేయడంలో భారతీయ జనతా పార్టీ కొత్త రికార్డులు సృష్టించిందంటూ దక్షిణ భారత దేశంలోని చాలా సోషల్ మీడియా గ్రూపుల్లో కొన్ని ఫొటోలు విస్తృతంగా షేర్ అయ్యాయి.

ఐదేళ్ల క్రితం గంగ ఎలా ఉంది, పదేళ్ల క్రితం గంగ ఎలా ఉంది, ఇప్పుడెలా ఉందో చూడండి అంటూ #5YearChallenge, #10YearChallenge హ్యాష్ ట్యాగ్‌లతో ఇవి ప్రచారంలోకి వచ్చాయి. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం గంగానదిని గణనీయంగా శుద్ధిచేసిందని, ఇప్పుడు నదిలో పరిస్థితి మెరుగుపడిందంటూ ఆ గ్రూపుల్లో పేర్కొన్నారు.

బీజేపీ తమిళనాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వానతి శ్రీనివాసన్ కూడా ఈ ఫొటోలను ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం (2014)లో గంగకు, బీజేపీ ప్రభుత్వం (2019)లో గంగకు మార్పును చూడండి అని ఆమె తన ట్వీట్‌లో రాశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

మరికొందరు దక్షిణాది బీజేపీ నేతలు కూడా వీటిని షేర్ చేసుకున్నారు. 'ది ఫోర్టిపైడ్ ఇండియన్', 'రైట్ లాగ్ డాట్ ఇన్' వంటి కొన్ని మితవాద గ్రూపులు కూడా వీటిని పంచుకున్నాయి. ఇక వేలాది మంది ప్రజలు కూడా తమ అకౌంట్లలో ఈ గంగ ఫొటోలను షేర్ పోస్ట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ఫేస్‌బుక్‌లో కర్నాటకకు చెందిన "BJP for 2019 - Modi Mattomme" అనే ఓ సంస్థ గతవారంలో ఈ ఫొటోలను మొదటిసారిగా షేర్ చేసింది.

'మోదీ ప్రభుత్వం మళ్లీ కావాలనుకోవడానికి ఈ మార్పులు చాలవా!' అని ఆ ఫొటోల కింద రాసింది.

మా పరిశీలనలో తేలిందేంటంటే... ఈ ఫొటోలు నిజమే. కానీ అవి 2009లోను, 2019లోనూ తీసిన చిత్రాలు కావు.

గంగా నది

ఫొటో సోర్స్, JITENDER GUPTA/OUTLOOK

మొదటి చిత్రం

2009 నాటి చిత్రంగా చెబుతున్న ఈ చిత్రం ఔట్‌లుక్ మేగజీన్‌లో 2015-18 మధ్య కాలంలో ఎన్నోసార్లు 'ఫైల్ ఫొటో'గా ప్రచురించారు.

ఔట్‌లుక్ మేగజీన్ ఫొటో ఎడిటర్ జితేంద్ర గుప్తాను మేం సంప్రదించాం.

"గంగానది పరిస్థితిపై ఓ ఫొటో స్టోరీ కోసం 2011లో వారణాసి వెళ్లాను. అప్పుడు తీసిన ఫొటో ఇది. ఆ తర్వాత కూడా దీన్ని చాలాసార్లు ఉపయోగించాం" అని ఆయన తెలిపారు.

2011లో కేంద్రంలో కాంగ్రెస్, ఉత్తర్ ప్రదేశ్‌లో బీఎస్పీ అధికారంలో ఉన్నాయి.

గంగా నది, అహల్యా ఘాట్

ఫొటో సోర్స్, KEN WIELAND/FLICKR

రెండో చిత్రం

2019లో గంగానది ఇలా మారిపోయింది అంటూ బీజేపీ మద్దతుదారులు ఈ చిత్రాన్ని షేర్ చేస్తున్నారు. అయితే ఈ ఫొటో వికీపీడియా నుంచి తీసుకున్నది.

వికీపీడియాలో ఉత్తర యూరప్‌కు చెందిన ఓ పేజీలో వారణాసి గురించి వివరిస్తూ ఈ ఫొటో ఉపయోగించారు. కెన్ వీలాండ్ అనే ఓ అమెరికన్ ఫొటోగ్రాఫర్‌కు దీని క్రెడిట్ ఇచ్చారు. ఆయన దాన్ని ఫ్లికర్ కోసం తీశారు.

వారణాసిలో 'అహల్యా ఘాట్'కు సంబంధించిన ఈ ఫొటోను 2009లో తీశారు. 2009లో కేంద్రంలో కాంగ్రెస్, ఉత్తర్ ప్రదేశ్‌లో మాయావతి అధికారంలో ఉన్నారు.

అయితే బీజేపీ మద్దతుదారులు చెబుతున్న ఈ రెండు ఫొటోలూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తీసినవే.

గంగా నది

ఫొటో సోర్స్, ROHIT GHOSH/BBC

గంగ అసలు పరిస్థితేంటి?

గంగ ప్రక్షాళనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమాత్రం చాలవు అంటూ గంగ ప్రక్షాళనను సమీక్షించేందుకు ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ గత సంవత్సరం తన నివేదికలో పేర్కొంది.

జాతీయ హరిత ట్రిబ్యునల్ కూడా ఈ విషయంలో ప్రభుత్వాన్ని తప్పుపట్టింది.

గంగానదిని ప్రక్షాళన చేసి, నదిలో జీవాన్ని నింపాలంటూ పర్యావరణవేత్త, ప్రొఫసెర్ జీడీ అగర్వాల్ అలియాస్ స్వామి జ్ఞాన్ స్వరూప్ గత సంవత్సరంలో 112 రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు.

గంగా నది

ఫొటో సోర్స్, Twitter/@VanathiBJP

గంగా ప్రక్షాళన చేస్తామంటూ 2014లో మోదీ వారణాసిలో ప్రకటించారు. "నా అంతట నేనుగా ఇక్కడకు రాలేదు, నన్ను ఎవరూ ఇక్కడకు తీసుకురాలేదు, గంగామాతే నన్ను ఇక్కడకు పిలిచింది" అంటూ గంగకు వంగి నమస్కరిస్తూ మోదీ వ్యాఖ్యానించారు.

అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం మోదీ ప్రభుత్వం గంగా ప్రక్షాళనకు కొన్ని గణనీయమైన చర్యలు చేపట్టింది. గంగా పరిరక్షణ శాఖను ఏర్పాటుచేసింది.

2014-18 మధ్య కాలంలో రూ.3867 కోట్లకు పైగా నిధులను గంగా ప్రక్షాళనకు వినియోగించామని జలవనరులు, నదుల అభివృద్ధి, గంగా పరిరక్షణ శాఖ సహాయమంత్రి డాక్టర్ సత్యపాల్ సింగ్ 2018 జులైలో రాజ్యసభకు తెలిపారు.

కానీ, గంగ ప్రక్షాళన ఎంతవరకూ జరిగిందో లెక్కించేందుకు మోదీ ప్రభుత్వం దగ్గర సరైన సమాచారం లేదని 2018లో ఓ ఆర్టీఐ దరఖాస్తుకు సమాధానంగా ప్రభుత్వం తెలిపింది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)