విదర్భ వెతలు: ‘పంట చేతికందలేదని నా బిడ్డ ప్రాణం తీసుకుంది’

గత కొన్ని దశాబ్దాలుగా మహారాష్ట్రలో ఎందరో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. విదర్భలోని యావత్మాల్ జిల్లా రైతు ఆత్మహత్యలకు ప్రధాన కేంద్రంగా మారింది.
ఇక్కడ ఎన్నో కుటుంబాలు అప్పులు తీర్చలేక బలవణ్మరణాలకు పాల్పడ్డాయి. ఓ కుటుంబంలోనైతే అప్పుల బాధ భరించలేక అక్కాచెల్లెళ్లిద్దరూ బలవన్మరణాలకు పాల్పడ్డారు.
విదర్భలో రహదారులు అందంగా కనిపిస్తున్నాయి.. కానీ, అక్కడి ప్రజల్లో మాత్రం నిరాశ నిస్పృహలే కనిపిస్తున్నాయి. అమరావతి జిల్లా, షెండుర్జానా బజార్ గ్రామంలోని ఓ కుటుంబం ఇద్దరి కుమార్తెలను పోగొట్టుకుంది. అప్పుల బాధతో అక్కాచెల్లెళ్లిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి కారణం పండించిన పంట చేతికందక పోవడం, అప్పుల బాధ పెరగడం.
ఇద్దరు బిడ్డలను కోల్పోయిన విదర్భ రైతు భాస్కర్ అసోడ్ ‘బీబీసీ’తో మాట్లాడుతూ, పంటలు సరిగ్గా పండక అప్పుల పాలైన విషయం మా అమ్మాయిలకు తెలుసు. నేను పడుతున్న కష్టం తెలుసు, పెళ్లి చేసే స్తోమత లేదని తెలుసు. నాకు భారంగా ఉండలేక ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు అని బీబీసీకి చెప్పారు.
పెద్ద కూతురును కొడుకులా చూసేవాడినని, ఆమె కూడా పొలం పని చేసేదని చెప్పారు.

‘ప్రభుత్వం సాయం చేసుకుంటే చిన్న బిడ్డ బతికేది’
వాస్తవానికి భాస్కర్ అసోడ్.. కౌలు రైతు. యజమానికి ఏడాదికి 20-30 వేల రూపాయల కౌలు కట్టాల్సి ఉంటుంది. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ఖర్చు అదనపు భారం. పెద్ద కూతురికి పెళ్లి చేయాలనుకున్న సమయంలో పంట చేతికి రాలేదు. అంతకు ముందు పత్తి, వేరుసెనగ వేసి రూ. 90 వేల రూపాయలు బాకీ పడ్డారు.
‘‘పంటలు సరిగ్గా పండక అప్పుల పాలైన విషయం మా అమ్మాయిలకు తెలుసు. పెళ్లి చేసే స్తోమత మాకు లేదనే విషయం కూడా తెలుసు. అందుకే ఆ నిర్ణయం తీసుకుని ఉంటుంది’’ అని చెప్పారు.
భాస్కర్ అసోడ్ పెద్ద కూతురు విషం తాగి చనిపోయింది. చిన్న బిడ్డ కూడా అదే పని చేసింది.
‘‘ప్రభుత్వం నాకు సరైన సమయంలో సాయం చేసి ఉంటే నా చిన్న కూతురినైనా అయినా కాపాడుకునే వాణ్ని’’. అని భాస్కర్ బీబీసీకి తెలిపారు.

యవత్మాల్ జిల్లా పిప్రీ బత్తి గ్రామం పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇక్కడ ఒక్క గ్రామంలోనే 40 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల వల్ల మోహన్ తన తల్లిదండ్రులను కోల్పోయాడు.
‘‘2015లో ముఖ్యమంత్రి మా ఊరికి వచ్చారు. మా పరిస్థితి చూసి ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని మాట ఇచ్చారు. ఆయన మా ఇంటికి కూడా వచ్చారు. నా పరిస్థితి చాలా దారుణంగా ఉందంటూ నాకు తప్పకుండా సాయం చేస్తామని చెప్పారు. ఆ తరువాత మళ్లీ ముఖ్యమంత్రి ఇటు రాలేదు. ఆయనను కలవాలని ఎన్నోసార్లు ప్రయత్నించినా సాధ్యం కాలేదు.’’ అని ప్రహ్లాద్ అన్నారు.
యావత్మాల్ జిల్లా, వాగ్ధా గ్రామానికి చెందిన రేణుక కూడా అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు. ఆ కుటుంబంలో సంపాదించేది ఆమె ఒక్కరే.
ఇవి కూడా చదవండి
- సన్నీ లియోని ఇంటర్వ్యూ: 'రోడ్డు మీద నుంచున్న వేశ్యకు - పోర్న్ స్టార్‌కి తేడా ఏమిటి?'
- మీ గర్ల్ ఫ్రెండ్‌కు సారీ ఎలా చెబుతారు?
- తదుపరి ‘యాపిల్’ ఏది? భవిష్యత్తు నంబర్ వన్ కంపెనీ ఇప్పుడు ఎక్కడుంది?
- డైమండ్ నగరంలో 'గోల్డెన్ స్వీట్' - మరి రుచి చూస్తారా?
- ఆస్ట్రేలియా: పెట్రోలు అయిపోతోందా? అయిపోతే బండి నడిచేదెలా?
- ప్లాస్టిక్‌పై నిషేధం: ఆస్ట్రేలియాలో ఆగ్రహం
- పీవీ సింధు: ఆదాయంలో క్రికెట్ స్టార్లను వెనక్కు నెట్టిన బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి
- ఆసియా క్రీడలు: దీక్షా డాగర్.. అద్భుతమైన షాట్స్ కొట్టినా అభిమానుల చప్పట్లేమీ ఆమెకు వినపడవు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








