ఉత్తర కాశీ: సొరంగం నుంచి క్షేమంగా బయటకు వచ్చిన 41 మంది కార్మికులు... ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

ఉత్తరకాశీ సొరంగ ప్రమాదం

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, సొరంగం లోపల నుంచి బయటికి వచ్చిన తొలి కార్మికుడు

సిల్క్యారా సొరంగ ప్రమాదంలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను సహాయక సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రెస్క్యూ ఆపరేషన్ పూర్తి స్థాయిలో సక్సెస్ అయిందని వెల్లడించింది.

పైప్‌లైన్ నుంచి సురక్షితంగా బయటకు వచ్చిన మొదటి కార్మికుడిని రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇతర అధికారులు పలకరించారు.

సరిగ్గా 17 రోజుల కిందట సొరంగంలో చిక్కుకుపోయిన 41 కార్మికులను కాపాడేందుకు ముమ్మరంగా సహాయక చర్యలు మొదలయ్యాయి.

అయితే, మంగళవారం సాయంత్రానికి సొరంగంలో కార్మికులు ఉన్న ప్రదేశం వద్దకు పైప్ లైన్ వేసే పనులు పూర్తయ్యాయి. పైప్ లైన్ వేయడం పూర్తి అయిన కాసేపటికి, అందులో నుంచి ఒక కార్మికుడు సురక్షితంగా బయటకు వచ్చారు.

రెస్క్యూ ఆపరేషన్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు పైప్‌లైన్‌ లోపల లైట్స్‌ను అమర్చారు. లైట్స్ ఏర్పాటు పూర్తయిన తరువాత కార్మికులను బయటికి తీసుకొచ్చే చర్యలు ప్రారంభమయ్యాయి.

ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ సిబ్బంది కార్మికులను కాపాడేందుకు సొరంగంలోకి వెళ్లారు.

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామీ, ఇతర అధికారులు సహాయక ప్రాంతానికి చేరుకున్నారు. నాలుగు నుంచి ఐదుగురు ఎన్‌డీఆర్ఎఫ్ సభ్యులు సొరంగం లోపలికి వెళ్లినట్లు రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న వ్యక్తి చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, ANI

కార్మికుల ధైర్యం, సహనం స్ఫూర్తిదాయకం - ప్రధాని

సొరంగంలో చిక్కుకుపోయి సురక్షితంగా బయటికి వచ్చిన కార్మికులను, వారిని వెలికితీసిన సహాయక సిబ్బంది చర్యలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు.

‘‘ సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికుల ధైర్యం, సహనం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. అందరూ ఆరోగ్యకరంగా బాగున్నారని ఆశిస్తున్నా’’ అని ప్రధాని సోషల్ మీడియా ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో ట్వీట్ చేశారు.

ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ తాను సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు.

వారి ధైర్యం, పట్టుదల కార్మికులకు సరికొత్త జీవితం ఇచ్చిందని తెలిపారు.

ఈ మిషన్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ మానవత్వానికి, టీమ్ వర్క్‌కు అద్భుతమైన ఉదాహరణగా నిలిచారని అన్నారు.

సొరంగంలో నుంచి బయటికి తీసుకొచ్చిన కార్మికులను, టన్నెల్‌కు దగ్గర్లో తాత్కాలికంగా నిర్మించిన ఆస్పత్రికి తరలించారు.

వారి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పరీక్షించనున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అటా హస్నైన్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అటా హస్నైన్

సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు ఉత్తరకాశీ సిల్క్యారాలో జరుగుతున్న సహాయక ఆపరేషన్‌ రాత్రంతా కొనసాగుతుందని అంతకుముందు జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(ఎన్‌డీఎంఏ) సభ్యులు, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అటా హస్నైన్ చెప్పారు.

ప్రతి కార్మికుడిని బయటికి తీసేందుకు సుమారు మూడు నుంచి ఐదు నిమిషాలు పట్టనుందన్నారు.

మొత్తం మూడు నుంచి నాలుగు గంటల్లో కార్మికులందర్ని సొరంగం నుంచి బయటికి తీయనున్నామని తెలిపారు.

కార్మికులను బయటికి తీసుకొచ్చే విధానం
ఫొటో క్యాప్షన్, కార్మికులను బయటికి తీసుకొచ్చే విధానం
ఉత్తరకాశీ సొరంగం

ఫొటో సోర్స్, ANI

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ఏమన్నారంటే...

ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికుల రెస్క్యూ ఆపరేషన్‌కు సంబంధించి ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామీ మాట్లాడుతూ, కార్మికులను బయటకు తీసుకురావడానికి సొరంగంలో పైప్‌లైన్ వేయడం పూర్తయిందని చెప్పారు.

ఆయన కాసేపటి క్రితం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు.

‘‘భగవంతుని దయ, కోట్లాది మంది దేశ ప్రజల ప్రార్థనలు, రెస్క్యూ ఆపరేషన్ చేస్తోన్న అన్ని టీమ్‌ల అవిశ్రాంత కృషి ఫలితంగా కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు సొరంగంలో పైప్‌లైన్ వేసే పని పూర్తయింది. త్వరలోనే కార్మికులందర్నీ బయటకు తీసుకొస్తాం’’ అని ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 3

చినూక్ హెలికాప్టర్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, చినూక్ హెలికాప్టర్

కార్మికులను తరలించేందుకు చినూక్ హెలికాప్టర్

సొరంగం నుంచి కార్మికులను సురక్షితంగా బయటికి తీసుకొచ్చాక, వారికి వైద్య సేవలందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు.

