#MeTooUrbanNaxal: ‘అధికారాన్ని, వ్యవస్థను ప్రశ్నించేవారంతా అర్బన్ నక్సలైట్లైతే నేనూ అర్బన్ నక్సల్‌నే’

ఫొటో సోర్స్, TWITTER
వరవరరావు తదితర హక్కుల ఉద్యమ నేతల ఇళ్లపై పోలీసుల దాడులు, సోదాలు, అరెస్టులతో దేశం మొత్తం ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. దేశవ్యాప్తంగా కొన్ని నగరాల్లో ఒకేసారి చేపట్టిన ఈ ఆపరేషన్‌పై సోషల్ మీడియాలో సైతం యూజర్లు చాలా నిశితంగా స్పందించారు.
ప్రభుత్వ అనుకూల భావాలున్న వారంతా ఈ అరెస్టులను సమర్ధిస్తే... వ్యతిరేకులంతా దీనిపై నిరనస గళం విప్పారు. అయితే ఈ అరెస్టుల కారణంగా మరోసారి ప్రాచుర్యంలోకి వచ్చింది అర్బన్ నక్సల్ అనే పదం. కొంతకాలంగా ఇది చర్చల్లో ఉంది. అయితే #MeTooUrbanNaxal హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ పోస్టులు వైరల్ అయ్యాయి.

ఫొటో సోర్స్, Twitter
సినీ నిర్మాత, 'అర్బన్ నక్సల్స్: ద మేకింగ్ ఆఫ్ బుద్ధ ఇన్ ఏ ట్రాఫిక్ జామ్' పుస్తక రచయిత వివేక్ అగ్నిహోత్రి అర్బన్ నక్సల్స్‌ను సమర్థిస్తున్నవారెవరో చూడాలంటూ ఓ ట్వీట్ చేశారు. దీనిపై దాదాపు రెండున్నర లక్షల మంది #MeTooUrbanNaxal పేరుతో ట్వీట్ల వర్షం కురిపించారు.
ఎవరీ అర్బన్ నక్సల్?
దీనికి నిర్దిష్ట నిర్వచనం ఏమీ లేదు. కేవలం మోదీ ప్రభుత్వాన్ని, పార్టీని విమర్శించేవారిని పిలిచేందుకు ఉపయోగిస్తున్న ఓ పదం ఇది. అప్పుడప్పుడూ అర్బన్ నక్సల్స్, సంఘ వ్యతిరేకులు అని కూడా అంటున్నారు.

ఫొటో సోర్స్, Twitter
ఆల్ట్ న్యూస్ వ్యవస్థాపకుడు ప్రతీక్ సిన్హా మొదట ట్వీట్ చేశారు. సంఘ వ్యతిరేకత అనేది ఇప్పుడు ఒకరికి సంబంధించినది కాదు. ఈ హిట్లర్ వారసులంతా కలసి ఈ అర్బన్ నక్సల్ అనే పదంతో కొందరిని లక్ష్యంగా చేసుకునే అవకాశం మనం ఇవ్వకూడదు. మనమంతా అర్బన్ నక్సల్స్‌మే అని #MeTooUrbanNaxal హ్యాష్ ట్యాగ్‌తో చాటిచెబుదాం అని ఆయన ట్వీట్ చేశారు.
దీనిపై యువత చాలా సునిశితంగా స్పందించింది.

ఫొటో సోర్స్, TWITTER
నా దగ్గరొక టీషర్ట్ ఉంది. మీ అడ్రస్ చెప్పండి, పంపిస్తా. అలాగే మీ సైజ్ కూడా చెప్పండి. అంటూ ఫన్నీగా ట్వీట్ చేశారు ఆకాష్ బెనర్జీ అనే ఓ నెటిజన్.

