మియన్మార్, బ్యాంకాక్‌లలో భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై 7 కు పైగా తీవ్రత నమోదు, నేలమట్టమైన భవనాలు

ఫొటో సోర్స్, Getty Images
మియన్మార్, థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో భారీ భూకంపం వచ్చింది.
మియన్మార్‌లో రిక్టర్ స్కేల్‌పై 7.7 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్) తెలిపింది.
బ్యాంకాక్‌లో శుక్రవారం కొద్దిసేపు పాటు భూమి కంపించిందని, ఈ ప్రకంపనాలతో సెంట్రల్ బిజినెస్ ఏరియాలోని పెద్దపెద్ద భవంతులు కదిలినట్లు ప్రత్యక్ష సాక్షులు రాయిటర్స్ వార్తా సంస్థతో చెప్పారు.
ఈ భూకంపంతో వందల మంది ప్రజలు భవనాల నుంచి బయటికి వచ్చి, వీధుల్లో నిల్చున్నట్లు సోషల్ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.


ఫొటో సోర్స్, Reuters
మియన్మార్, బ్యాంకాక్‌తో పాటు చైనాలో కూడా ప్రకంపనాలు వచ్చాయి.
మాండలే నగరానికి సమీపంలోని బర్మా నగరం సంగైంగ్‌కి 16 కి.మీల దూరంలో భూకంప కేంద్రం ఉందని యూఎస్‌జీఎస్ తెలిపింది.
థాయిలాండ్ ప్రభుత్వం భూకంపంపై అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
( ఈ కథనం అప్ డేట్ అవుతోంది)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














