పక్షులతో వ్యాపారం.. ‘100 శాతం రిస్క్, 500 శాతం లాభం’
కోవిడ్ కారణంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. అప్పటి నుంచి ఇంటి నుంచి చేసే వ్యాపారాలపై ఆసక్తి పెరిగింది. ఈ క్రమంలో కోవిడ్ తర్వాత పాకిస్తాన్‌లో పక్షుల పెంపకం ఒక పరిశ్రమగా మారింది.
పక్షుల వ్యాపారం చేస్తూ చాలా మంది బాగా సంపాదిస్తున్నారు.
పక్షులు ఎంతసేపు నిద్రపోతాయి, వాటికి ఎలాంటి రోగాలు వస్తాయి, వాటికి ఏమేం పోషకాలు అవసరం, అవి ఎప్పుడు గుడ్లు పెడతాయి లాంటి ప్రాథమిక అంశాలపై పక్షుల పెంపకందారులకు అవగాహన ఉండాలని ఈ వ్యాపారంలో ఉన్నవారు చెబుతున్నారు.

‘‘ఉద్యోగాలు కోల్పోయిన చాలా మంది ఇప్పుడు పక్షుల్ని పెంచుతున్నారు. భర్తలకు ఆర్థికంగా అండగా ఉండాలని చాలా మంది మహిళలు ఈ వ్యాపారం మొదలుపెట్టారు. వాళ్ల పక్షుల వ్యాపారం కూడా బాగుంది. ఇప్పుడు వాళ్ల భర్తలు కూడా ఈ వ్యాపారంలో వారికి సాయం చేస్తున్నారు’’ అని లాహోర్‌కు చెందిన రహీల్ అలీ ధిల్లాన్ చెప్పారు.
‘‘పాకెట్ మనీతో కొనాలనుకునే విద్యార్థులు వారి స్తోమతను బట్టి 15 నుంచి 20 వేల పాకిస్తాన్ రూపాయలు పెట్టి పక్షులు తీసుకోవచ్చు. బిజినెస్ చేయాలనుకునే వారికి 40 లక్షల పాకిస్తాన్ రూపాయల నుంచి 50 లక్షల రూపాయల వరకు ఖరీదు చేసే పక్షులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇంకా చాలా రకాలు ఉన్నాయి’’ అని ఆయన వివరించారు.
కేవలం 8 జతల పక్షులతో ఈ వ్యాపారం ప్రారంభించొచ్చవచ్చని, వాటికి ఆహారం, నీళ్లు ఇవ్వడానికి రోజుకు అరగంట కంటే ఎక్కువ పట్టదని షంసా హష్మీ చెప్పారు. పక్షుల వ్యాపారంలో ఉన్న షంషా హష్మీ, పాకిస్తాన్ మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్.
లవ్ బర్డ్స్‌గా పిలిచే ఈ చిన్న ఆఫ్రికన్ చిలుకలతో పాటు ఆస్ట్రేలియన్ జాతులైన గౌల్డియన్ సహా వివిధ రకాల విదేశీ పక్షులను కూడా పాకిస్తాన్‌లో పెంచుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఇజ్రాయెల్ పక్షాన ఉంటూ గాజాకు సాయం చేయడంలో మోదీ ఆంతర్యం ఏమిటి?
- ఎలక్షన్ కోడ్: రూ.50 వేలకు మించి తీసుకెళ్లలేకపోతున్నారా? సీజ్ చేసిన డబ్బు తిరిగి పొందడం ఎలా?
- మొహమ్మద్ షమీ: మా బౌలింగ్ తుపానుకు కారణమదే
- అఫ్గానిస్తాన్: అంతర్యుద్ధం, పేదరికంతో అల్లాడుతున్న తాలిబాన్ల పాలనలో క్రికెట్ ఎలా వికసించింది?
- చిత్తూరు: భార్యతో ఉన్నప్పుడు పురుషుడు.. బాయ్‌ఫ్రెండ్‌ను కలిస్తే మహిళ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