ఫొటో సోర్స్, TWITTER
అధికారాన్ని, వ్యవస్థను ప్రశ్నించేవారంతా అర్బన్ నక్సలైట్లైతే #MeTooUrbanNaxal అని ఎన్పేర్ మోహన్ అనే నెటిజన్ ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, TWITTER
ప్రశ్నించడం, మానవత్వాన్ని పరిరక్షించడం, భావవ్యక్తీకరణను కాపాడటమే నన్ను అర్బన్ నక్సలైట్‌గా మారుస్తుందనుకుంటే... #MeTooUrbanNaxal అని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నాను... అని అర్చనా భరద్వాజ్ ట్వీట్ చేశారు.
ఈ అరెస్టులను సమర్థించేవారు సైతం తమ పదునైన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

ఫొటో సోర్స్, TWITTER
అంతర్గతంగా భారత్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు నక్సల్స్ సమస్య అని గతంలో ఓసారి కాంగ్రెస్‌కు చెందిన నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు. కానీ ఇప్పుడు అదే కాంగ్రెస్ ఇప్పుడు నక్సల్స్‌ను సమర్థిస్తోందని, ఇది సిగ్గు చేటని జ్ఞానేంద్ర గిరి పోస్ట్ చేశారు.

ఫొటో సోర్స్, TWITTER
2013లో కాంగ్రెస్ ప్రభుత్వం 128 సంస్థలను అర్బన్ నక్సల్ సంస్థలుగా గుర్తించింది. మావోయిస్టులు దేశ అంతర్గత భద్రతకు పెను సవాల్ అని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు. కానీ ఇప్పుడు వారే #MeTooUrbanNaxal అంటూ వారిని వెనకేసుకొస్తున్నారు అంటూ ప్రశాంత్ పి. ఉమ్రావ్ అనే యూజర్ విమర్శించారు.

ఫొటో సోర్స్, TWITTER
గత కొన్ని సంవత్సరాలుగా చాలా మంది 'మై భీ అన్నా' (నేనూ అన్నా హజారేనే) నుంచి #MeTooUrbanNaxal వైపు మారారు. 2019 ఎన్నికల్లో మోదీ గెలిచిన తర్వాత వీరంతా 'మై భీ హఫీజ్' (నేనూ హఫీజ్‌నే) అంటారేమో, 2023 నాటికి వాళ్లంతా 'నేనూ బిన్ లాడెన్‌నే' అనుకుంటూ ఉంటారేమో అని బాబూ భయ్యా ట్విటర్లో పోస్ట్ చేశారు.
ఈ అరెస్టులపై మీడియాలో వచ్చిన కథనాలను సుమోటోగా స్వీకరించిన జాతీయ మానవ హక్కుల సంఘం... ఈ అరెస్టులు నిర్దేశిత పద్ధతిలో జరగలేదని, ఈ మొత్తం వ్యవహారంపై నాలుగు వారాల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ నేతలందరినీ సెప్టెంబరు 6 వరకూ గృహనిర్బంధంలో ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఇవి కూడా చదవండి:
- ‘నక్సలైట్ల కుట్ర కేసులు’ ఎన్నిసార్లు రుజువయ్యాయి?
- ‘మోదీ హత్యకు మావోయిస్టుల కుట్ర’: నిజమా? కల్పితమా?
- భీమా-కోరెగాంలో దళితులు విజయోత్సవం ఎందుకు జరుపుకుంటారు?
- ‘కొత్త రకం మోసం’: శిక్షణ అని చెప్పి ముక్కూమొహం తెలియని వ్యక్తితో పెళ్లి చేసేశారు
- ‘పురుషుల ముందే టాయిలెట్‌కి వెళ్లాల్సి వచ్చేది’
- ‘ఆ మాటలు విన్న తర్వాత పిల్లలను కనాలంటేనే సిగ్గుగా ఉంటుంది’
- నాగ్‌పూర్ అత్యాచారం: 'పాతికేళ్ల నా సర్వీసులో అంత క్రూరత్వాన్ని ఎప్పుడూ చూడలేదు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








