గృహరుణం తీసుకోవాలనుకుంటున్నారా? అయితే తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివి

ఫొటో సోర్స్, Getty Images
ఎవరికైనా గృహమే కదా స్వర్గసీమ. మరి ఆ కల నిజమై మీరో ఇంటివారు కావాలంటే మాత్రం చాలానే కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్. ఇల్లు కొనడం ఎందుకంత ఖరీదైన వ్యవహారం? అసలీ పరిస్థితి మారుతుందా? తెలుసుకుందాం.. ఈ వారం లబ్ డబ్బులో
1990వ దశకం చాలా మార్పులు తీసుకొచ్చింది. స్వేచ్ఛా వాణిజ్య యుగం మొదలవడంతోనే ప్రైవేటు రియల్ ఎస్టేట్ డెవలపర్లు మార్కెట్లోకి వాలిపోయారు. రియాల్టీ ప్రాజెక్టులు ఇబ్బడిముబ్బడిగా పుట్టుకొచ్చాయి.
అవసరమైన అనుమతులు లేకుండానే ప్రాజెక్టులు ప్రారంభించారు. అయితే 2013-14 నాటికల్లా రియాల్టీ రంగం కుదేలైంది.
2016లో ప్రకటించిన నోట్ల రద్దు, ఆ తర్వాత జీఎస్టీ.. రియాల్టీ రంగంలో కాస్తో కూస్తో మిగిలున్న ఆశలను ఆవిరి చేశాయి. రియల్ ఎస్టేట్ కోసం ఓ సంస్థను కూడా ఏర్పాటు చేశారు. చాలా రాష్ట్రాల్లో RERA ను ఏర్పాటు చేశారు. Real Estate Regulatory Authority (RERA) అన్నమాట. ఈ బిల్లును యూపీఏ-2 ప్రభుత్వం 2013లో ప్రవేశపెట్టింది.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, ప్రస్తుతం ఈ రంగం సంస్కరణల ప్రక్రియ గుండా సాగుతోందని నిపుణులు భావిస్తున్నారు.
అందుకే కొన్ని ఇబ్బందులు, సవాళ్లు ఉన్నాయి.
అయితే, పెరుగుతున్న పెట్రోల్-డీజిల్ ధరలతో నిత్యావసర వస్తువుల రేట్లు మండిపోయే అవకాశాలున్నాయి.
మరోవైపు రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్ల పెంపును ప్రారంభించింది. అంటే, ఇప్పుడు గృహరుణాలు ప్రియం కానున్నాయన్న మాట.
ఇల్లు కొనాలంటే ముందు మనకొచ్చే ఆలోచన గృహరుణం.

ఫొటో సోర్స్, Getty Images
మీరు గృహరుణం తీసుకోవాలనుకుంటే కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోండి.
బిల్డర్ నమ్మకమైన వారేనా , దస్తావేజులన్నీ సరైనవేనా అనేది ఒకటికి రెండుసార్లు చూసుకోండి.
సాధారణంగా డౌన్ పేమెంట్ ప్రాపర్టీ మొత్తం విలువలో దాదాపు 20 శాతం ఉంటుంది.
గృహ రుణాలిచ్చే బ్యాంకులు ఎన్నో అర్హతలను పరిగణనలోకి తీసుకుంటాయి. మీ రుణ చరిత్ర ఏంటి, మీకు అప్పుల్ని సకాలంలో చెల్లించే అలవాటుందా, లేదా అని కూడా పరిశీలిస్తాయి.
వడ్డీ రేట్లను కూడా పరిశీలించండది. వడ్డీ రేటు ఎంత తక్కువైతే.. మీరు చెల్లించే నెలసరి వాయిదా కూడా అంత తక్కువగా ఉంటుంది.
బ్యాంకులిచ్చే గృహ రుణాల్లో.. స్థిర వడ్డీ రేట్లు, ఫ్లోటింగ్ వడ్డీ రేట్లు అని రెండు రకాలుంటాయి.
స్థిర వడ్డీ రేట్లు అంటే వడ్డీ రేటులో ఎలాంటి మార్పూ ఉండదన్న మాట.
ఇక ఫ్లోటింగ్ వడ్డీ రేట్లు అంటే బ్యాంకు రుణ విధానాలలో వచ్చే మార్పుల ప్రకారం పెరగొచ్చు.. తరగొచ్చు.
ముందుగా మీరు చెల్లించగలిగే ఈఎంఐ ఎంతో నిర్ణయించుకోండి. అది మీ ఆదాయంలో 20 నుంచి 30 శాతానికి మించకుండా ఉంటే మంచిది.
రుణ మొత్తాన్ని కవర్ చేసేందుకు ఏదైనా బీమా కూడా తీసుకోండి.
ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నాకే ఓ ఇంటికి యజమాని అవ్వండి. అంతే కాని.. రియల్ మోసాల బారిన పడి తప్పులో కాలేయకండి.
ఇవి కూడా చూడండి
ఇవి కూడా చదవండి:
- సన్నీ లియోని ఇంటర్వ్యూ: 'రోడ్డు మీద నుంచున్న వేశ్యకు - పోర్న్ స్టార్‌కి తేడా ఏమిటి?'
- నాబార్డ్ రిపోర్ట్: వ్యవసాయ ఆదాయంలో దిగజారిన ఆంధ్రప్రదేశ్, జాతీయ సగటు కన్నా కాస్త మెరుగ్గా తెలంగాణ
- భారత్ సున్నాను ఎలా ఆవిష్కరించింది?
- ‘ఇండియాలోని భారతీయులకంటే బ్రిటన్‌లోని భారతీయులే సంప్రదాయబద్ధంగా జీవిస్తున్నారు’
- ఇలాగైతే.. లండన్‌లో తెలుగోళ్లకు ఇల్లు కష్టమే!
- భారత్‌లో దొరకని భారతీయ వంటకం!
- మనం ఖర్చు చేసే విధానాన్ని క్రెడిట్ కార్డులు ఇలా మార్చేశాయి
- పవన్ కల్యాణ్‌కు ఫిన్లాండ్ విద్యా విధానం ఎందుకంతగా నచ్చింది?
- సహారా ఎడారి వెంట ప్రహరీ కట్టండి.. స్పెయిన్‌కు డోనల్డ్ ట్రంప్ సలహా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











