ఉషా చిలుకూరి: రిపబ్లికన్ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ భార్య అయిన ఈ భారత సంతతి మహిళ ఎవరు? ఏం చేస్తుంటారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జూడ్ షిరిన్
- హోదా, బీబీసీ న్యూస్
సోమవారంనాడు అమెరికా ఉపాధ్యక్ష పదవికి నామినేషన్‌ను అంగీకరించేందుకు రిపబ్లిక్ నేషనల్ కన్వెన్షన్ స్టేజ్ మీదకు వెళ్లినప్పుడు జేడీ వాన్స్ మీద పొగడ్తల వర్షం కురిసింది.
ఆయన ఈ పదవికి అన్ని విధాలా అర్హుడంటూ అక్కడికి వచ్చిన అనేకమంది జేడీ వాన్స్‌ను అభినందించారు.
అయితే, జేడీ వాన్స్ గతంలో ఒకసారి తన భార్య గురించి మాట్లాడుతూ, ఉషా సీవీని చూసి తాను ముగ్ధుడినయ్యానని అన్నారు.
వాస్తవానికి జేడీ వాన్స్ భార్య, భారత సంతతి మహిళ ఉషా వాన్స్ రాజకీయాల మీద పెద్దగా ఆసక్తిలేనట్లుగానే కనిపిస్తారు. అయితే ఆమె తన పొలిటికల్ కెరీర్ మీద అత్యంత ప్రభావాన్ని చూపించిన వ్యక్తి అని వాన్స్ చెప్పేవారు.
ఈ కథనంలో జేడీ వాన్స్‌కు, భారతదేశానికి ఉన్న సంబంధాన్ని, ఆయన భార్య ఉషా వాన్స్ (ఉషా చిలుకూరి) గురించి, ఆమె వ్యక్తిత్వం గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం.


ఫొటో సోర్స్, Getty Images
గత నెలలో ఉషా ఫాక్స్ న్యూస్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆమె ‘‘జేడీ మీద నాకు గట్టి నమ్మకముంది. అతని వ్యక్తిత్వాన్ని నేను చాలా ఇష్టపడతాను. చూద్దాం...ఏం జరుగుతుందో’’ అని అన్నారు.
న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం, 2013లో వీరిద్దరూ యేల్ లా స్కూల్‌లో తొలిసారి కలుసుకున్నారు. ‘సోషల్ డిక్లైన్ ఇన్ వైట్ అమెరికా’’ అనే అంశంపై జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో వీరిద్దరూ పాల్గొన్నారు.
2014లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఉషా, జేడీ వాన్స్ దంపతులకు ముగ్గురు పిల్లలు. ఇవాన్, వివేక్, మీరాబెల్ వారి పేర్లు.
ఉషా తల్లిదండ్రులు భారత దేశం నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడ్డారు. ఉషా చిన్నప్పటి నుంచి శాన్ డియాగోలో పెరిగారు.
ఉషా హిందూ సంప్రదాయంలో పెరగగా, జేడీ వాన్స్ క్యాథలిక్ మతాన్ని అనుసరిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
ఉషా కెరీర్ ఆమె భర్తకు భిన్నంగా కనిపిస్తుంది. యేల్ యూనివర్సిటీ నుంచి బీఏ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఉషా, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఎర్లీ మోడ్రన్ హిస్టరీలో ఎం.ఫిల్ చేసినట్లు ఆమె లింక్డ్ ఇన్ ప్రొఫైల్‌లో ఉంది.
గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్‌కు క్లర్క్‌గా కూడా ఉషా వాన్స్ పని చేశారు. ప్రస్తుతం లాయర్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు.
జేడీ వాన్స్ తరచూ భార్యను పొగుడుతుంటారు. ఆమెను తన యేల్ యూనివర్సిటీ ‘ఆధ్యాత్మిక గురువు’గా అభివర్ణించేవారు.
సీఎన్ఎన్ రిపోర్టు ప్రకారం, జేడీ వాన్స్ ఓ సందర్భంలో ఉషా గురించి ఇలా రాశారు. ‘‘ నాకు కూడా తెలియని ప్రశ్నలను ఆమె అర్థం చేసుకుంటుంది."
తనకు తెలియని అనేక అవకాశాల గురించి కూడా తనకు ఉషా చెబుతూ ఉంటుందని వాన్స్ పేర్కొన్నారు.
‘‘ఆమె జ్ఞానం గురించి చాలామందికి తెలియదు. వెయ్యి పేజీల పుస్తకాన్ని కూడా కొన్ని గంటల్లోనే చదివేయగలదు.’’ అన్నారు జేడీ వాన్స్.
నా పక్కనుండి ధైర్యాన్ని నింపే మహిళ ఆమె అని, తనకు మార్గదర్శిగా వ్యవహరిస్తుందని వాన్స్ తరచూ చెబుతుంటారు.
‘‘నేను మరీ ఊహల్లో తేలుతుంటే ఉషా నన్ను అప్పుడప్పుడు భూమి మీదకు దింపుతుంటారు.’’ అని 2020లో మేగిన్ కెల్లీ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు జేడీ వాన్స్.
‘‘నేనెప్పుడైనా అతి గర్వంగానో, మేథావిగానో ఫీలయినప్పుడు వెంటనే ఆమె గుర్తుకు వస్తుంది. ఆమె నాకన్నా చాలా సాధించింది అన్న విషయం గుర్తు చేసుకుంటాను.’’ అని వాన్స్ అన్నారు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















