ఒబామా దంపతులు విడాకులు తీసుకుంటున్నారా? మిషెల్ ఏమని చెప్పారు

బరాక్ ఒబామా, మిషెల్ ఒబామా

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, బరాక్, మిషెల్ విడాకులు తీసుకుంటున్నారని కొన్ని నెలలుగా వదంతులు వస్తున్నాయి.
    • రచయిత, దనాయ్ నెస్టా కుపెంబ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బరాక్‌ ఒబామాతో తన వైవాహిక బంధం ఇబ్బందుల్లో ఉందన్న వదంతులపై మిషెల్ ఒబామా మాట్లాడారు.

అమెరికా అధ్యక్షుడిగా డోనల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం, మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అంత్యక్రియలు వంటి హై ప్రొఫైల్ కార్యక్రమాలకు బరాక్ ఒబామాతో పాటు ఆయన భార్య మిషెల్ వెళ్లకపోవడంతో వారిద్దరూ విడిపోతున్నారనే ఊహాగానాలు పెరిగాయి.

ఈ సందర్భాలను ప్రత్యేకంగా ప్రస్తావించనప్పటికీ ఇప్పుడు తన షెడ్యూళ్లను తాను నియంత్రించుకోగలిగే స్థాయిలో ఉన్నానని నటి సోఫియా బుష్ హోస్ట్ చేస్తున్న ‘వర్క్ ఇన్ ప్రాగ్రెస్’ పాడ్‌కాస్ట్‌లో చెప్పారు.

నేను నా కోసం నేను నిర్ణయాలు తీసుకుంటుంటే ప్రజలు నమ్మలేకపోతున్నారని, బదులుగా.. నేను, నా భర్త విడాకులు తీసుకుంటున్నామని ఊహాగానాలు చేస్తున్నారని మిషెల్ అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

కొన్ని విధుల నుంచి తప్పుకోవడంపై తాను పశ్చాత్తాపపడుతున్నానని మిషెల్ అన్నారు.

‘‘ఈ ఏడాది నేను నా కోసం కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను అని ప్రజలు గ్రహించలేకపోయారు. నా భర్తతో విడాకులు తీసుకుంటున్నానని ఊహించుకున్నారు’’

"ఒక మహిళ తన కోసం తాను కొన్ని నిర్ణయాలు తీసుకోకూడదు.. అంతేనా? కానీ, సమాజం మాకు చేసింది అదే’’

‘‘నాకు ఏది ఉత్తమమో అది ఎంచుకున్నాను. నేనేం ఏం చేయాల్సి ఉందో దాన్ని ఎంచుకోలేదు. అలాగే, ఇతరులు నేను ఏం చేయాలనుకుంటున్నారో దాన్ని ఎంచుకోలేదు’’ అని మిషెల్ ఆ పాడ్‌కాస్ట్‌లో చెప్పారు.

Michelle Obama

ఫొటో సోర్స్, Getty Images

ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆమె హాజరు కాకపోవడాన్ని సంప్రదాయాన్ని ఉల్లంఘించినట్లుగా భావించారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు ఆమె షికాగోలో జరిగిన డెమొక్రటిక్ పార్టీ నేషనల్ కన్వెన్షన్‌లో మాట్లాడారు. ‘‘ఆశ తిరిగొస్తోంది’’ అంటూ అప్పటి డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలాహారిస్‌కు మద్దతుగా నిలవాలని కోరారు.

తన కోసం ఎక్కువ సమయం కేటాయించుకుంటున్నప్పటికీ ప్రసంగాలు ఇచ్చేందుకు, కొన్ని ప్రాజెక్టుల కోసం పని చేసేందుకు, బాలికల విద్య కోసం సమయం కేటాయిస్తున్నట్లు మిషెల్ చెప్పారు.

2024 అక్టోబర్‌లో ఒబామా దంపతులు 32వ వివాహ వార్షికోత్సవం జరుపుకొన్నారు.

బరాక్ ఒబామాకు ఉన్న రాజకీయ లక్ష్యాలు, వైట్‌హౌస్‌లో ఉన్నప్పుడు, వైవాహిక జీవితంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి మిషెల్ ఒబామా తాను రాసిన 'బికమింగ్' అనే పుస్తకంలో పేర్కొన్నారు.

తన భర్త ఆకాంక్షల వల్ల తాను ఒంటరితనం, అలసటను ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆ పుస్తకంలో రాశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)