నేపాల్‌ సమస్యకు అసలు కారణమేంటి? 6 చిత్రాలలో సింపుల్‌గా..

నేపాల్‌లో 'జెన్ జడ్' ఆందోళనలతో రాజకీయ అనిశ్చితి తలెత్తింది.

పోలీసులకు, నిరసనకారులకు మధ్య తలెత్తిన ఘర్షణలతో సోమవారం నుంచి నేపాల్ హింసాత్మకంగా మారింది.

దేశంలో నెలకొన్న కల్లోలంతో దేశ ప్రధాని కేపీ ఓలీ సహా పలువురు మంత్రులు తమ పదవికి రాజీనామా చేశారు.

నేపాల్‌లో ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడి 17 సంవత్సరాలైంది.

అంతకుముందు, నేపాల్ ప్రజలు 239 ఏళ్ల పాటు రాచరిక వ్యవస్థ కింద ఉన్నారు. దీంతో, అక్కడి ప్రజాస్వామ్యాన్ని తరచుగా రాచరిక వ్యవస్థతో పోలుస్తారు.

నేపాల్, అల్లర్లు, నిరసనలు, రాచరికం, ప్రజాస్వామ్యం

ఫొటో సోర్స్, Getty Images

నేపాల్‌లో ఈ పరిస్థితికి కారణమైన సమస్యలు అనేకం ఉన్నాయి.

జెన్ జడ్ (Gen Z) నిరసనల్లో 30 మంది పౌరులు చనిపోయారని నేపాల్ ఆరోగ్య, జనాభా మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఇదిలాఉండగా, సుప్రీంకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి సుశీల కార్కిని నేపాల్ తాత్కాలిక ప్రధానమంత్రిగా నియమించాలంటూ జెన్ జడ్ ఉద్యమంతో సంబంధం ఉన్న నిరసనకారులు ప్రతిపాదించారని రాయిటర్స్ వార్తాసంస్థ పేర్కొంది.

జెన్ జడ్ ఉద్యమంలో యువత ఆదరణ పొందిన ప్రముఖ రాపర్, కాఠ్‌మాండూ మేయరు బాలెన్ షా కూడా సుశీల కార్కి పేరును సమర్థించారు.

యువత తనపై నమ్మకం ఉంచారని కార్కి అన్నారు. ఎన్నికలు జరగాలని, దేశాన్ని అరాచకం నుంచి బయటపడేయాలని వారు కోరుకుంటున్నారని ఆమె వెల్లడించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)