ఆరోగ్యం: ఈ వీడియోలు చూస్తే ఉల్లాసం... ఈ శబ్దాలు వింటే సంతోషం

ఏఎస్ఎంఆర్ పేరుతో వస్తున్న వీడియోలు ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండ్‌గా మారుతున్నాయి. దువ్వెనతో జట్టుదువ్వుకోవడం, టవల్‌ను మడతపెట్టడం ఇలాంటి శబ్దాలు ఉండే వీడియోలను చూస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని అధ్యయనాలు చెపుతున్నాయి.
అటానమస్ సెన్సరీ మెరీడియన్ రెస్పాన్స్‌కు సంక్షిప్త రూపమే ఏఎస్ఎంఆర్. ఇలాంటి వీడియోలు ఆన్‌లైన్‌లో లక్షల్లో కనిపిస్తున్నాయి. ఈ వీడియోలు కుంగుబాటు, ఒత్తడి తగ్గించడంలో సహాయ పడుతాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
యూట్యూబ్‌లో ఇలాంటి వీడియోల సంఖ్య దాదాపు 13 లక్షలకు పైగా ఉన్నాయి. ఇలాంటి వీడియోలను యూట్యూబ్‌లో పెట్టే జెంట్లీ విస్పరింగ్ ట్యూట్ చానెల్‌కు దాదాపు 13 లక్షల మంది సబ్‌స్రైబర్స్ ఉన్నారు.
ఇంతకీ ఏఎస్ఎంఆర్ అంటే?
అమెరికాకు చెందిన జెన్నిఫెర్ అలెన్ తొలిసారిగా ఈ పదాన్ని వాడారు. ఇదే పేరుతో ఆయన 2010లో ఓ ఫేస్‌బుక్ గ్రూప్ క్రియేట్ చేశారు.
నిర్దిష్ట దృశ్యాలు చూసినప్పుడు, శబ్దాలను విన్నప్పుడు మనిషిలో వచ్చే ప్రతిస్పందనలను ఏఎస్ఎంఆర్‌గా పిలుస్తారు.
యూట్యూబ్‌లో దాదాపు 13 లక్షలకు పైగా ఇలాంటి వీడియోలున్నాయి.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









