హెచ్‌సీయూ: థాయిలాండ్ విద్యార్థినిపై రేప్ అటెంప్ట్ ఆరోపణలతో ప్రొఫెసర్‌పై క్రిమినల్ కేసు, సస్పెన్షన్ వేటు

ఫొటో సోర్స్, UGC
విద్యార్థిని మీద అత్యాచారానికి ప్రయత్నించారనే ఆరోపణలతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
థాయిలాండ్‌కు చెందిన యువతి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్నారు.
అక్కడి హిందీ ప్రొఫెసర్ రవి రంజన్ తన మీద లైంగిక దాడికి ప్రయత్నించినట్లు ఆమె గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
యువతి ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేశామని మాదాపుర్ డీసీపీ కె.శిల్పవల్లి తెలిపారు.
క్రిమినల్ కంప్లయింట్, ఎఫ్ఐఆర్‌ల ఆధారంగా ఆ ప్రొఫెసర్‌ను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు రిజిస్ట్రార్ ఆదేశాలు జారీ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
హిందీ నేర్పిస్తానని పిలిచి
ప్రస్తుతం ప్రొఫెసర్ రవి రాజన్‌ను అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
అలాగే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చిన గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్ సీఐ, థాయిలాండ్ యువతి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేస్తున్నారు.
హిందీ నేర్పిస్తానని, పుస్తకం కోసమంటూ పిలిచి ప్రొఫెసర్ తనపై అత్యాచారానికి యత్నించినట్లు ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి స్టేట్‌మెంట్ ఆధారంగా కేసులో మరిన్ని సెక్షన్లు చేర్చనున్నట్లు పోలీసులు చెప్పారు.

ఫొటో సోర్స్, UGC
విద్యార్థుల ఆందోళనలు
అయితే ఈ ఘటన మీద హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గేటు వద్ద విద్యార్థులతోపాటు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.
థాయిలాండ్ విద్యార్థికి న్యాయం చేయాలని, ప్రొఫెసర్‌ను కఠినంగా శిక్షించాలంటూ విద్యార్థులు నిరసనకు దిగారు.
ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడాలని కోరారు.
వెంటనే ప్రొఫెసర్‌ను సస్పెండ్ చేసి శిక్షించాలని విద్యార్థి సంఘం ఏబీవీపీ డిమాండ్ చేసింది.
నిన్న రాత్రి ఘటన జరిగా ఇంత వరకు యూనివర్సిటీ యాజమాన్యం స్పందించలేదని వారు ఆరోపిస్తున్నారు.

ప్రొఫెసర్ సస్పెన్షన్
అయితే, మధ్యాహ్నం తరువాత యూనివర్సిటీ రిజిస్ట్రార్ కార్యాలయం ఆ ప్రొఫెసర్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది.
హిందీ ప్రొఫెసర్ రవిరంజన్ ప్రమేయం ఉన్నట్లుగా భావిస్తున్న ఘటనను యూనివర్సిటీ తీవ్రంగా ఖండిస్తోందని రిజిస్ట్రార్ కార్యాలయం ప్రెస్ నోట్ విడుదల చేసింది.
ఐపీసీ సెక్షన్లు 354, 354(ఏ) కింద అభియోగాలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ రవిరంజన్‌ను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రిజిస్ట్రార్ డాక్టర్ దేవేశ్ నిగమ్ ఈ ప్రకటనలో వెల్లడించారు.
ఇవి కూడా చూడండి:
- రాజమౌళికి ‘బెస్ట్ డైరెక్టర్’ అవార్డ్ ప్రకటించిన న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్
- వీడియో, పుట్టుకతోనే అంధుడు, కానీ పట్టుదలతో ఐఏఎస్... కట్టా సింహాచలం, వ్యవధి 3,23
- మీడియా సంస్థలు బిజినెస్ ఎంపైర్స్ చేతుల్లోకి వెళితే ఏమవుతుంది? - వీక్లీ షో విత్ జీఎస్
- చైనా: 'షీ జిన్‌పింగ్ దిగిపో' అంటూ తొలిసారిగా నిరసన బాట పట్టిన చైనా నవతరం... ఆ దేశంలో అసలేం జరుగుతోంది?
- ఎయిర్ఇండియాకు టాటాలు పూర్వ వైభవాన్ని తీసుకురాగలరా... విస్తారా విలీనం అందుకు దోహదపడుతుందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














