ఉత్తర భారతాన్ని వణికిస్తున్న చలిగాలులు

Dal Lake

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కశ్మీర్‌లోని దాల్ సరస్సులో కొద్దిప్రాంతం గడ్డకట్టింది.

ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాలు చలి గుప్పిట చిక్కుకున్నాయి.

కశ్మీర్‌లో అయితే కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొన్నిచోట్ల -6 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు పడిపోయాయి.

దాల్ సరస్సులో కొంత భాగం గడ్డకట్టింది. దీంతో అక్కడ పర్యటకుల కోసం బోట్లు నడిపేవారు ఇబ్బందులు పడుతున్నారు.

Water pipelines have frozen in Kashmir

ఫొటో సోర్స్, Getty Images

కశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల్లో నీటి పైప్‌లైన్లు కూడా గడ్డకట్టేశాయి. రోడ్డు రవాణాకు అంతరాయాలు ఏర్పడి సరకుల సరఫరా వ్యవస్థకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి.

దీంతో స్థానికులకు రోజువారీ అవసరాలకూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

దిల్లీలో ఇలా

ఫొటో సోర్స్, Getty Images

దేశ రాజధాని దిల్లీలో చలి, శీతల గాలులు తీవ్రంగా ఉన్నాయి. దిల్లీలోని కొన్ని ప్రాంతాలలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 2.2 డిగ్రీలకు పడిపోయాయి.

పేవ్‌మెంట్స్‌పై నివసించే నిరాశ్రయులంతా చలిగాలుల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మంచు

ఫొటో సోర్స్, Getty Images

దట్టమైన పొగమంచు కారణంగా రైళ్ల రాకపోకలకు అంతరాయాలు ఏర్పడ్డాయి.

రోజుకు సుమారు 23 లక్షల మంది ప్రయాణికులను తీసుకెళ్లే రైల్వే వ్యవస్థకు మంచు కారణంగా ఇబ్బందులు కలిగాయి.

అనేక రైళ్లు ఆలస్యమయ్యాయి.

కొన్ని రైళ్లు 10 గంటల పాటు ఆలస్యం అవుతుండడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.

దిల్లీలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి

ఫొటో సోర్స్, Getty Images

చలిగాలుల కారణంగా ప్రజలు ఆరోగ్య సమస్యలూ ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా దిల్లీలో ఈ పరిస్థితి ఉంది. శీతాకాలంలో కాలుష్యం స్థాయి అధికంగా ఉండే దిల్లీలో చలిగాలులు కూడా తీవ్రం కావడంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు.

రాజస్థాన్‌లో

ఫొటో సోర్స్, Getty Images

రాజస్థాన్‌లోనూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీని కారణంగా వ్యవసాయ పనులకు ఇబ్బంది ఏర్పడుతోందని రైతులు చెప్తున్నారు.

అమృత్‌సర్

ఫొటో సోర్స్, Getty Images

అమృత్‌సర్‌ను గత కొద్దిరోజులుగా దట్టమైన మంచు కమ్మేస్తోంది. బస్‌లు, రైళ్లు సహా రవాణా వ్యవస్థకు ఆటంకమేర్పడుతోంది.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)