వియత్నాంలో వరదల బీభత్సం, ఈ 11 ఫోటోలలో చూడండి..

ఫొటో సోర్స్, Magdalena Chodownik/Anadolu via Getty Images
- రచయిత, ఒటిలియా మిచెల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
వియత్నాంలో కొన్ని రోజులుగా కురిసిన భారీగా వర్షాలకు వరద బీభత్సం సృష్టించింది. కొండచరియలు విరిగిపడ్డాయి.
వరద ఉధృతికి 90 మంది మృతి చెందగా, మరో 12 మంది గల్లంతయ్యారు.

ఫొటో సోర్స్, Magdalena Chodownik/Anadolu via Getty Images
దేశవ్యాప్తంగా 1,86,000 ఇళ్లు ధ్వంసమయ్యాయని, 30 లక్షలకు పైగా పశువులు కొట్టుకుని పోయాయని వియత్నాం ప్రభుత్వం తెలిపింది.
వందల మిలియన్ల పౌండ్ల (వేల కోట్ల రూపాయల) విలువైన నష్టం జరిగిందని అధికారులు భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Magdalena Chodownik/Anadolu via Getty Images
పర్వత ప్రాంతమైన డాక్ లాక్ ప్రావిన్స్ తీవ్రంగా ప్రభావితమైందని న్యూస్ ఏజెన్సీ ఏఎఫ్‌పీ తెలిపింది. నవంబర్ 16 నుండి ఇక్కడ 60 మంది కంటే ఎక్కువ మంది చనిపోయారు.

ఫొటో సోర్స్, Magdalena Chodownik/Anadolu via Getty Images
ఆదివారంనాడు కరెంట్ లేకపోవడంతో సుమారు 2.58 లక్షలమంది ప్రజలు చీకట్లోనే ఉండాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.

ఫొటో సోర్స్, Magdalena Chodownik/Anadolu via Getty Images
ప్రముఖ రహదారులు, రైల్వే ట్రాకులు వరద నీటితో బ్లాక్ అయినట్లు అధికారులు చెప్పారు.

ఫొటో సోర్స్, Magdalena Chodownik/Anadolu via Getty Images
వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం సైనిక, పోలీసు సిబ్బందిని తరలించారు.

ఫొటో సోర్స్, Bao Quan / AFP via Getty Images
సౌత్, సౌత్ సెంట్రల్ వియత్నాంలోని క్వాంగ్ నాయ్, జియా లై, డాక్ లాక్, ఖాన్ హోవా, లామ్ డాంగ్ వంటి ఐదు ప్రావిన్స్‌లలో వరద ప్రభావం ఎక్కువగా ఉందని ప్రభుత్వం తెలిపింది.

ఫొటో సోర్స్, Magdalena Chodownik/Anadolu via Getty Images
''మా పక్కిల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఏదీ మిగలలేదు. ప్రతీది బురద మట్టిలో కూరుకుపోయింది'' అని డాక్ లాక్‌లోని రైతు మాక్ వ్యాన్ సీ ఏఎఫ్‌పీకి తెలిపారు.

ఫొటో సోర్స్, Magdalena Chodownik/Anadolu via Getty Images
శుక్రవారం వరకు కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం 1.5 మీటర్ల (5 అడుగుల) నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో 1993 నుంచి ఎన్నడూ చూడని 5.2 మీటర్ల స్థాయిని దాటింది.
రాబోయే రోజుల్లో వర్షపాతం తగ్గుముఖం పడుతుందని అంచనాలున్నాయి.

ఫొటో సోర్స్, Duc Thao / AFP via Getty Images
మానవుల వల్ల ఏర్పడిన వాతావరణ మార్పుల వల్ల తీవ్రమైన వాతావరణ ప్రభావాలను వియత్నాం ఎదుర్కొంటోందని సైంటిస్టులు చెప్పారు.
ఈ వాతావరణ మార్పు వల్ల బలమైన టైఫూన్లు తరచూ సంభవిస్తున్నట్లు తెలిపారు.

ఫొటో సోర్స్, DUC THAO/AFP via Getty Images
రోడ్ల మీద నిలిపి ఉంచిన కార్లు వరదల్లో మునిగిపోయాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)