షుజాత్ బుఖారీ: 'గొప్ప వ్యక్తి, ధైర్యవంతుడైన జర్నలిస్టు'
సీనియర్ పాత్రికేయుడు, 'రైజింగ్ కశ్మీర్' దినపత్రిక సంపాదకుడు సయ్యద్ షుజాత్ బుఖారీ గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో మృతి చెందారు.
ఆయనతో పాటు ఇద్దరు వ్యక్తిగత భద్రతా అధికారులు కూడా ఈ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు.
జమ్ముకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లోని ప్రెస్ ఎవెన్యూ సమీపంలో బుఖారీ తన కార్యాలయం నుంచి బయటకు వస్తుండగా కాల్పులు జరిగినట్టు 'రైజింగ్ కశ్మీర్' తెలిపింది.
బీబీసీ న్యూస్ వెబ్‌సైట్ కోసం కంట్రిబ్యూటర్‌గా పనిచేసిన బుఖారీ, తరచూ కథనాలు రాస్తుండేవారు.
గురువారం సాయంత్రం 7.15 గంటల సమయంలో మోటార్ సైకిళ్లపై వచ్చిన సాయుధులు ఆయనపై కాల్పులు జరిపారనీ, ఈ కాల్పుల్లో షుజాత్ బుఖారీతో పాటు ఆయన వ్యక్తిగత భద్రతా అధికారి కూడా ప్రాణాలు కోల్పోయారని జమ్మూ కశ్మీర్ డీజీపీ ఎస్.పీ. వైద్ తెలిపారు.
మరో భద్రతా అధికారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

ఫొటో సోర్స్, BILAL BAHADUR
'టపాసులు అనుకున్నాం': ఫొటోగ్రాఫర్
తాను షుజాత్ బుఖారీ హత్య జరిగిన వెంటనే తాను ఘటనా స్థలానికి వెళ్లానని కశ్మీర్ మానిటర్ పత్రిక ఫొటోగ్రాఫర్ ఉమర్ గనియే తెలిపారు.
"రైజింగ్ కశ్మీర్ కార్యాలయం పక్కనే ఉన్న మా ఆఫీసులో వస్తువులు సర్దుతుండగా బయట నుంచి ఒక్కసారిగా బుల్లెట్ శబ్దాలు వినిపించాయి.
తొలుత ఈద్ ఉంది కాబట్టి.. ఎవరైనా టపాసులు కాల్చుతున్నారేమో అనుకున్నాం. కానీ, చప్పుడు తీవ్రత ఎక్కువగా ఉండటంతో అనుమానం వచ్చి వెంటనే కెమెరా తీసుకుని బయటకు వెళ్లాను."

ఫొటో సోర్స్, Aamir Peerzada
"అక్కడ అద్దాలు పగిలిపోయిన కారు, ముగ్గురి శరీరాలు కనిపించాయి. రక్తపు మడుగులో ఉన్న ఆ ముగ్గురూ మరణించి ఉంటారని అనుకున్నాం.
కానీ, వారిలో ఒక భద్రతా అధికారి నొప్పితో మూలుగుతున్నారు. దాంతో అతడు బతికే ఉన్నాడని గుర్తించి వెంటనే పాత్రికేయులు ఎస్‌ఎమ్‌హెచ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
మిగతా ఇద్దరిలో కదలిక లేదు. ఆ శరీరాల నుంచి రక్తం అంతా బయటకు వచ్చేసింది. కొద్దిసేపటికి పోలీసులు వచ్చి ఆ కారును, షుజాత్ సార్‌ను తీసుకెళ్లారు" అని ఉమర్ గనియే వివరించారు.
ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్టు ఎవరూ ప్రకటించుకోలేదు. కానీ, పోలీసులు మాత్రం ఇది తీవ్రవాదుల పనేనని అనుమానిస్తున్నామని అన్నారు.

ఫొటో సోర్స్, @BUKHARISHUJAAT
షుజాత్ బుఖారీ హత్యను ఖండిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ ట్వీట్ చేశారు.
"బుఖారీ మరణం నన్ను బాగా కలచివేసింది. ఈద్‌కు ముందు రోజు ఉగ్రవాదం తన వికృత రూపాన్ని చూపింది. ఈ మతిలేని హింసను నేను ఖండిస్తున్నా. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం" అని ఆమె తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
"షుజాత్ బుఖారీ హత్య ఓ పిరికి చర్య. ఆయన ఓ ధైర్యవంతుడైన జర్నలిస్టు. ఈ వార్త విని చాలా బాధపడ్డా." అని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్విటర్లో తన సానుభూతిని వ్యక్తం చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
'రైజింగ్ కశ్మీర్'కు సంపాదకుడిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు, షుజాత్ 1997-2012 మధ్య కశ్మీర్‌లో ఆంగ్ల దినపత్రిక 'ద హిందూ'కు కరస్పాండెంట్‌గా పని చేశారు.
పాత్రికేయ వృత్తితో పాటు కశ్మీర్‌లో పలు స్థానిక భాషలను కాపాడేందుకు కూడా బుఖారీ కృషి చేశారు.
2000లో షుజాత్‌పై ఒకసారి దాడి జరిగింది. అప్పటి నుంచి ఆయనకు పోలీసు రక్షణ కల్పించారు.

ఫొటో సోర్స్, Aamir Peerzada
కశ్మీర్‌లో శాంతిని నెలకొల్పాలనే అంశంపై షుజాత్ బుఖారీ చాలా కాలంగా క్రియాశీలంగా ఉన్నారు.
శాంతి, భద్రత వంటి అంశాలపై ప్రపంచవ్యాప్తంగా జరిగే చాలా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
"రైజింగ్ కశ్మీర్ ఎడిటర్ షుజాత్ బుఖారీ హత్యకు గురైన వార్త వినడం చాలా బాధాకరం. జమ్ము కశ్మీర్‌లో న్యాయం, శాంతి కోసం పోరాడిన ధైర్యవంతుడు ఆయన" అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
'బుఖారీ హత్య వార్త విని హతాశుడనయ్యాను. ఆయన మర్యాదగల వ్యక్తి, మంచి స్నేహితుడు ఒక గొప్ప, ధైర్యవంతుడైన జర్నలిస్టు' అని బీబీసీ ప్రతినిధి సంజోయ్ మజుందార్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
"కశ్మీర్‌లో మేం పాత్రికేయ వృత్తిని గర్వంగా సాగించాం. ఇక్కడ జరుగుతున్న విషయాలను ప్రజలకు తెలుపుతూనే ఉంటాం" అని బుఖారీ చనిపోక ముందు ఆఖరి ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
"బుఖారీ తన ఆఖరి ట్వీట్‌లోనూ తనను, తన సహచరులను, వృత్తిని సమర్థించుకున్నారు. ఒక జర్నలిస్టుగా ఎంత ఉన్నతంగా పనిచేశారో.. అదే పనిలో ఉండగానే ఆయన ప్రాణాలు కోల్పోయారు" అని జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 6
ఇవి కూడా చదవండి.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)