అమ్మో మనిషి! చూడగానే భయపడి పారిపోయిన సింహం
గుజరాత్‌లోని దుంగార్‌పుర్ ప్రాంతంలో ఓ వ్యక్తిని చూసి సింహం భయపడి పారిపోయింది.
రాత్రివేళ ఆ వ్యక్తి బయటకు రాగా, హఠాత్తుగా ఓ వైపు నుంచి సింహం వచ్చింది.
సింహాన్ని చూడగానే ఆ వ్యక్తి భయపడి వెనక్కి పరిగెత్తారు.
విచిత్రం ఏంటంటే ఆ వ్యక్తిని చూడగానే సింహం కూడా అలాగే భయపడి వేగంగా వెనక్కి వెళ్లిపోయింది.
ఇదంతా సీసీటీవీలో రికార్డయింది.

ఫొటో సోర్స్, ugc
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











