కామన్‌వెల్త్ క్రీడలు: హోరాహోరీ పోరులో సింధుపై సైనాదే విజయం.. భారత్‌కు స్వర్ణం, రజతం

ఫొటో సోర్స్, Getty Images
ఆస్ట్రేలియాలో జరిగిన కామన్‌వెల్త్ క్రీడల బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, సైనా నెహ్వాల్‌ల పోరు ఆసక్తికరంగా సాగుతోంది.
హోరాహోరీగా జరిగిన మొదటి సెట్‌లో సైనా నెహ్వాల్ 20-18 పాయింట్ల తేడాతో సింధుపై పైచేయి సాధించింది.
రెండో సెట్‌లోనూ పీవీ సింధు, సైనా నెహ్వాల్ నువ్వా..నేనా అన్నట్లు తలపడ్డారు. చివరికి సైనా నెహ్వాల్ 23-21 పాయింట్ల తేడాతో విజయం సాధించింది.
2-0తో మ్యాచ్‌ను కూడా గెల్చుకుని, స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. పీవీ సింధు రెండో స్థానంలో నిలిచి రజతంతో సరిపెట్టుకుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఫైనల్స్ చేరారు ఇలా..
పీవీ సింధు:
తొలి మ్యాచ్‌లో ఫిజీ క్రీడాకారిణి అండ్ర వైట్‌సైడ్‌పై 2-0తో విజయం
రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా క్రీడాకారిణి హువాన్ యు వెండీ ఛెన్‌పై 2-0తో విజయం
క్వార్టర్‌ఫైనల్‌లో కెనడా క్రీడాకారిణి బ్రిట్నీ టామ్‌పై 2-0తో విజయం
సెమీఫైనల్‌లో కెనడా క్రీడాకారిణి మిచెల్లె లీపై 2-0తో విజయం
సైనా నెహ్వాల్:
తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా క్రీడాకారిణి ఎల్సీ డీ విల్లెర్స్‌పై 2-0తో విజయం
రెండో మ్యాచ్‌లో ఐసెల్ ఆఫ్ మ్యాన్ దేశ క్రీడాకారిణి జెస్సికా లీ రిటైర్ కావటంతో ముందంజ
క్వార్టర్‌ఫైనల్‌లో కెనడా క్రీడాకారిణి రేచల్ హొండెరిక్ పై 2-0తో విజయం
సెమీఫైనల్‌లో స్కాట్లాండ్ క్రీడాకారిణి క్రిస్టీ గిల్మౌర్‌పై 2-1తో విజయం
ఈ కథనం అప్‌డేట్ అవుతోంది..
కామన్‌వెల్త్ క్రీడలపై మరిన్ని కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








