ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో 31 మంది మావోయిస్టులు మృతి

మావోయిస్టులు

ఫొటో సోర్స్, UGC

    • రచయిత, అలోక్ పుతుల్
    • హోదా, రాయ్‌పూర్ నుంచి బీబీసీ కోసం

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల్లో 31 మంది మావోయిస్టులు మృతి చెందారని పోలీసులు చెప్పారు. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు భద్రతా సిబ్బంది కూడా మృతి చెందినట్లు తెలిపారు.

బీజాపూర్‌లోని నేషనల్ పార్క్ ఏరియా కమిటీ పరిధిలో ఉన్న అటవీ ప్రాంతాల్లో డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్, బస్తర్ ఫైటర్‌లకు, మావోయిస్టులకు మధ్య ఈ ఎదురుకాల్పులు జరిగాయి.

''బీజాపూర్‌లోని నేషనల్ పార్క్ ఏరియాలో అనుమానిత మావోయిస్టుల కదలికలు జరుగుతున్నాయనే సమాచారం అందుకున్న తరువాత, భద్రతా బలగాలకు చెందిన సంయుక్త బృందం ఆపరేషన్ కోసం వెళ్లింది. అక్కడే ఆదివారం అనుమానిత మావోయిస్టులు ఎదురుకాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు.'' పోలీసు అధికారి చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
చత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్

ఫొటో సోర్స్, Devendra Shukla

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

పోలీసులు చెబుతున్న ప్రకారం.. ఇప్పటి వరకు ఎదురుకాల్పులు జరిగిన ప్రదేశం నుంచి 31 మంది అనుమానిత మావోయిస్టుల మృతదేహాలను బయటికి తీసుకొచ్చినట్లు చెప్పారు. సంఘటనా ప్రాంతం నుంచి పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను, ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

దీనిలో, ఏకే47, ఎస్ఎల్ఆర్, ఐఎన్‌ఎస్ఏఎస్ రైఫిల్, 303, బీజీఎల్ లాంచర్ ఆయుధాలు, పేలుడు పదార్థాలు ఉన్నాయి.

ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు భద్రతా సిబ్బంది మరణించినట్లు ఐజీ బస్తర్ పీ సుందరాజ్ చెప్పారు. మరో ఇద్దరు భద్రతా సిబ్బందికి గాయాలు కూడా అయ్యాయని తెలిపారు. వారిని సంఘటనా ప్రాంతం నుంచి తరలించి, చికిత్స అందిస్తున్నామని చెప్పారు.

2024లో 233 మంది..

ఈ నెల ప్రారంభంలో బీజాపూర్‌లో జరిగిన ఒక ఎన్‌కౌంటర్‌లో 8 మంది మావోయిస్టులను చంపినట్లు భద్రతా బలగాలు చెప్పాయి.

జనవరి 20-21 తేదీల్లో గరియాబంద్‌లో సుమారు 75 గంటల పాటు సాగిన ఆపరేషన్‌లో 16 మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో చనిపోయినట్లు భద్రతా బలగాలు తెలిపాయి.

ఈ ఎదురుకాల్పుల్లో చనిపోయిన వారిలో మావోయిస్టు పార్టీ అగ్రనేత రామచంద్రారెడ్డి గారి ప్రతాప్ రెడ్డి అలియాస్ చలపతి అలియాస్ జయరాం మరణించినట్లు పోలీసులు ధ్రువీకరించారు.

జనవరి 16న కూడా ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 18 మంది మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. జనవరి 12న బీజాపూర్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు, జనవరి 9న సుక్మా-బీజాపూర్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు, జనవరి 4న ఐదుగురు అనుమానిత మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు తెలిపారు.

గత ఏడాది కాలంగా, చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు వ్యతిరేకంగా భద్రతా బలగాలు ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి.

2024లోనే, 223 మంది మావోయిస్టులను ఎన్‌కౌంటర్‌లో హతమార్చినట్టు భద్రతా బలగాలు చెప్పాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)