ఐపీఎల్: రాజస్థాన్ రాయల్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం

ఐపీఎల్, సన్‌రైజర్స్, రాజస్థాన్ రాయల్స్

ఫొటో సోర్స్, Getty Images

ఐపీఎల్ సీజన్‌లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. హోంగ్రౌండ్‌లో సన్‌రైజర్స్ 44 పరుగుల తేడాతో రాజస్ధాన్ రాయల్స్‌పై గెలుపొందింది.

తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 286 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ సెంచరీ, ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీలతో సన్‌రైజర్స్ భారీ స్కోరు సాధించింది.

అనంతరం, 287 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన రాజస్ధాన్ రాయల్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 242 పరుగులే చేయగలిగింది.

దీంతో 44 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది.

సన్‌రైజర్స్ బౌలర్లలో సిమర్‌జీత్ సింగ్ 2 వికెట్లు, హర్షల్ పటేల్ 2 వికెట్లు పడగొట్టారు. షమీ, ఆడం జంపా తలో వికెట్ పడగొట్టారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఐపీఎల్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్

ఫొటో సోర్స్, Getty Images

ఆదిలోనే తడబడిన రాజస్థాన్ రాయల్స్

287 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు మైదానంలో దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు రెండో ఓవర్‌లో‌నే ఎదురుదెబ్బ తగిలింది.

ఒకే ఒక్క పరుగు చేసి యశస్వి జైస్వాల్ ఔటయ్యాడు. సిమర్‌జిత్ సింగ్ బౌలింగ్‌లో అభినవ్ మనోహర్‌కు క్యాచ్ ఇచ్చి జైస్వాల్ పెవిలియన్ చేరాడు.

అదే ఓవర్లో ఆర్ఆర్ కెప్టెన్ రియాన్‌పరాగ్(4) కూడా ఔటయ్యాడు. ఒక్క ఓవర్లోనే రాజస్థాన్ రాయల్స్ రెండు వికెట్లు కోల్పోయింది.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నితీశ్ రాణా 11 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.

ఐపీఎల్

ఫొటో సోర్స్, Getty Images

శాంసన్, ధ్రువ్ హాఫ్ సెంచరీలు

నితీశ్ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ధ్రువ్ జురేల్‌తో కలిసి స్కోరుబోర్డును ముందుకు నడిపాడు శాంసన్. ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేశారు. నాలుగో వికెట్‌కు ఇద్దరూ కలిసి 111 పరుగుల జోడించారు.

వీరిద్దరి భాగస్వామ్యానికి 161 పరుగుల వద్ద తెరపడింది. రాజస్థాన్ రాయల్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 66 పరుగులు చేసిన సంజు శాంసన్ హర్షల్ పటేల్ బౌలింగ్‌లో క్లాసెన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

అనంతరం ఆడం జంపా బౌలింగ్‌లో ధ్రువ్ జురేల్(70) కూడా ఔటయ్యాడు. జురేల్ ఇచ్చిన క్యాచ్‌ను ఇషాన్ కిషన్‌ పట్టాడు.

మొత్తం 16 ఓవర్లు ముగిసేప్పటికి 5 వికెట్లు కోల్పోయి రాజస్థాన్ రాయల్స్ కష్టాల్లో పడింది. శాంసన్, ధ్రువ్ జురేల్ ఔటైన తర్వాత ఆర్ఆర్ పరుగుల వేగం తగ్గిపోయింది.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హిట్‌మేయర్, శుభమ్ దుబే దూకుడుగా ఆడారు. 19 ఓవర్లకు రాజస్థాన్ రాయల్స్ స్కోరు 232 పరుగుల వద్ద ఉంది.

చివరి ఓవర్‌లో హిట్‌మేయర్(42) ఔటయ్యాడు.

మొత్తం 20 ఓవర్లు పూర్తయ్యేప్పటికి రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్లకు 242 పరుగులు మాత్రమే చేయగలిగింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, ఐపీఎల్ 2025

ఫొటో సోర్స్, Getty Images

286 పరుగులు చేసిన సన్‌రైజర్స్

తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆరు వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది.

టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది.

సన్‌రైజర్స్ బ్యాటర్ ఇషాన్ కిషన్ సెంచరీతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు భారీ స్కోరు చేసింది.

ఇషాన్ కిషన్ కేవలం 47 బంతుల్లో 106 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

పది ఫోర్లు, ఆరు సిక్స్‌ల సాయంతో కేవలం 45 బంతుల్లోనే ఇషాన్ సెంచరీ చేశాడు.

ట్రావిస్ హెడ్ 67 పరుగులు, హెన్రిచ్ క్లాసెన్ 34, తెలుగు బ్యాటర్ నితీశ్ కుమార్ రెడ్డి 30 పరుగులు చేశారు.

రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే 3 వికెట్లు పడగొట్టాడు. మహీష తీక్షణ రెండు, సందీప్ శర్మ ఒక వికెట్ పడగొట్టారు.

Ishan Kishan

ఫొటో సోర్స్, Getty Images

బౌండరీల మోతమోగించిన ఇషాన్

సన్‌రైజర్స్ జట్టులో ఇషాన్ కిషాన్ బౌండరీల మోతమోగించాడు. ఆరు సిక్సర్లు, పది ఫోర్లతో వేగంగా సెంచరీ పూర్తి చేశాడు. కేవలం 45 బంతుల్లోనే శతకం పూర్తి చేసిన ఇషాన్ మొత్తం 47 బంతులు ఎదుర్కొని 106 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

ఓపెనర్లుగా క్రీజులోకి వచ్చిన ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ దూకుడుగా ఆడారు. ట్రావిస్ హెడ్ 31 బంతుల్లోనే 67 పరుగులు చేశాడు.

అయితే, 45 పరుగుల వద్ద సన్‌రైజర్స్ మొదటి వికెట్ కోల్పోయింది. 24 పరుగులు చేసిన అభిషేక్ శర్మ మహీష్ తీక్షణ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ కూడా దూకుడుగా ఆడాడు.

మరోవైపు, ట్రావిస్ హెడ్ 21 బంతుల్లోనే అర్థశతకం పూర్తి చేశాడు. 85 పరుగుల వద్ద ట్రావిస్ హెడ్ పెవిలియన్ చేరాడు.

ఆ తర్వాత తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి క్రీజులోకి వచ్చాడు.

ఇషాన్, నితీశ్ 29 బంతుల్లోనే 72 పరుగులు జత చేశారు.

kavya maran

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఉప్పల్‌లో మ్యాచ్ చూస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సహ యజమాని కావ్య మారన్

ఉప్పల్ స్టేడియంలో అభిమానుల సందడి

ఎస్ఆర్‌హెచ్, ఆర్ఆర్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉప్పల్ స్డేడియం వద్ద ఏర్పాట్లు చేసింది.

క్రికెట్ అభిమానులతో ఉప్పల్ స్టేడియం కోలాహలంగా మారింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయం.)