బంగ్లాదేశ్‌లో తలదాచుకుంటున్న లక్షల మంది రోహింజ్యా శరణార్థులు ఇప్పుడెలా ఉన్నారు?

బంగ్లాదేశ్‌లో తలదాచుకుంటున్న లక్షల మంది రోహింజ్యా శరణార్థులు ఇప్పుడెలా ఉన్నారు?

దాదాపు పది లక్షల మంది రోహింజ్యా శరణార్థులు తలదాచుకుంటున్న బంగ్లాదేశ్ క్యాంపు తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడింది.

మోఖా తుపాను బంగ్లాదేశ్, మియన్మార్ మధ్యన తీరం దాటింది. శరణార్థుల జీవితాల నిస్సహాయత గురించి చెప్పేందుకు ఇది మరో హెచ్చరిక అంటున్నాయి సహాయ సంస్థలు.

మియన్మార్లోని మైనారిటీ జాతులలో రోహింజ్యా ముస్లింలు కూడా ఉన్నారు. 2017 ఆగస్టులో సైన్యం అణిచివేత కారణంగా లక్షల మంది దేశం వదిలేసి బంగ్లాదేశ్ చేరుకున్నారు.

వీరందరినీ బంగ్లాదేశ్‌లోని కాక్స్ బజారులో ఏర్పాటు చేసిన శరణార్థి శిబిరానికి తరలించారు.

క్యాంపులోనే పుట్టి అక్కడే పెరుగుతున్న చిన్నారి అన్వర్‌ను కలిసారు బీబీసీ ప్రతినిది రజినీ వైద్యనాధన్.

రొహింజ్యా

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)