పాశమైలారం బ్లాస్ట్: 34మంది మృతి, ప్రమాద తీవ్రతను చూపించే 11 ఫోటోలు

సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో రసాయన పరిశ్రమలో పేలుడు జరిగింది. 34 మంది మరణించారని సంగారెడ్డి జిల్లా ఎస్పీ వెల్లడించారు. ఇంకా కొందరి ఆచూకీ తెలియకపోవడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు.
పాశమైలారంలోని సిగాచీ కెమికల్స్ అనే పరిశ్రమలో ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాద సమయానికి అక్కడ 143 మంది ఉండగా అందులో 57 మంది సురక్షితంగా బయటపడ్డారు. గాయపడినవారు వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.

భారీగా ఎగసిపడుతున్న మంటలను అదుపు చేయడానికి ఫైర్ ఇంజిన్లతో సిబ్బంది చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు.









ప్రమాదంపై తెలంగాణ రాష్ట్ర ఫైర్ సర్వీసుల డైరక్టర్ జనరల్ నాగిరెడ్డి మీడియాతో మాట్లాడారు.
‘‘ఆస్పత్రిలో 35మంది చికిత్స పొందుతున్నారు. 3 అంతస్తుల అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కూలిపోయింది. పేలుడు సంభవించిన భవనం, పైన ఉన్న స్టీలు నిర్మాణం కూలిపోయింది. పేలుడుకు కారణమేమిటనేది ఇంకా తెలియదు. ఇక్కడ మైక్రో క్రిస్టలింగ్ డైయింగ్ యూనిట్ నడుస్తోంది. అందులో ఏదైనా సమస్య వచ్చి పేలుడు జరిగి ఉండచ్చనుకుంటున్నారు'' అని నాగిరెడ్డి పేర్కొన్నారు.

సిగాచీ ఫార్మా కంపెనీలో తీవ్రంగా గాయపడి మదీనాగూడలోని ప్రణం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొందరు క్షతగాత్రుల వివరాలు
1. నగ్నజిత్ బారి (20) ఒడిశా
2. రామ్ సింగ్ (50) ఒడిశా
3. రాంరాజ్ (25) బిహార్
4 రాజశేఖర్ రెడ్డి (40) ఆంధ్రప్రదేశ్
5. సంజయ్ ముఖయా ( 25) బిహార్
6. ధన్ బీర్ కుమార్ దాస్ (28) బిహార్
7. నీలాంబర్ (19) ఒడిశా
8. సంజయ్ కుమార్ యాదవ్ (28) ఒడిశా
9. గణేష్ కుమార్ (26) బిహార్
10. దేవ్ చంద్ (30) బిహార్
11. యశ్వంత్ (30) విజయవాడ
12. అభిషేక్ కుమార్ - బిహార్
13. నాగర్ జిత్ తివారి - ఒడిశా
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














