అంతరిక్షం అంచుల నుంచి దూకి రికార్డ్ నెలకొల్పిన సాహసికుడు.. పారాగ్లైడింగ్ చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు

ప్రత్యేక జంప్‌సూట్‌తో 2003లో ఇంగ్లిష్ చానల్ మీదుగా ఎగిరారు ఫెలిక్స్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ప్రత్యేక జంప్‌సూట్‌తో 2003లో ఇంగ్లిష్ చానల్ మీదుగా ఎగిరారు ఫెలిక్స్
    • రచయిత, ఒట్టిలీ మిషెల్, హోలీ కోల్
    • హోదా, బీబీసీ న్యూస్

అంతరిక్షం అంచుల నుంచి కిందకు దూకి అత్యంత ఎత్తు నుంచి స్కైడైవ్ చేసినట్లుగా వరల్డ్ రికార్డు నెలకొల్పిన ఫెలిక్స్ బామ్‌గార్ట్‌నర్ పారాగ్లైడింగ్ చేస్తూ ప్రమాదవశాత్తూ చనిపోయారు.

ఇటలీలోని ఈస్ట్రన్ మార్చ్ రీజియన్‌లో పారాగ్లైడింగ్ చేస్తూ ఒక హోటల్‌లోని స్విమ్మింగ్ పూల్ సమీపంలో పడి 56 ఏళ్ల ఫెలిక్స్ మృతి చెందారు.

గాల్లో ఉన్న సమయంలోనే ఆయన ఆకస్మాత్తుగా అనారోగ్యానికి గురై ఉండొచ్చని రిపోర్టులు సూచిస్తున్నాయని పోర్టో సాంట్ ఎల్పిడో మేయర్ మాసిమిలియానో సిర్పెల్లా చెప్పారు.

ఆస్ట్రియాకు చెందిన ఈ సాహసికుడు 2012లో వరల్డ్ రికార్డును బద్దలు కొట్టి వార్తల్లో నిలిచారు.

స్ట్రాటోస్పియర్‌లో.. 1,28,000 అడుగుల ఎత్తు (38 కి.మీ.)లో ఉన్న ఒక బెలూన్ నుంచి విజయవంతంగా స్కైడైవ్ చేసి నేలకు చేరి కొత్త రికార్డు నెలకొల్పారు.

'సాహసోపేత స్కైడైవ్‌లు చేయడానికి, ధైర్యానికి ఫెలిక్స్ ప్రతీక' అని సిర్పెల్లా అభివర్ణించారు. ఫెలిక్స్ మృతికి ఆయన నివాళులు అర్పించారు.

ఫెలిక్స్
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
జంప్ తర్వాత క్రైస్ట్ ది రీడిమర్ స్టాచ్యూ భుజంపై ఫెలిక్స్, పుష్పాలు ఉంచారు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, జంప్ తర్వాత క్రైస్ట్ ది రీడిమర్ స్టాచ్యూ భుజంపై ఫెలిక్స్, పుష్పాలు ఉంచారు

సోషల్ మీడియాలో ఫెలిక్స్ పోస్ట్ చేసిన ఒక వీడియో కింద ఇప్పుడు అభిమానులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.

ఫెలిక్స్ చేసిన సాహసోపేత స్టంట్లకు గాను 'ఫియర్‌లెస్ ఫెలిక్స్' అనే పేరును పొందారు.

రియో డి జనీరోలోని క్రైస్ట్ ది రిడీమర్ స్టాచ్యూ చేతిపై (30మీటర్లు) నుంచి దూకి ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఎత్తు స్కైడైవ్ (వరల్డ్ లోయెస్ట్ బేస్ జంప్) రికార్డును 1999లో నెలకొల్పారు.

అదే ఏడాది, మలేసియాలోని కౌలాలంపూర్‌లో ఉన్న పెట్రోనాస్ టవర్‌పై నుంచి దూకి హయ్యెస్ట్ పారాచూట్ జంప్ విభాగంలో వరల్డ్ రికార్డును సాధించారు.

అలాగే 2003లో కార్బన్ ఫైబర్ వింగ్స్‌తో ప్రత్యేకంగా తయారుచేసిన జంప్‌సూట్ ధరించి ఇంగ్లిష్ చానల్ మీదుగా ఎగిరారు.

అయితే, అంతరిక్షం అంచుల నుంచి కిందకు దూకుతూ చేసిన స్టంట్‌ ఆయనకు బాగా పేరు తెచ్చిపెట్టింది. ''అక్కడ నిల్చున్నప్పుడు మీరు రికార్డులు బద్దలు కొట్టడం గురించి ఆలోచించరు. కేవలం క్షేమంగా తిరిగి రావడం పైనే మీ ధ్యాస ఉంటుందని'' ఈ స్టంట్ చేసిన తర్వాత ఒక న్యూస్ కాన్ఫరెన్స్‌లో ఆయన అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)