ఆస్కార్ 2025 నామినేషన్స్: పోటీలో ప్రియాంక చోప్రా షార్ట్ ఫిల్మ్ అనూజ

ప్రియాంక చోప్రా

ఫొటో సోర్స్, Priyanka Chopra/Facebook

ఆస్కార్ 2025 నామినేషన్లను అకాడమీ ప్రకటించింది. గత 12 నెలల్లో ప్రపంచవ్యాప్తంగా తమ చిత్రాలతో ప్రేక్షకుల మన్ననలు పొందిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, సినిమాలను అకాడమీ ఈ అవార్డుతో గౌరవిస్తుంది.

లాస్ ఏంజెలెస్ ప్రాంతంలో మంటల కారణంగా గత వారం రెండుసార్లు నామినేషన్ల ప్రకటన ఆలస్యం అయింది. ఎట్టకేలకు 97వ ఆస్కార్ అవార్డులకు పోటీపడుతున్న చిత్రాల జాబితాను గురువారం ప్రకటించారు.

జెండర్ మార్చుకున్న మెక్సికన్ డ్రగ్ డీలర్ గురించి తీసిన చిత్రం 'ఎమిలియా పెరెజ్' అత్యధికంగా 13 నామినేషన్లు దక్కించుకుంది. అయితే చిత్ర నటులలో ఒకరైన గాయని సెలీనా గోమెజ్‌కు నామినేషన్ దక్కలేదు.

'విక్డ్' చిత్రం 10 నామినేషన్లను అందుకుంది. బ్రిటిష్ నటి సింథియా ఎరివో, ఆమె సహనటి అరియానా గ్రాండేలకు నామినేషన్లు దక్కాయి.

అడ్రియన్ బ్రాడీ నటించిన 'ది బ్రూటలిస్ట్' కూడా 10 నామినేషన్లు దక్కించుకుంది. ఈ చిత్రంతో డెమీ మూర్ తన కెరీర్‌లో మొదటి సారి ఆస్కార్‌కు నామినేట్ అయ్యారు.

అనూజ

ఫొటో సోర్స్, X/netflixgolden

'అనూజ' చిత్రానికి నామినేషన్

బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా జోనస్ నిర్మించిన షార్ట్ ఫిల్మ్ 'అనూజ' 'బెస్ట్ లైవ్ యాక్షన్' కేటగిరీలో నామినేషన్ దక్కించుకుంది. ఆడమ్ జే గ్రేవ్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రియాంకా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌.

గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే అనూజ అనే తొమ్మిదేళ్ల బాలిక చుట్టూ ఈ కథ తిరుగుతుంది. తన లఘు చిత్రం ఆస్కార్ నామినేషన్లలో చోటు దక్కించుకోవడాన్ని నమ్మలేకపోతున్నట్లు ప్రియాంక సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

లాస్ ఏంజలెస్‌లోని డాల్బీ థియేటర్‌ వేదికగా మార్చి 2న అకాడమీ విజేతలను ప్రకటించనున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఆస్కార్

ఫొటో సోర్స్, Getty Images

ఆస్కార్ నామినేషన్ల జాబితా

ఉత్తమ చిత్రం కేటగిరీ

అనోరా

ది బ్రూటలిస్ట్

ఎ కంప్లీట్ అన్‌నోన్

కాన్‌క్లేవ్

డూన్: పార్ట్ 2

ఎమిలియా పరేజ్

ఐయామ్ స్టిల్ హియర్

నికిల్ బోయ్స్

ది సబ్‌స్టాన్స్

విక్డ్

జాక్వెస్ ఆడియార్డ్

ఫొటో సోర్స్, Getty Images

ఎమిలియా పెరెజ్ సినిమాకు జాక్వెస్‌ ఆడియార్డ్‌ దర్శకత్వం వహించారు.

ఉత్తమ దర్శకుడు

జేమ్స్‌ మ్యాన్‌గోల్డ్‌ (ది కంప్లీట్‌ అన్‌నోన్‌)

సీన్‌ బేకర్‌ (అనోరా)

బ్రాడీ కార్బెట్‌ (ది బ్రూటలిస్ట్‌)

జాక్వెస్‌ ఆడియార్డ్‌ (ఎమిలియా పెరెజ్)

కోరలీ ఫార్గేట్‌ (ది సబ్‌స్టాన్స్‌)

ఉత్తమ నటుడు

అడ్రియాన్‌ బ్రాడీ (ది బ్రూటలిస్ట్‌)

తిమోతీ చాలమెట్‌ (ది కంప్లీట్‌ అన్‌నోన్‌)

కోల్‌మ్యాన్ డొమింగో (సింగ్‌సింగ్‌)

రాల్ఫ్ ఫియనెస్‌ (కాన్‌క్లేవ్‌)

సెబాస్టియన్‌ స్టాన్‌ (ది అప్రెంటిస్‌)

 కార్లా సోఫియా గాస్కన్‌‌కు ఉత్తమ నటి కేటగిరీలో నామినేషన్ దక్కింది.

ఫొటో సోర్స్, Netflix

ఉత్తమ నటి

సింథియా ఎరివో (వికిడ్)

కార్లా సోఫియా గాస్కన్‌ (ఎమిలియా పెరెజ్)

మికే మాడిసన్‌ (అనోరా)

డెమీ మూర్‌ (ది సబ్‌స్టాన్స్‌)

ఫెర్నాండా టోరెస్‌ (ఐయామ్‌ స్టిల్‌ హియర్‌)

ఆస్కార్

ఫొటో సోర్స్, Getty Images

ఉత్తమ సహాయ నటుడు

యురా బోరిసోవ్‌ (అనోరా)

కిరెన్‌ కల్కిన్‌ (ది రియల్‌ పెయిన్‌)

ఎడ్వర్డ్‌ నార్తన్‌ (ది కంప్లీట్‌ అన్‌నోన్‌)

గాయ్‌ పియర్స్‌ (ది బ్రూటలిస్ట్‌)

జెరెమీ స్ట్రాంగ్‌ (ది అప్రెంటిస్‌)

వికిడ్ అరియానా గ్రాండే

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, వికిడ్ సినిమాలో నటించిన అరియానా గ్రాండే, సింథియా ఎరివోలకు ఆస్కార్ నామినేషన్లు దక్కాయి.

ఉత్తమ సహాయ నటి

మోనికా బార్బరో (ది కంప్లీట్‌ అన్‌నోన్‌)

అరియానా గ్రాండే (వికిడ్)

ఫెలిసిటీ జోన్స్‌ (ది బ్రూటలిస్ట్‌)

ఇసబెల్లా రోస్సెల్లిని (కాన్‌క్లేవ్‌)

జోయా సాల్దానా (ఎమిలియా పెరెజ్)

ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్

అనూజ

ఐయామ్ నాట్ ఏ రోబో

ది లాస్ట్ రేంజర్

ఏ లియెన్

ది మ్యాన్ హూ కుడ్ నాట్ రిమేన్ సైలెంట్

ఇవే కాకుండా ఒరిజినల్ స్క్రీన్ ప్లే, ఒరిజినల్ సాంగ్, ఒరిజినల్ స్కోర్, ఇంటర్నేషనల్ ఫీచర్, బెస్ట్ డాక్యుమెంటరీ, యానిమేటెడ్ ఫీచర్, కాస్ట్యూమ్, ప్రొడక్షన్, సౌండ్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, అడాప్టెడ్ స్క్రీన్ ప్లే తదితర కేటగిరీలలో నామినేషన్లు ప్రకటించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)