కార్మికులు చిక్కుకున్న సొరంగం వద్దకు చినూక్ హెలికాప్టర్‌ను తీసుకొచ్చారు.

సొరంగం లోపలి నుంచి వారిని బయటికి తీయగానే, అంబులెన్స్ ద్వారా వారిని చిన్యాలిసౌర్ వద్దనున్న ఆరోగ్య కేంద్రానికి తరలించనున్నారు. అవసరమైతే, చినూక్ హెలికాప్టర్ ద్వారా వారిని తరలించాలని చూస్తున్నారు.

చినూక్ హెలికాప్టర్ ప్రత్యేకతేంటి?

  • చాలా వేగంగా ఇది ఎగరగలదు. దట్టమైన కొండలలో కూడా ఇది ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎగురుతుంది.
  • ఏ వాతావరణ పరిస్థితులునైనా తట్టుకోగలదు.
  • 11 టన్నుల వరకు ఇది మోయగలదు.
  • 19 దేశాలలో సైన్యాలు ఈ హెలికాప్టర్‌ను వాడుతున్నాయి.
అర్నాల్డ్ డిక్స్‌

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అర్నాల్డ్ డిక్స్‌

విదేశీ నిపుణులు అర్నాల్డ్ డిక్స్ ఏం చెప్పారు?

ఉత్తరకాశీలో జరుగుతున్న సహాయక చర్యల్లో కన్సల్టెంట్‌గా ఆస్ట్రేలియాకు చెందిన మైక్రోటన్నెలింగ్ నిపుణులు అర్నాల్డ్ డిక్స్‌ సేవలందిస్తున్నారు.

సహాయక సిబ్బందితో పాటు ఈయన కూడా రాత్రింబవళ్లు కార్మికులను రక్షించే చర్యలలో పాల్గొంటున్నారు.

ఈ సొరంగ ఆపరేషన్ అత్యంత క్లిష్టమైనదిగా అర్నాల్డ్ వర్ణించారు.

‘‘ఇది అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ అని నేననుకుంటున్నా. కేవలం సాంకేతిక కారణాలతో మాత్రమే కాదు, ఇది అతిపెద్ద ప్రమాదంతో కూడుకున్నది. ఇప్పటి వరకైతే ఎవరికీ గాయాలు కాలేదు. ప్రతి ఒక్కర్ని సురక్షితంగా బయటికి తీసుకురావాలని మేం ప్రయత్నిస్తున్నాం’’ అని అర్నాల్డ్ డిక్స్ బీబీసీతో అన్నారు.

సహాయక అధికారులు

ఫొటో సోర్స్, Getty Images

ఎన్‌డీఆర్ఎఫ్‌ది కీలక పాత్ర

కార్మికులను బయటికి తీసే సమయంలో, ఎన్‌డీఆర్ఎఫ్ కీలకపాత్ర పోషించనుంది.

నాలుగు ఎన్‌డీఆర్ఎఫ్ కార్మికులకు చెందిన మూడు ప్రత్యేక బృందాలు కార్మికులను బయటికి తీసేందుకు రంగంలోకి దిగాయి.

ఎస్‌డీఆర్ఎఫ్ వీరికి సాయం చేయనుంది. వీరిని రక్షించిన తక్షణమే వైద్య సేవలందించేందుకు అంబులెన్స్‌లు ప్రమాద స్థలానికి చేరుకున్నాయి. వైద్యుల బృందాన్ని కూడా సొరంగం లోపలికి పంపనున్నారు.

ఉత్తరకాశీ

ఫొటో సోర్స్, ASIF ALI

అంతకుముందు, సిల్క్యారా టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్‌ రోడ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అదనపు కార్యదర్శి మహమూద్ అహ్మద్ మాట్లాడుతూ, "మొత్తం 86 మీటర్లలో నిలువు డ్రిల్లింగ్ 44 మీటర్ల వరకు జరిగింది. అందుబాటులో ఉన్న ప్రతీ అవకాశాన్ని విడిచిపెట్టకుండా నిరంతరం పని చేస్తున్నాం. ఉదయం నుంచి టీహెచ్‌డీఎస్ వారు ఏడు పేలుళ్లు జరిపారు’’ అని చెప్పారు.

55.3 మీటర్ల వరకు హారిజాంటల్ డ్రిల్లింగ్ పనులు జరిగినట్లు ఆయన తెలిపారు.

‘‘ఈ పనిని మ్యాన్యువల్‌గా చేస్తున్నాం. ఈ ప్రక్రియలో మట్టిని తొలగించి పైప్‌లు వేస్తాం. ఇంకా 5 మీటర్లు ఈ పని చేయాల్సి ఉంది. కచ్చితంగా ఏమీ చెప్పలేం. కానీ, అంతా సవ్యంగా జరిగితే ఈరోజు సాయంత్రం లోగా కార్మికులకు సంబంధించి మంచి వార్తను వినొచ్చు’’ అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)