గూగుల్: మొన్న అమెరికా, నిన్న కెనడా.. టెక్ దిగ్గజాన్ని వెంటాడుతున్న కేసులు

గూగుల్

ఫొటో సోర్స్, Getty Images

ఆన్‌లైన్ వాణిజ్య ప్రకటనల మార్కెట్‌లో ఆధిపత్యం కోసం గూగుల్ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని కెనడా కాంపిటీషన్ బ్యూరో ఆరోపించింది.

కాంపిటీషన్ ట్రైబ్యునల్‌‌కు ఈ బ్యూరో పంపిన ఒక దరఖాస్తులో... గూగుల్ తన రెండు యాడ్ టెక్నాలజీ టూల్సను విక్రయించాలని సూచించింది.

కాంపిటీషన్ బ్యూరో అనేది మార్కెట్‌లో పోటీ నిబంధనలను క్రమబద్ధం చేసే సంస్థ.

ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది ఉపయోగించే క్రోమ్‌ వెబ్ బ్రౌజర్‌ను విక్రయించేలా గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్‌కు సూచించాలని అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ ఇటీవల పేర్కొంది.

ఆన్‌లైన్ సెర్చ్‌లో గూగుల్ గుత్తాధిపత్యాన్ని నియంత్రించడానికి ఉద్దేశించి అమెరికా న్యాయ విభాగం కోర్టు ముందుంచిన ప్రతిపాదన ఇది.

వారం తర్వాత ఇలాంటి కేసు కెనడాలో కూడా రావడం చర్చనీయమవుతోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఆన్‌లైన్ వెబ్ ప్రకటనల విక్రయంపై కేసు

ఆన్‌లైన్ వెబ్ ప్రకటనలంటే వెబ్‌సైట్‌లను సందర్శించినప్పుడు యూజర్ లకు కనిపించే ప్రకటనలు. అవి వెబ్‌సైట్‌లో ఎక్కడ ప్రదర్శించాలి అనేది కూడా ముఖ్యమైన అంశం. వెబ్‌సైట్ ప్రచురణకర్తలు తమ పేజ్‌లో కొంత స్పేస్‌ను (డిజిటల్ యాడ్ ఇన్వెంటరీ) ప్రకటనలు వేసుకునేెందుకు అమ్మకానికి ఉంచుతారు.

వీటిని కొనుగోలు లేదా విక్రయానికి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా వేలం జరుగుతుంది.

ఈ ప్లాట్‌ఫారమ్‌లను యాడ్ టెక్ టూల్స్ అని పిలుస్తారు.

అయితే కొనుగోలు ప్రక్రియలో ఉపయోగించే మొత్తం టూల్స్‌ను ‌ యాడ్ టెక్ స్టాక్ అంటారు.

గూగుల్ తన రెండు టెక్నాలజీ టూల్స్- డీఎఫ్‌పీ(డబుల్‌క్లిక్ ఫర్ పబ్లిషర్స్), ఏడీఎక్స్ (యాడ్ ఎక్స్‌చేంజ్)‌ను కస్టమర్స్ ఉపయోగించేలా చట్టవిరుద్ధంగా అనుసంధానించిందని విచారణలో తేలిందని బ్యూరో ఆరోపించింది.

ఇలా స్వంత యాడ్ టెక్ స్టాక్‌కు ప్రాధాన్యమిస్తూ సాధించుకున్న ఆధిపత్యాన్ని ప్రకటనల మార్కెట్‌‌లో పట్టు కోసం దుర్వినియోగం చేసిందని బ్యూరో తన వెబ్ సైట్‌లో పేర్కొంది.

గూగుల్

ఫొటో సోర్స్, Reuters

కాంపిటీషన్ బ్యూరో సూచనలేెెంటి.. గూగుల్ ఏమంటోంది

కెనడా మార్కెట్ పోటీ చట్టాలను అనుసరిస్తూ, గూగుల్ తన రెండు టెక్నాలజీ టూల్స్‌ను విక్రయించాలని, తన మొత్తం ఆదాయంలో 3 శాతం జరిమానాగా చెల్లించాలని కాంపిటీషన్ ట్రైబ్యునల్‌ను బ్యూరో కోరింది.

మా అడ్వర్టైజింగ్ టెక్నాలజీ టూల్స్ వెబ్‌సైట్‌లు, యాప్‌లు వాటి కంటెంట్‌కు నిధులు సమకూర్చడంలో సహాయపడతాయి. కొత్త కస్టమర్‌లను చేరుకోవడానికి అన్ని పరిమాణాల వ్యాపారాలను తోడ్పడుతుంది" అని గ్లోబల్ అడ్వర్టైజింగ్ వైస్ ప్రెసిడెంట్ డాన్ టేలర్ అన్నారు.

"ప్రకటన కొనుగోలుదారులు, అమ్మకందారులకు ఎంచుకోడానికి చాలా ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నయి. విపరీతమైన పోటి ఉంది. మేం కోర్టులో వివరణ ఇస్తాం" అని గూగుల్ ఒక ప్రకటనలో పేర్కొంది.

ట్రైబ్యునల్‌లో స్పందించేెందుకు గూగుల్ కి 45 రోజుల సమయం ఉంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)