విరాట్ కోహ్లీ: 'మీకు విదేశీ ఆటగాళ్లు ఇష్టమైతే భారత్‌లో ఉండకండి'

విరాట్ కోహ్లీ జవాబు

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వీడియో ఒకటి సోషల్ మీడియోలో వైరల్ అవుతోంది. అందులో "విదేశీ బ్యాట్స్‌మెన్లంటే ఇష్టపడే వాళ్లు, భారత్‌లో ఉండకూడదు" కోహ్లీ అన్నట్లుగా ఉంది.

విరాట్ కోహ్లీ ఉన్న ఈ వీడియోను అతడి పుట్టినరోజున ప్రారంభించిన మొబైల్ యాప్‌లో అప్‌లోడ్ చేశారు. ఇందులో ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన సందేశాలను కోహ్లీ చదువుతుంటాడు.

అందులో ఒక యూజర్ కోహ్లీని 'ఓవర్ రేటెడ్ ఆటగాడు' అన్నారు.

"మీరు ఓవర్ రేటెడ్ ఆటగాడు. వ్యక్తిగతంగా నాకు నీ బ్యాటింగ్‌లో ఎలాంటి ప్రత్యేకత కనిపించడం లేదు. నాకు భారతీయ బ్యాట్స్‌మెన్ల కంటే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లే నచ్చుతారు" అని ఆ యూజర్ అన్నాడు.

విరాట్ కోహ్లీ జవాబు

ఫొటో సోర్స్, PA

ఘాటుగా జవాబు

దానికి విరాట్ 'మీరు భారత్‌లో ఉండకూడదని నాకు అనిపిస్తోంది. వేరే ఎక్కడికైనా వెళ్లి ఉండాలి' అని సమాధానం ఇచ్చాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

యూజర్ కామెంట్‌కు స్పందించిన విరాట్ కోహ్లీ "మీరు భారత దేశంలో ఉంటూ వేరే దేశాల ఆటగాళ్లను ఎందుకు ఇష్టపడుతున్నారు? మీకు నేను ఇష్టం లేకపోయినా పర్వాలేదు. కానీ మీరు మన దేశంలో ఉంటూ వేరే దేశంలో ఉన్న వారిని ఇష్టపడాలని అనుకోవడంలేదు. మీ ప్రాధాన్యతలు నిర్ణయించుకోండి" అన్నాడు.

విమర్శల వెల్లువ

కోహ్లీ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వస్తోంది. కోహ్లీపై విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

అష్రఫ్ అనే ఒక ట్విటర్ యూజర్ "విరాట్ కోహ్లీ విదేశీ ఆటగాళ్లను ఇష్టపడేవాళ్లు భారత్‌లో ఉండకూడదు అంటున్నారు. కానీ ఆయన ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. విదేశీ బ్రాండ్స్‌కు ప్రచారం చేస్తున్నారు" అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

"విరాట్ కోహ్లీ తాజా వ్యాఖ్య క్రీడా స్ఫూర్తికి విరుద్ధం. ఆటగాళ్లను వారి దేశం చూసి కాదు, వాళ్ల ప్రతిభ చూసి ప్రశంసిస్తారు" అని మరో ట్విటర్ యూజర్ సిద్దార్థ్ విషీ అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

ఇటు ఐరనీ ఆఫ్ ఇండియా పేరుతో ఉన్న ట్విటర్ హాండిల్‌లో కోహ్లీ పదేళ్ల క్రితం మాట్లాడిన ఒక వీడియో షేర్ చేశారు. అందులో అతడు తన ఫేవరెట్ ఆటగాడు 'హర్ష్‌లే గిబ్స్' అని చెప్పాడు. "అయితే విరాట్ కోహ్లీ కూడా భారత్ వదిలి వెళ్లిపోవాలని" ఆ యూజర్ ట్వీట్ చేశాడు.

ఇది కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)